మైత్రేయ మహర్షి బోధనలు - 96


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 96 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 78. రసాయనము -2 🌻


సాధకుడు సామాన్యముగ స్థూలబుద్ధి. గురువు సూక్ష్మబుద్ధి. గురువందించిన సూత్రములను అనుస్యూతముగను, అదృశ్యముగను నిర్వర్తించు కొనుటే అతని కర్తవ్యము. అతని యందు జరుగు మార్పులను అతడు గమనింప లేడు. సద్గురువు గమనించుచునే యుండును. మార్పు సూక్ష్మము నుండి స్థూలమునకు జరుగుచు, ఒక దశలో స్థూలమున కూడ ప్రకటింపబడును.

పండిన పండు, విచ్చిన పూవు, రత్నము, బంగారము స్వయంప్రకాశములే. అంతియే కాదు, అవి జీవుల కత్యంత ఉపయోగకరము. సాధకుడు సిద్ధుడగుట కూడ లోకశ్రేయస్సు కొరకే. అది తనయందు జరుగు రసాయనము యొక్క ఫలము. రసాయనము జరుగుటకు నిరంతర సాధన, మౌనము ప్రధానములు. వాచాలత్వము దీనికి విరుద్దము.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


30 Mar 2022

No comments:

Post a Comment