నిత్య ప్రజ్ఞా సందేశములు - 366 - 31. అస్తిత్వం - చైతన్యం . . . / DAILY WISDOM - 366 - 31. Existence Which is . . .


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 366 / DAILY WISDOM - 366 🌹

🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀

📝. ప్రసాద్ భరద్వాజ్

🌻31. అస్తిత్వం - చైతన్యం మరియు ఆనందం🌻


చైతన్యం అనే అస్తిత్వం యొక్క లక్షణం ఆనందం. ఇది ఎందుకు ఆనందం? ఎందుకంటే, మీరు అనుభవించే బాధలు, కష్టాలు, పరిమితులన్ని కూడా మీ స్వభావం యొక్క పరిమితుల నుంచి పుడతాయి. ఒక వ్యక్తి అనంతుడు అయినప్పుడు, అన్ని కోరికలు నెరవేరుతాయి. అనంతత్వంలో అన్ని కోరికలు నశిస్తాయని అందరూ అనుకుంటారు కానీ అలా కాదు. అవి నెరవేరబడతాయి. మనం ఇప్పుడు కేవలం వస్తువుల యొక్క నీడను మాత్రమే అనుభూతి చెందుతున్నాము.

కానీ అక్కడ, ఒకరు స్వప్నంలోనుంచి మేల్కొని వస్తువుల యొక్క వాస్తవికతను చూసినట్లుగా, ఒక వ్యక్తి వస్తువుల యొక్క మూలరూపం తానే అవుతాడు. ఈ బ్రహ్మానందం కూడా అస్తిత్వం-చైతన్యం నుండి వేరు కాదు. అస్తిత్వమే చైతన్యం. అదే ఆనందం. గాఢనిద్రలో స్వయం అస్తిత్వం-చైతన్యం-ఆనందంగా ఉంటే, అది స్వప్న మరియు జాగృత స్థితుల్లో వేరేలా ఉంటుందా? ఉండదు, ఎందుకంటే ఇది విడదీయరానిది, అందువలన, అనంతం; అది ఎప్పుడూ అలాగే ఉంటుంది. అందువలన, ముఖ్యంగా, స్వయమే సత్-చిత్-ఆనందం. అస్తిత్వం-చైతన్యం-ఆనందం. ఇక్కడ అనంతం మరియు శాశ్వతత్వం ఒకదానిలో ఒకటి ఏకత్వంగా మిళితం అవుతాయి.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 366 🌹

🍀 📖 from The Philosophy of Religion 🍀

📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj

🌻31. Existence Which is Consciousness is Bliss🌻


Existence which is Consciousness is of the character of Bliss. Why is it Bliss? Because, all suffering and finitude, every difficulty and penury of any kind, is the result of the finitude of one's nature. When one has become the Infinite, all desires are fulfilled. The desires are not abolished or destroyed in the Infinite, as people may imagine. All wishes are totally fulfilled in their reality. We enjoy at present dream objects, a shadow of the substance, as it were.

But there, one becomes the archetype or the original of things, as if one in dream rises into the waking life and beholds the reality of things as they are. Even this Bliss is not separate from Existence-Consciousness. Existence, which is Consciousness, itself is bliss. If the Self is Existence-Consciousness-Bliss in deep sleep, can it be otherwise in the waking and dream states? No, because it is indivisible, thus, infinite; it would be the same always. Thus, essentially, the Self is Sat-Chit-Ananda, Existence-Consciousness-Bliss. Here Infinity and Eternity get blended into All-Being.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment