*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻 39. వసంతము 🌻*
*వసంతము విసుగుదల, చిరాకు, అలసటలను పారద్రోలి ఉత్సాహమునకు, ఆనందమునకు తెర ఎత్తును. వసంతమున చైతన్యము విద్యుత్ ప్రవాహమువలె జీవులను మేలుకొలిపి చైతన్య వంతులను చేయును. ఉన్నతోన్నతమైన భావములను ఆవిష్కరించును. భగవత తత్త్వము పూర్ణముగ ప్రతి అణువునందును వసించు సమయమే వసంతము. జీవకోటి అంతయు శిశిరము నుండి వసంత మునకు ఎదురు చూచుచుండును.*
*వేలాది సంవత్సరముల నుండి మహత్తర మైన మరియు చైతన్యవంతమైన ఘట్టములు భూమిపై వసంతము నందే జరిగినవి. వసంతము భూమికే నవచైతన్యము ప్రసాదించును. వసంత ఋతువున మొదటి తొమ్మిది రోజులు ప్రత్యేక దీక్షను వహించుటకు అనుకూలములు. ఇవియే వసంత నవరాత్రులు. అటుపై యాభై రోజులు ఈ దీక్షను కొనసాగించిన వారికి సంవత్సర మంతయును సరిపడ చైతన్యము వారియందు స్థిరపడును. వసంత ఋతువు మొత్తము సాధకులు క్రమబద్ధమైన జీవితమును గడుపవలెనని మా ఆకాంక్ష!*
*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
No comments:
Post a Comment