🌹 18, JUNE 2023 SANDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹

🍀🌹 18, JUNE 2023 SANDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 18, JUNE 2023 SUNDAY ఆదివారం, భాను వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 386 / Bhagavad-Gita - 386 🌹
 🌴10వ అధ్యాయము - విభూతి యోగం - 14 / Chapter 10 - Vibhuti Yoga - 14 🌴
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 233 / Agni Maha Purana - 233 🌹 
🌻. స్నాన విధానము - స్నాపనోత్సవము - 3 / Mode of conducting the bathing festival (snāna) - 3 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 098 / DAILY WISDOM - 098 🌹 
🌻 7. సమగ్ర పద్ధతిలో ఆలోచించడం మనస్సుకు అలవాటు లేదు. / 7. The Mind is not Accustomed to Think in an Integral Fashion🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 364 🌹
6) 🌹. శివ సూత్రములు - 100 / Siva Sutras - 100 🌹 
🌻 2-07. మాతృక చక్ర సంబోధః   - 3 / 2-07. Mātrkā chakra sambodhah   - 3 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 18, జూన్‌, JUNE 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : జ్యేష్ఠ అమావాస్య, Jyeshta Amavasya🌻*

*🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 11 🍀*

*21. తీర్థక్రియావాన్ సునయో విభక్తో భక్తవత్సలః |*
*కీర్తిః కీర్తికరో నిత్యః కుండలీ కవచీ రథీ*
*22. హిరణ్యరేతాః సప్తాశ్వః ప్రయతాత్మా పరంతపః |*
*బుద్ధిమానమరశ్రేష్ఠో రోచిష్ణుః పాకశాసనః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : లోలోతులకు పోవలసిన ఆవశ్యకత - సాధనలో పైకి ఎక్కడం నేర్చుకొని సాధకుడు సకల సమస్యలనూ అతిక్రమించ వచ్చుననే మాట నిజమే. కాని, క్రిందనున్న సమస్యలు సమస్యలుగానే వుండగా అతడు ఎల్లకాలం పైననే పుండడం చాల కష్టం. సాధనలో పై పైకి వెళ్ళడం వలెనే లోలోతులకు లోపలకు పోవడం కూడా
ఉన్నది గనుక, ఈ సమస్యల పరిష్కారాని కతడు తన లోలోతులకు పోవడమనేది అత్యంతావశ్యకం. 🍀* 

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
జ్యేష్ఠ మాసం
తిథి: అమావాశ్య 10:08:42 వరకు
తదుపరి శుక్ల పాడ్యమి
నక్షత్రం: మృగశిర 18:08:54
వరకు తదుపరి ఆర్ద్ర
యోగం: దండ 24:58:14 వరకు
తదుపరి వృధ్ధి
కరణం: నాగ 10:08:42 వరకు
వర్జ్యం: 27:14:24 - 28:58:40
దుర్ముహూర్తం: 17:06:49 - 17:59:30
రాహు కాలం: 17:13:25 - 18:52:11
గుళిక కాలం: 15:34:39 - 17:13:25
యమ గండం: 12:17:07 - 13:55:53
అభిజిత్ ముహూర్తం: 11:51 - 12:43
అమృత కాలం: 08:41:58 - 10:24:42
సూర్యోదయం: 05:42:03
సూర్యాస్తమయం: 18:52:11
చంద్రోదయం: 05:29:54
చంద్రాస్తమయం: 19:13:50
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: జెమిని
యోగాలు: సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం
18:08:54 వరకు తదుపరి ధ్వాo క్ష యోగం
- ధన నాశనం, కార్య హాని
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 386 / Bhagavad-Gita - 386 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 14 🌴*

14. సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ |
న హి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవా న దానవా: ||

🌷. తాత్పర్యం :
ఓ కృష్ణా! నీవు నాకు తెలిపినదంతయు సత్యమని సంపూర్ణముగా నేను ఆంగీకరించుచున్నాను. ఓ దేవదేవా! దేవతలుగాని, దానవులుగాని నీ స్వరూపమును ఎరుగజాలరు.

🌷. భాష్యము :
*శ్రద్ధలేని వారు, దానవ ప్రవృత్తి గలవారు శ్రీకృష్ణభగవానుని ఎరుగజాలరని అర్జునుడు ఇచ్చట ధ్రువపరచుచున్నాడు. అతడు దేవతలకే తెలియబడుట లేదన్నచో ఆధునిక జగత్తుకు చెందిన నామమాత్ర పండితులను గూర్చి వేరుగా తెలుపనవసరము లేదు. కాని అర్జునుడు ఇచ్చట కృష్ణని కరుణ వలన అతనిని పరతత్త్వముగను, పరిపూర్ణునిగను తెలిసికొనగలిగెను. భగవద్గీతకు ప్రామాణికుడైన అట్టి అర్జునుని మార్గమునే ప్రతియొక్కరు అనుసరింపవలెను. చతుర్ధాధ్యాయమున తెలుపబడినట్లు గీతాధ్యాయనము కొరకు వలసిన పరంపర నశించియుండుటచే ఆ పరంపరను శ్రీకృష్ణభగవానుడు తిరిగి అర్జునునితో ప్రారంభించెను.*

*అర్జునుని సన్నిహిత స్నేహితుడనియు మరియు భక్తుడనియు ఆ దేవదేవుడు భావించుటయే అందులకు కారణము. కనుక ఈ గీతోపనిషత్తు యొక్క ఉపోద్ఘాతమున తెలుపబడినట్లు భగవద్గీతను పరంపరారూపముననే అవగతము చేసికొనవలెను. అట్టి పరంపర నశించియుండుట చేతనే దానిని పునరుద్ధరించుటకు అర్జునుడు ఎన్నుకోబడెను. శ్రీకృష్ణుడు పలికిన సర్వమును అర్జునుడు అంగీకరించిన విధమును తప్పక అనుసరింపవలెను. అప్పుడే భగవద్గీత సారము మనకు అవగతము కాగలదు. ఆ పిదపనే శ్రీకృష్ణుడు దేవదేవుడని మనము సంపూర్ణముగా అవగాహనము చేసికొనగలము.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 386 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 10 - Vibhuti Yoga - 14 🌴*

14. sarvam etad ṛtaṁ manye yan māṁ vadasi keśava
na hi te bhagavan vyaktiṁ vidur devā na dānavāḥ

🌷 Translation : 
*O Kṛṣṇa, I totally accept as truth all that You have told me. Neither the demigods nor the demons, O Lord, can understand Your personality.*

🌹 Purport :
*Arjuna herein confirms that persons of faithless and demonic nature cannot understand Kṛṣṇa. He is not known even by the demigods, so what to speak of the so-called scholars of this modern world? By the grace of the Supreme Lord, Arjuna has understood that the Supreme Truth is Kṛṣṇa and that He is the perfect one. One should therefore follow the path of Arjuna. He received the authority of Bhagavad-gītā.*

*As described in the Fourth Chapter, the paramparā system of disciplic succession for the understanding of Bhagavad-gītā was lost, and therefore Kṛṣṇa reestablished that disciplic succession with Arjuna because He considered Arjuna His intimate friend and a great devotee. Therefore, as stated in our Introduction to Gītopaniṣad, Bhagavad-gītā should be understood in the paramparā system. When the paramparā system was lost, Arjuna was selected to rejuvenate it. The acceptance by Arjuna of all that Kṛṣṇa says should be emulated; then we can understand the essence of Bhagavad-gītā, and then only can we understand that Kṛṣṇa is the Supreme Personality of Godhead.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 233 / Agni Maha Purana - 233 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 69*

*🌻. స్నాన విధానము - స్నాపనోత్సవము - 3 🌻*

*పూర్వాది సౌమ్యనవకమునందు మధ్య దధికలశ నుంచి, మిగిలిన కలశములందు. పత్ర-ఏలా-త్వక్‌-కూట-బాలక చందనద్వయలతా-కస్తూరీ-కృష్ణాగురు-సిద్ధద్రవ్యములను ఉంచవలెను. ఈశాన్యనవకమధ్యమున శాంతిజలపూర్ణ కుంభముంచవలెను. మిగిలిన కలశములతో క్రమముగ చంద్ర-తార-రజత-లోహ-త్రపు-కాంస్య-సీసక-రత్నముల నుంచవలెను. ప్రతిమకు ఘృతము పూసి, ఉద్వర్తనముచేసి, మూలమంత్రముతో స్నానము చేయించవలెను. మరల దానికి గంధాదులతో పూజ చేయవలెను.*

*అగ్నిలో హోమము చేసి పూర్ణాహుతి ఇవ్వవలెను. సకలభూతములకు బలిప్రదానముచేసి బ్రహ్మణునకు, దక్షిణాపూర్వకముగ భోజనము చేయించవలెను. దేవతలు, మునులు, అనేకులు రాజులు కూడ భగవద్విగ్రహమునకు అభిషేకముచేయటచేతనే ఐశ్వర్యాదులను పొందిరి. ఈ విధముగ ఒక వెయ్యి ఎనిమిది కలశములతో స్నాపనోత్సవము చేయవలెను. ఇట్లు చేయుటచే మానవుడు అన్ని కామములను పొందగలడు. యజ్ఞా,వభృథస్నానమునందు కూడ పూర్ణప్నానసిద్ది కలుగును. పార్వతీలక్ష్మ్యాదుల వివాహాదులలోకూడ స్నపనోత్సవము చేయబడును.*

*అగ్ని మహాపురాణమునందు స్నపనోత్సవవిధి యను ఆరువది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 233 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 69*
*🌻 Mode of conducting the bathing festival (snāna) - 3 🌻*

20. They should be anointed with ghee and lifted up and bathed with the principal mantra with perfumes and worshipped. Having offered oblations into the fire, the final oblation should be offered.

21. Offering should be made to all spirits. After paying fees to (the priest), (the priest and the brahmins) should be fed after having installed the images of deities, sages and other divinities.

22. Having installed (the image of the god) in this way one should conduct the bathing festival. One who bathes (the image) in one thousand eight pitchers gets all fortune.

23. By bathing at the conclusion of the rite, the bathing festival concludes. The marriage and other festivals of (the goddesses) Gaurī (consort of Śiva), Lakṣmī (consort of Viṣṇu) should be celebrated after the bathing festival.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 98 / DAILY WISDOM - 98 🌹*
*🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 7. సమగ్ర పద్ధతిలో ఆలోచించడం మనస్సుకు అలవాటు లేదు. 🌻*

*ప్రాపంచిక ఉనికి, ఆధ్యాత్మిక ఉనికి విడివిడిగా రెండు లేవని ప్రజలు కనీసం ఈ రోజునైనా గ్రహిస్తారా? ఇంతకుముందు వ్యక్తీకరించబడిన మన ఆలోచనలను పరిశీలిస్తే, ధర్మ, అర్థ, కామ మొక్షాలను విడివిడిగా కాక, ఒకే జీవిత ఆశయం యొక్క విభిన్న పార్శ్వాలుగా అర్థం చేసుకోగలుగుతారు. ముందు చెప్పినట్లుగా, ఇది చాలా కష్టమైన పని, ఎందుకంటే అలాంటి సమగ్ర పద్ధతిలో ఆలోచించడం మనస్సుకు అలవాటు లేదు.*

*కానీ ఇది తప్పదు. ఈ అవగాహన నుంచి ఎవరూ తప్పించుకోలేరు. జీవితానికి ఏదైనా అర్థం ఉండాలంటే, ప్రతి క్షణం కేవలం ఒక లక్ష్యం నుండి మరొక లక్ష్యం వైపుకు అవాంఛనీయంగా పరుగులు పెట్టడం ఉండకూడదు అనుకుంటే ఈ అవగాహన తప్పనిసరి. అర్థం, లేదా ఒకరి అన్వేషణ యొక్క భౌతిక వస్తువు, మొదటగా పరిగణించబడవచ్చు. ఎందుకంటే ఇది అనుభవ క్షేత్రంలో ప్రత్యక్షంగా ఆకర్షించే ఒక కేంద్రం. అంటే మన జ్ఞానేంద్రియాల ద్వారా మన అవగాహనకు వస్తుందని అర్థం-చూడడం, వినడం, రుచి చూడడం, వాసన చూడడం లేదా తాకడం ద్వారా మన అవగాహన లోనికి వచ్చే ఒక అంశం.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 98 🌹*
*🍀 📖 The Ascent of the Spirit 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 7. The Mind is not Accustomed to Think in an Integral Fashion 🌻*

*Would people realise at least today that existence in the world cannot be bifurcated from the existence of the Central Aim of Life? Gathering the outcome of our thoughts expressed earlier, we may proceed further to the art and the enterprise of blending dharma, artha, kama and moksha into a single body of human aspiration. As was indicated, this is a difficult job, for the mind is not accustomed to think in such an integral fashion.*

*But it has to be done, and one cannot escape it, if life is to have any meaning and not be a mere desultory drifting from one objective to another, every moment of time. Artha, or the material object of one’s pursuit, may be considered first, since it is this that seems to be the primary centre of life’s attraction in the immediately visible and tangible field of experience. The object is naturally the physical something that presents itself before a sense organ—seeing, hearing, tasting, smelling or touching.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 363 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. మనసు గతానికి, భవిష్యత్తుకు పరిగెడుతుంది. దాన్ని వర్తమానంలో నిలపాలి. అప్పుడు వ్యక్తి మెల్ల మెల్లగా యిక్కడ జీవించడం మొదలు పెడతాడు. మన నిజమైనతత్వం వర్తమానంలోొ వుంది. 🍀*

*మన లోపలి తత్వమే మన నిజమైనతత్వం. అదెక్కడో బయటలేదు. దానికోసం ఎక్కడో వెతకాల్సిన పన్లేదు. వ్యక్తి తన సొంత యింటికి రావాలి. ఇది ఇక్కడి నుండి అక్కడికి చేసే ప్రయాణం కాదు. దానికి భిన్నంగా అక్కడి నుండి యిక్కడికి చేసే ప్రయాణం. మనం ఇప్పటికే అక్కడున్నాం. మనం ఇక్కడికి చేరాలి. మనం ఎప్పుడూ 'అప్పుడు'లో వుంటాం. 'ఇప్పుడు'కి రావాలి.*

*కాబట్టి నీ మనసు ఎప్పుడు ఎక్కడికో బయల్దేరినా దాన్ని యిక్కడికి లాక్కు రావాలి. అది గతానికి, భవిష్యత్తుకు పరిగెడుతుంది. దాన్ని వర్తమానంలో నిలపాలి. అప్పుడు వ్యక్తి మెల్ల మెల్లగా యిక్కడ జీవించడం మొదలుపెడతాడు. మనం యిక్కడున్న క్షణం కలయిక జరుగుతుంది. బంధ మేర్పడుతుంది. మన నిజమైనతత్వం వర్తమానంలో వుంది.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 100 / Siva Sutras - 100 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 2-07. మాతృక చక్ర సంబోధః   - 3 🌻*
*🌴. ఒక గురువు సహాయంతో, యోగి మాతృక చక్ర జ్ఞానాన్ని మరియు మంత్ర శక్తులను స్వీయ-శుద్ధి మరియు స్వీయ-సాక్షాత్కారం కోసం ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటాడు. 🌴*

*విశ్వాన్ని నిలబెట్టే ముప్పై ఆరు తత్త్వాలు లేదా సూత్రాలు ఉన్నాయి. ముప్పై ఆరవది శివసూత్రం మరియు దానికి ముందుది శక్తి సూత్రం, ఇది శివుని శక్తి తప్ప మరొకటి కాదు. ముప్పై ఆరు తత్వాలు మొత్తంలో శివుని నుండి ప్రత్యేక అధికారాన్ని కలిగి ఉన్న ఆమె ద్వారా మాత్రమే నియంత్రించబడుతాయి. చైతన్యం, ఆనందం, సంకల్ప శక్తి, జ్ఞానం మరియు క్రియలకు శివుడు మూలం. వాటిని వరుసగా చిత్, ఆనంద, ఇచ్ఛా శక్తి, జ్ఞాన శక్తి మరియు క్రియా శక్తి అని పిలుస్తారు. కానీ, బ్రాహ్మానికి సత్-చిత్-ఆనంద అనే మూడు గుణాలు మాత్రమే ఉన్నాయని ఉపనిషత్తులు సూచిస్తున్నాయి. కాబట్టి, ఉపనిషత్తులు బ్రహ్మాన్ని సచ్చిదానంద అని సంబోధించాయి.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras  - 100 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 2-07. Mātrkā chakra sambodhah   - 3 🌻*
*🌴. With the help of an guru, a yogi gains the knowledge of matruka chakra and how to harness the mantra shaktis, for self-purification and self-realization.  🌴*

*There are thirty six tattva-s or principles in place that make the universe sustain. Thirty sixth is the principle of Śiva and the penultimate being the principle of Śaktī, who is nothing but the energy of Śiva. The entire spectrum of thirty six tattva-s is controlled only by Her, who holds an exclusive authority from Śiva. Śiva is the source of consciousness, bliss, energy of will, knowledge and action. They are respectively known as cit, ānanda, icchā śakti, jñāna śakti, and kriyā śakti. But, Upaniṣads point out that the Brahman has only three qualities sat-cit- ānanda. Therefore, Upaniṣads address the Brahman as saccidānanda.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama

No comments:

Post a Comment