*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 75. విశ్వాధికా, వేదవేద్యా, వింధ్యాచల నివాసినీ ।*
*విధాత్రీ, వేదజననీ, విష్ణుమాయా, విలాసినీ ॥ 75 ॥ 🍀*
*🌻 335-1. 'వేదవేద్యా' 🌻*
*వేదములచే తెలియదగినది శ్రీమాత అని అర్థము. శ్రీదేవి చింతామణి గృహమునకు నాలుగు దిక్కుల యందు నాలుగు ద్వారము లున్నవి. ఏ ద్వారము నుండైనను శ్రీదేవి గృహము నందు ప్రవేశించి దేవిని దర్శింపవచ్చును. నాలుగు ద్వారములు నాలుగు వేదములుగ తెలియవలెను. శ్రీదేవి గృహమును ప్రవేశించుటకు నాలుగు వేదములలో ఒక్క వేదమైననూ తెలియవలెను. వేదములు నాలుగు. అవి వరుసగ ఋగ్వేదము, యజుర్వేదము, అధర్వణ వేదము, సామవేదము. ఋగ్వేదము తూర్పు ద్వారము; యజుర్వేదము దక్షిణ ద్వారము; అధర్వణ వేదము పశ్చిమ ద్వారము; సామవేదము ఉత్తర ద్వారము.*
*మన యందు కలుగు సంకల్పములు పుట్టినచోటు నెరుగుట ఋగ్వేదము నెరుగుట. సంకల్పమే సరస్వతి. సరస్వతి పరావాక్కుగను, పశ్యంతి వాక్కుగను, మధ్యమ వాక్కుగను, వైఖరి వాక్కుగను నిత్యము వ్యక్తమగు చుండును. సరస్వతి శ్రీదేవితో నున్నప్పుడు పరావాక్కు సంకల్పమై స్ఫురించినపుడు జీవునికి తెలియును. అది పశ్యంతి వాక్కు, అది వివరమై భావ - భాష రూపము దాల్చినపుడు మధ్యమ వాక్కు కంఠము నుండి ఉచ్చరించినపుడు వైఖరి వాక్కు అగుచున్నది. ఇట్లు నిత్యము సరస్వతి జీవులయందు ప్రవహించుచునే యున్నది.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 335-1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 75. Vishvadhika vidavidya vindhyachala nivasini*
*Vidhatri vidajanani vishnu maya vilasini ॥ 75 ॥ 🌻*
*🌻 335-1. Veda-vedyā वेद-वेद्या (335) 🌻*
*She can be known through Veda-s. All the Veda-s lead to the Supreme Reality, the Brahman. Brahman is the embodiment of Veda-s.*
* Kṛṣṇa says, (Bhagavad Gīta XV.15) “By all the Veda-s, I am to be known. …I am the knower of all Veda-s”.*
*Veda-s can be known only through knowledge. In other words, unless one has knowledge, the Self-realization is not possible. Brahman is the essence of that knowledge. There is a difference between Veda-s and Vedānta. Vedānta refers to the teachings of Upaniṣads. Study of Upaniṣads gives the necessary impetus to the knowledge. It is also said that Śrī Cakra has four gates on the four sides and each gate represents one Veda. Knowing Her through Veda-s is called Śuddha Vidya (the perfect knowledge) in contrast to Śrī Vidya that deals predominantly with rituals. *
* No doubt, some good interpretations on Veda-s are available, but the fact is that Veda-s are beyond human interpretation. If one looks at the Veda-s, one may tend to believe that they talk about external fire rituals. In fact they do not. They convey several subtle interpretations and only out of such interpretations, Upaniṣads originated. Upaniṣads do plain speaking and to the point. They make attempts to qualify the Brahman by affirmations and negations. She is in the form of essence of Veda-s.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
No comments:
Post a Comment