🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 534 / Vishnu Sahasranama Contemplation - 534 🌹


*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 534 / Vishnu Sahasranama Contemplation - 534🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 534. త్రిపదః, त्रिपदः, Tripadaḥ 🌻*

*ఓం త్రిపదాయ నమః | ॐ त्रिपदाय नमः | OM Tripadāya namaḥ*

త్రిపదః, त्रिपदः, Tripadaḥ

*అస్య త్రీణి పదానీతి త్రిపదో విష్ణురుచ్యతే ।*
*త్రీణి పదా విచక్రమ ఇత్ శ్రుతిసమీరణాత్ ॥*

*మూడు అడుగులతో త్రిలోకములనూ ఆక్రమీంచినవాడు గనుక, ఆ విష్ణుదేవుని త్రిపదః అని కీర్తింతురు. త్రీణి పదా విచక్రమే (ఋగ్వేదము, తైత్తిరీయ బ్రాహ్మణము 2.4.6) మూడు అడుగులతో పరమాత్మ లోకత్రయమును విక్రమించెనని శ్రుతి చెప్పుచున్నది.*

:: పోతన భాగవతము అష్టమ స్కంధము ::
సీ. దానవ! త్రిపదభూతల మిత్తు నంటివి ధరణిఁ జంద్రార్కు లెందాఁక నుందు
రంతభూమియు నొక్క యడుగయ్యె నాకును; స్వర్లోకమును నొక్క చరణమయ్యె;
నీ సొమ్ము సకలంబు నేఁడు రెండడుగులు; గడమ పాదమునకుఁ గలదె భూమి?
యిచ్చెద నన్నర్థ మీని దురాత్ముండు నిరయంబుఁ బొందుట నిజము గాదె?
తే. కాన దుర్గతికిని గొంతకాల మరుగు, కాక యిచ్చెదవేని వేగంబు నాకు
నిపుడు మూఁడవ పదమున కిమ్ము చూపు, బ్రాహ్మణాధీనములు ద్రోవ బ్రహ్మవశమె? (641)

*ఓ దనుజేంద్రా! మూడడుగుల నేల ఇస్తానంటివి. భూలోకమూ చంద్ర సూర్యులదాకా ఉండే స్థలమూ నాకు ఒక అడుగైనది. స్వర్గలోకం ఒక అడుగైనది. నీ సంపద అంతా ఈ నాడు రెండడుగులైనది. ఇక మూడవ అడుగుకు ఎక్కడుంది చోటు? ఇస్తానన్న అర్థాన్ని ఇవ్వనివాడు నరకాన్ని పొందడం నిజం. అందువల్ల కొంతకాలం నరకానికి వెళ్ళు. అట్లా కాకుండా మూడవ అడుగు ఇవ్వదలచుకొంటే ఆ చోటు నాకు తొందరగా చూపు. బ్రాహ్మణులకు స్వాధీనం కావలసిన దానిని కాదనటానికి బ్రహ్మకుకూడా సాధ్యం కాదు కదా!*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 534🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻534. Tripadaḥ🌻*

*OM Tripadāya namaḥ*

अस्य त्रीणि पदानीति त्रिपदो विष्णुरुच्यते ।
त्रीणि पदा विचक्रम इत् श्रुतिसमीरणात् ॥

*Asya trīṇi padānīti tripado viṣṇurucyate,*
*Trīṇi padā vicakrama it śrutisamīraṇāt.*

*He has placed three steps to occupy the three worlds and hence He is Tripadaḥ.*

:: श्रीमद्भागवते द्वितीयस्कन्धे सप्तमोऽध्यायः ::
ज्यायान्गुणैरवरजोऽप्यदितेः सुतानां
     लोकान्विचक्रम इमान्यदथाअथाधियज्ञः ।
क्ष्मां वामनेन जगृहे त्रिपदच्छलेन
     याच्ञामृते पथि चरन्प्रभुभिर्न चाल्यः ॥ १७ ॥

Śrīmad Bhāgavata - Canto 7, Chapter 17
Jyāyānguṇairavarajo’pyaditeḥ sutānāṃ
     Lokānvicakrama imānyadathāathādhiyajñaḥ,
Kṣmāṃ vāmanena jagr‌he tripadacchalena
     Yācñāmr‌te pathi caranprabhubhirna cālyaḥ. 17.

*The Lord, although transcendental to all material modes, still surpassed all the qualities of the sons of Aditi, known as the Ādityas. The Lord appeared as the youngest son of Aditi. And because He surpassed all the planets of the universe, He is the Supreme God. On the pretense of asking for a measurement of three footsteps of land, He took away all the lands of Bali Mahārāja. He asked simply because without begging, no authority can take one's rightful possession.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः ।त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृंगः कृतान्तकृत् ॥ ५७ ॥
మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః ।త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాన్తకృత్ ॥ 57 ॥
Maharṣiḥ kapilācāryaḥ kr‌tajño medinīpatiḥ,Tripadastridaśādhyakṣo mahāśr‌ṃgaḥ kr‌tāntakr‌t ॥ 57 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

No comments:

Post a Comment