🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అభంగ్ - 17 🍀
హరి పార్ట్ కీర్తి ముఖే జరీ గాయ్!
పవిత్రచి హెయ్ దేహ త్యాచా!!
తపాచే సామర్ణ్యే తపిన్నలా అమూప్!
చిరంజీవ కల్స్ వైకుంఠ నాందే!!
మాతృ పితృ భ్రాతా సగోత్రీ అపార్!
చతుర్బుజ్ నర హెవూని తేలే!
జ్ఞాన గూఢగమ్య జ్ఞానదేవా లాధలే!
నివృత్తినే దిధలే మాఝ్యా హాతీ!!
భావము :
హరి పాఠము యొక్క కీర్తిని నోరార గానము చేసిన ఫలితముగ వారి దేహము పవిత్రమై పోగలదు.
తపః శక్తి యొక్క సామర్థ్యముతో అమితముగ తపించినవాడు కల్పాంతము వరకు చిరంజీవియై వైకుంఠమందు నివసించును. తల్లిదండ్రులు బంధు సమూహము మరియు అన్నదమ్ములు గోత్రీకులు సైతం చతుర్భుజ నరులై అందరు స్థిరపడతారు.
నా గురుదేవులు నివృత్తినాథులు జ్ఞానమందలి నిగూఢ రహస్యము అయిన గమ్యాన్ని చేర్చు హరి నామాన్ని నా చేతిలో పెట్టినారని జ్ఞానదేవులు తెలిపినారు.
🌻. నామ సుధ -17 🌻
హరిపాఠ కీర్తిని గానము
నోరార పాడిన ఫలితము
పవిత్రమయి పోవును దేహము
హరినామ మహిమ అపారము
తపఃశక్తి నిండిన సామర్థ్యము
తపించినాడు అమిత తపము
చిరంజీవియై కల్పాంతము
నివసించినాడు వైకుంఠధామము
తల్లిదండ్రులు బంధు సమూహము
సగోత్రికుల పరివారమపారము
చతుర్భుజులై నరుల స్వరూపము
అయిపోవుదురు అందరు స్థిరము
జ్ఞానములోని నిగూఢ గమ్యము
జ్ఞానదేవునికి లభించిన ఫలము
నివృత్తినాథుని కృపా ప్రసాదము
అప్పగించెను హరినామము
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
26 Dec 2020
No comments:
Post a Comment