శ్రీ శివ మహా పురాణము - 542 / Sri Siva Maha Purana - 542
🌹 . శ్రీ శివ మహా పురాణము - 542 / Sri Siva Maha Purana - 542 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 49 🌴
🌻. బ్రహ్మ మోహితుడగుట - 2 🌻
దేవతలిట్లు పలికిరి -
ఓ దేవదేవా! జగత్తును వ్యాపించి యున్నవాడా! పరమేశ్వరా! సదాశివా! జగత్ర్పభూ! జగత్స్వ రూపా! ప్రసన్నుడవు కమ్ము (11). సర్వ ప్రాణులకు ఆత్మ, కారణము, ఈశ్వరుడు నీవే. నీవు వికార రహితుడవు, నాశము లేనివాడవు. నిత్యము, నిర్వికల్పము, అక్షరము అగు పరబ్రహ్మవు నీవే (12).
ఆది, అంతము, మధ్యము, ఇది, మరియొకటి, నేను, నాకంటె బిన్నము ఇత్యాది భేదములు లేనిది అవ్యయము, సచ్చిద్ఘనము ఆగు ఆ పరబ్రహ్మ నీవే (13). ముముక్షువులు, దృఢవ్రతులు అగు మునులు ఇహపరముల యందు సంగమును వీడి నీ పాద పద్మములను మాత్రమే సేవించెదరు (14).
పూర్ణము, అమృతము, శోకరహితము, నిర్గుణము, ఆనందఘనము, వ్యగ్రత లేనిది, వికారములు లేనిది, ఉపాధికంటె భిన్నమైనది అగుపర బ్రహ్మ నీవే (15). జగత్తు యొక్క సృష్టి స్థితిలయములకు కారణము నీవే. ఆ జగత్తునకు ఆత్మ, ప్రభుడు నీవే. సర్వ వ్యాపకుడవగు నీవు ఏనాడైననూ జగత్తపై ఆదారపడిలేవు (16).
నీవు ఒక్కడివే అయిననూ కార్య కారణ రూపములను పొంది ద్వైతముగను, అద్వైత స్వరూపుడగను ఉన్నావు. ఒకే బంగారము ఆబరణములగను, స్వరూపముగను ఉన్నది గదా! వస్తు భేదము లేనే లేదు (17). జనులు అజ్ఞానముచే నీ యందు భేదమును దర్శించెదరు. కావున భ్రమను నివారించుట ఆవశ్యకమగు చున్నది. ఉపాధికి అతీతుడవగు నీయందు బేదము లేదు (18).
మహేశ్వరా! నీ దర్శన మాత్రముచే మేము ధన్యులమైతిమి. దృఢమగు భక్తి గల మానవులకు ఆనందమునిచ్చే ఓ శంకరా! దయను చూపుము (19). జగత్తునకు నీవే కారణము. కాని నీకు కారణము లేదు. ప్రకృతికి అతీతుడగు పురుషుడవు నీవే. నీవు విశ్వేశ్వరుడవు, జగన్నాథుడవు, వికారములు లేని వాడవ, పరాత్పరుడవు (20). హే ప్రభో! ఈ బ్రహ్మ నీ అనుగ్రహముచే రజోగుణ ప్రధానుడై విరాడ్రూపుడు, లోకమునకు పితామహుడా అయినాడు. సత్త్వ గుణ ప్రదానుడగు విష్ణువు పురుషోత్తముడైనాడు (21).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 542 🌹
✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 49 🌴
🌻 The delusion of Brahmā - 2 🌻
The gods said:—
12. O lord of gods, O pervader of the universe, O Sadāśiva, O lord of the universe, O lord of the world or the very world itself, be pleased.
13. You are the supreme soul, the supreme lord and the cause of all emotions. You are free from aberrations, devoid of wastage. You are eternal, free from suspicions and doubts. You are undying. You are the great god.
14. You are Truth, Brahman and Consciousness. You are imperishable, from whom have originated the beginning, the end and the middle of visible worlds, even I too. These visible things are not the true ones.
15. The sages, desirous of liberation, worship and meditate upon your lotus feet. They are steady in their resolve. They avoid attachment on either side.
16. You are the perfect Brahman, the nectar, free from grief, devoid of attributes and the great one. You are the sole bliss, free from excitement, aberrations and even static and insentient.
17. You are the cause of production, sustenance and dissolution of the universe Śiva, the lord of souls, is greater than the universe. He is free from the necessity of its aid. He is always pervasive.
18. You are the One, both Sat and Asat. You are non-dual. Gold whether as the basic metal or as the ready made ornament does not alter in its basic and intrinsic essence.
19. People have doubts in you by their ignorance. The remedy for illusion lies in thinking on your Nirguṇa aspect, not by itself.
20. O supreme lord, we are blessed by your very vision. O Śiva, you are the bestower of supreme bliss to the people who are steady in their devotion. Have mercy.
21. You are the primordial Being. You have no beginning. You are the Puruṣa beyond the Prakṛti. You are the lord of the universe. You are the lord of the world. You are free from aberrations. You are greater than the greatest.
Continues....
🌹🌹🌹🌹🌹
31 Mar 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment