నిత్య ప్రజ్ఞా సందేశములు - 257 - 13. తంత్ర సాధన / DAILY WISDOM - 257 - 13. Tantra Sadhana


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 257 / DAILY WISDOM - 257 🌹

🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 13. తంత్ర సాధన 🌻


తంత్రం ద్వారా చేసే అభ్యాసం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, అంతర్గతం కోసం బాహ్యాన్ని తిరస్కరించడం, ఆధ్యాత్మికం కోసం పదార్థాన్ని తిరస్కరించడం లేదా జీవితంలోని ప్రతి ఆనందాన్ని మొత్తంగా నిర్మూలించాల్సిన చెడుగా పరిగణించడం వంటి నిర్దిష్ట ఆదేశం లేదు. తంత్రానికి, ప్రపంచంలోని విషయాలు, అవగాహన యొక్క భౌతిక రూపాలు నిజంగా అడ్డంకులు కావు. కేవలం కోరికను తిరస్కరించడం ద్వారా వాటి కోసం మనలో ఉన్న భావాన్ని అధిగమించలేము. సరైన సందర్భంలో మరియు ఆత్మతో చూసినప్పుడు, ఈ ప్రపంచంలోని ప్రతిదీ, దాని వ్యక్తీకరణలు మరియు ఈ ప్రపంచం మొత్తం పరిపూర్ణతకు మార్గం అవుతాయి.

కనిపించేది అదృశ్యానికి మార్గం. మానవునిలో కోరికలు ఏదైనా కోరిక పట్ల మనిషిలో అభివృద్ధి చెందే తెలివితక్కువ దృక్పథం కారణంగా పుడతాయి. దానితో పాటు కోరిక యొక్క ఒత్తిడి అతనిపై పట్టు సాధిస్తున్నట్లు, తన నియంత్రణ తనపై లేకుండా చేస్తుందనే భయం కూడా ఉంది. వస్తువుకు అతీత వాస్తవానికి విడదీయ రాని సంబంధము ఉందని, వస్తువు అతీతానికి భౌతిక ధృవంగా ఉన్నందున, విషయంపై ధ్యానం చేయడం అనేది తాంత్రిక రూపాలలో ప్రముఖంగా చెప్పబడింది. కోరికను కోరిక ద్వారా మాత్రమే అధిగమించవచ్చు, వస్తువును వస్తువు ద్వారా మాత్రమే అధిగమించవచ్చు అనే సూత్రం తంత్రం యొక్క గొప్పగా చెప్పబడినది. 'దేని వల్ల మనిషి పడిపోయాడో, తిరిగి దాని వల్లనే పైకి లేస్తాడు' అనేది ఈ తంత్ర సూత్రంలోని ఇంకో అంశంగా చెప్పబడింది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 257 🌹

🍀 📖 from Essays in Life and Eternity 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 13. Tantra Sadhana🌻


A specialty of practice through Tantra is that there is no specific injunction towards a rejection of the outer for the sake of the inner, the material for the sake of the spiritual, or a considering of every joy in life as an evil to be eradicated wholesale. To the Tantra, the things of the world, the material forms of perception, are not really obstacles, and the desire for them cannot be overcame by rejecting the desire itself. Everything in the world, the world itself in its entirety, is a passage to perfection when its manifestations are viewed in their proper context and spirit.

The visible is a way to the invisible. Human desires arise on account of the unintelligent attitude that man develops towards any desire, and there is a fear of desire since its pressure seems to be mastering him rather than himself being its controller arid director. The fact that the object is inseparably related to the subject, because the object is just the other pole of which the subject is one phase, is highlighted in Tantric forms of meditation. Thus comes the great dictum of the Tantra, that desire can be overcome only by desire, even as the object can be overcome only by the object. The other aspect of this principle held by the Tantra is that ‘that by which one falls is also that by which one rises'.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


30 Mar 2022

No comments:

Post a Comment