శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 360-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 360-1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 360-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 360-1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 79. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా ।
తరుణీ, తాపసారాధ్యా, తనుమధ్యా, తమోఽపహా ॥ 79 ॥ 🍀
🌻 360-1. 'తనుమధ్యా' 🌻
సన్నని నడుము కలది శ్రీదేవి అని అర్థము. శరీరము మధ్య భాగము అని తెలుపునది ఈ నామము. నడుము మధ్యభాగ మగుటచేతను మధ్యా అందురు. సృష్టి భగవంతుని శరీరము. దానియందు కూడ మధ్యభాగమున నుండునది శ్రీదేవి. తనువును రథము అని కూడ అందురు. రథము మధ్య భాగమున నుండునది అని కూడా తెలుపుచూ శ్రీ సూక్తమున, శ్రీమాతను 'రథమధ్యా' అని కూడ అందురు.
అవ్యక్తమునకు వ్యక్తమునకు మధ్య నుండునది చైతన్యము, ఆమె శ్రీమాత. లోకమునకు లోకమునకు మధ్య నుండునది శ్రీమాత. లోపలకు వెలుపలకు మధ్యనుండునది శ్రీమాత. తాను శుద్ధ చైతన్యమే అయిననూ తన సృష్టి యందు ఆవరణలు ఏర్పరచుచూ లోకములకు నడుమ మరియు లోకములుగను నుండునది శ్రీమాత. అణువునకు అణువునకు మధ్య నుండి పరస్పరత నేర్పరచుచు నుండును. అందు వలన ఆమెను 'ఆర్దాం' అని కూడ పిలుచుదురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 360-1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 79. Tapatrayagni santapta samahladana chandrika
Tatuni tapasaradhya tanumadhya tamo-paha ॥ 79 ॥ 🌻
🌻 360. Tanumadhyā तनुमध्या 🌻
She has slender waist. Please refer nāma 85 also. There is a meter by name tanumadhya. Meter or chandas refers to the number of alphabets or words in a verse as per Sanskrit literature.
She is said to be in the form of this meter. Kṛṣṇa says, (Bhagavad Gīta X.35)” Gāyatrī candasāmahaṁ (गायत्री चन्दसामहं)” that He is in the form Gāyatrī meter.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
31 Mar 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment