శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 460 -3 / Sri Lalitha Chaitanya Vijnanam - 460 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 460 -3 / Sri Lalitha Chaitanya Vijnanam - 460 - 3 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।
కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀

🌻 460. 'సుభ్రూ' - 3 🌻


రెండు కొండల నడిమి లోయలోని ఆకాశముగ తదేక దృష్టితో దర్శించినపుడు యిట్టి కాంతి దర్శనము జరుగుటకు అవకాశమున్నది. ఆరాధనా మార్గమున జీవతత్త్వమును కూడిక చేసుకొని మనసును పూర్ణముగ యిచ్చట నిలిపి తేజోవంతమగు శ్రీమాత దర్శనమునకు అచటనే వేచి యుండుట నిత్యమూ భక్తులు నిర్వహించ వలసిన కార్యము. భక్తి పూర్వకమగు ఆరాధనము జరిగిన వెనుక కన్నులు మూసుకొని భ్రూమధ్యమున లేచి యుండుట నేర్వవలెను. త్రికరణశుద్ధిగ యిట్లు నిర్వర్తించు వారికి దర్శన స్పర్శన భాషణాదులు అనుగ్రహముగ లభింపగలవు. వేణు గానము వినిపింప గలదు. అది ప్రణవనాదమై జీవుని అంతరాళము లోనికి గొనిపోగలదు. తోరణములు ప్రవేశ ద్వారము వద్ద కట్టుట ఆచారము. దీని రహస్యము తెలియుట ప్రధానము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 460 - 3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika
Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻

🌻 460. 'Subhru' - 3 🌻


There is a chance of seeing this light when looking at the sky in the valley between the two hills. Devotees should always perform the task of gathering life essence in the way of worship and should wait for the vision of the radiant Sri Mata by concentrating their life force here. After performing devotional worship, one should learn to close the eyes and get up in the brow centre. Those who perform this with utmost sincerity can be blessed with clairvoyance, divine touch and clairaudience. The song of the flute can be heard. It becomes Pranava and can penetrate into depths of the living being. It is customary to build arches at the entrance. It is important to know its secret.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment