2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 31-1 - 344 - అనన్య భక్తి🌹
3) 🌹. శివ మహా పురాణము - 542 / Siva Maha Purana - 542 🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -172🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 161 / Osho Daily Meditations - 161 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 360-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 360-1🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ గురువారం మిత్రులందరికీ 🌹*
*బృహస్పతి వాసరే, 31, మార్చి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*
*🍀. శ్రీ కల్కి స్తోత్రం - 10 🍀*
*10. తవ జగద్వపుః సుందరస్మితం*
*ముఖమనిందితం సుందరాననమ్ |*
*యది న మే ప్రియం వల్గుచేష్టితం*
*పరికరోత్యహో మృత్యురస్త్విహ*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : భక్తి అంటే ఉన్నత ఆదర్శములతో మేళవింప బడిన ఆత్మీయతయే - పండిత శ్రీరామశర్మ ఆచార్య 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ : 1943, ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: కృష్ణ చతుర్దశి 12:24:50 వరకు
తదుపరి అమావాశ్య
నక్షత్రం: పూర్వాభద్రపద 10:32:35 వరకు
తదుపరి ఉత్తరాభద్రపద
యోగం: శుక్ల 11:07:27 వరకు
తదుపరి బ్రహ్మ
కరణం: శకుని 12:25:49 వరకు
వర్జ్యం: 20:10:36 - 21:47:12
దుర్ముహూర్తం: 10:17:29 - 11:06:39
మరియు 15:12:26 - 16:01:36
రాహు కాలం: 13:52:33 - 15:24:44
గుళిక కాలం: 09:16:02 - 10:48:13
యమ గండం: 06:11:42 - 07:43:52
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:44
అమృత కాలం: 02:37:00 - 04:11:48
సూర్యోదయం: 06:11:42
సూర్యాస్తమయం: 18:29:05
చంద్రోదయం: 05:38:36
చంద్రాస్తమయం: 17:48:24
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: మీనం
ముద్గర యోగం - కలహం 10:32:35
వరకు తదుపరి ఛత్ర యోగం
- స్త్రీ లాభం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
#PanchangDaily
#DailyTeluguCalender
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -344 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 31 📚*
*🍀 31-1. అనన్య భక్తి - అనన్య భక్తులకు సహితము కష్టనష్టములు కర్మవశాత్తు సంభవించ వచ్చును. అయినను అతడు సత్య ధర్మములను వీడడు. పరధనములను, పరస్త్రీలను ఆశించడు. శుచి శౌచము ఎప్పుడునూ కలిగియుండును. అనన్యభక్తిని మించినటువంటి సాధన మరియొకటి లేదు. అట్టి భక్తునికి జ్ఞాన వైరాగ్యములు సహజముగ సిద్ధించును. అట్టి వారి నుండి భగవంతుడు మహత్కార్యములు నిర్వర్తించుచు నుండును. 🍀*
*31. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వ చ్ఛాంతిం నిగచ్ఛతి |*
*కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి |*
*తాత్పర్యము : దురాచారుడు సాధువగుట, ధర్మాత్ము డగుట, శాశ్వతమగు శాంతిని పొందుట- అనన్య భక్తిచే శీఘ్రముగ జరుగును. గుర్తుంచుకొనుము. నా భక్తుడు ఎన్నడునూ చెడడు.*
*వివరణము : ఈ శ్లోకమున అనన్యభక్తి యొక్క ప్రాధాన్యతను విశేషించి భగవానుడు తెలుపుచున్నాడు. అన్య మేదియు లేదని, అంతయు దైవమే అని భావించు పామరుడైనను సహజముగ ధర్మ మార్గమున నడచును. శాంతిని పొందును. అంతయు దైవమే అన్న భావము స్థిరపడినవాడు సహజముగ అహింసను పాటించును. సత్యము ననుసరించును. పరధనములను, పరస్త్రీలను అపహరించడు. కృషి లేని లబ్ధి అంగీకరించడు. శుచి శౌచము కలిగి సంతోషముగ నుండును. సంతోషము కొరకై తాపత్రయ పడక సహజమగు సంతోష ముండును. అట్టి వాడింకెట్లు చెడిపోగలడు?*
*అందువలన నా భక్తుడు చెడిపోడని, ఇది ముమ్మాటికి సత్యమని భగవంతుడు అత్యంత స్పష్టముగ ప్రకటించుచున్నాడు. అనన్య భక్తులకు సహితము కష్టనష్టములు కర్మవశాత్తు సంభవించ వచ్చును. అయినను అతడు సత్య ధర్మములను వీడడు. పరధనములను, పరస్త్రీలను ఆశించడు. శుచి శౌచము ఎప్పుడునూ కలిగియుండును. అనన్యభక్తిని మించినటువంటి సాధన మరియొకటి లేదు. అట్టి భక్తునికి జ్ఞాన వైరాగ్యములు సహజముగ సిద్ధించును. అట్టి వారి నుండి భగవంతుడు మహత్కార్యములు నిర్వర్తించుచు నుండును.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 542 / Sri Siva Maha Purana - 542 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 49 🌴*
*🌻. బ్రహ్మ మోహితుడగుట - 2 🌻*
దేవతలిట్లు పలికిరి -
ఓ దేవదేవా! జగత్తును వ్యాపించి యున్నవాడా! పరమేశ్వరా! సదాశివా! జగత్ర్పభూ! జగత్స్వ రూపా! ప్రసన్నుడవు కమ్ము (11). సర్వ ప్రాణులకు ఆత్మ, కారణము, ఈశ్వరుడు నీవే. నీవు వికార రహితుడవు, నాశము లేనివాడవు. నిత్యము, నిర్వికల్పము, అక్షరము అగు పరబ్రహ్మవు నీవే (12).
ఆది, అంతము, మధ్యము, ఇది, మరియొకటి, నేను, నాకంటె బిన్నము ఇత్యాది భేదములు లేనిది అవ్యయము, సచ్చిద్ఘనము ఆగు ఆ పరబ్రహ్మ నీవే (13). ముముక్షువులు, దృఢవ్రతులు అగు మునులు ఇహపరముల యందు సంగమును వీడి నీ పాద పద్మములను మాత్రమే సేవించెదరు (14).
పూర్ణము, అమృతము, శోకరహితము, నిర్గుణము, ఆనందఘనము, వ్యగ్రత లేనిది, వికారములు లేనిది, ఉపాధికంటె భిన్నమైనది అగుపర బ్రహ్మ నీవే (15). జగత్తు యొక్క సృష్టి స్థితిలయములకు కారణము నీవే. ఆ జగత్తునకు ఆత్మ, ప్రభుడు నీవే. సర్వ వ్యాపకుడవగు నీవు ఏనాడైననూ జగత్తపై ఆదారపడిలేవు (16).
నీవు ఒక్కడివే అయిననూ కార్య కారణ రూపములను పొంది ద్వైతముగను, అద్వైత స్వరూపుడగను ఉన్నావు. ఒకే బంగారము ఆబరణములగను, స్వరూపముగను ఉన్నది గదా! వస్తు భేదము లేనే లేదు (17). జనులు అజ్ఞానముచే నీ యందు భేదమును దర్శించెదరు. కావున భ్రమను నివారించుట ఆవశ్యకమగు చున్నది. ఉపాధికి అతీతుడవగు నీయందు బేదము లేదు (18).
మహేశ్వరా! నీ దర్శన మాత్రముచే మేము ధన్యులమైతిమి. దృఢమగు భక్తి గల మానవులకు ఆనందమునిచ్చే ఓ శంకరా! దయను చూపుము (19). జగత్తునకు నీవే కారణము. కాని నీకు కారణము లేదు. ప్రకృతికి అతీతుడగు పురుషుడవు నీవే. నీవు విశ్వేశ్వరుడవు, జగన్నాథుడవు, వికారములు లేని వాడవ, పరాత్పరుడవు (20). హే ప్రభో! ఈ బ్రహ్మ నీ అనుగ్రహముచే రజోగుణ ప్రధానుడై విరాడ్రూపుడు, లోకమునకు పితామహుడా అయినాడు. సత్త్వ గుణ ప్రదానుడగు విష్ణువు పురుషోత్తముడైనాడు (21).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 542 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 49 🌴*
*🌻 The delusion of Brahmā - 2 🌻*
The gods said:—
12. O lord of gods, O pervader of the universe, O Sadāśiva, O lord of the universe, O lord of the world or the very world itself, be pleased.
13. You are the supreme soul, the supreme lord and the cause of all emotions. You are free from aberrations, devoid of wastage. You are eternal, free from suspicions and doubts. You are undying. You are the great god.
14. You are Truth, Brahman and Consciousness. You are imperishable, from whom have originated the beginning, the end and the middle of visible worlds, even I too. These visible things are not the true ones.
15. The sages, desirous of liberation, worship and meditate upon your lotus feet. They are steady in their resolve. They avoid attachment on either side.
16. You are the perfect Brahman, the nectar, free from grief, devoid of attributes and the great one. You are the sole bliss, free from excitement, aberrations and even static and insentient.
17. You are the cause of production, sustenance and dissolution of the universe Śiva, the lord of souls, is greater than the universe. He is free from the necessity of its aid. He is always pervasive.
18. You are the One, both Sat and Asat. You are non-dual. Gold whether as the basic metal or as the ready made ornament does not alter in its basic and intrinsic essence.
19. People have doubts in you by their ignorance. The remedy for illusion lies in thinking on your Nirguṇa aspect, not by itself.
20. O supreme lord, we are blessed by your very vision. O Śiva, you are the bestower of supreme bliss to the people who are steady in their devotion. Have mercy.
21. You are the primordial Being. You have no beginning. You are the Puruṣa beyond the Prakṛti. You are the lord of the universe. You are the lord of the world. You are free from aberrations. You are greater than the greatest.
Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 172 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻. భక్తి యోగము - 1 🌻*
*సంస్కృతంలో పరమ ప్రేమకే "భక్తి" అని పేరు. భక్తిని అభ్యాసము చేయు మార్గమునకే భక్తి యోగమని పేరు. మన తలంపులను పరిశుద్ధము గావించు కొనుటకును, వానికి చక్కని రూపు కల్పించుటకును, మన భావములతో సుందర శిల్పము సృజించుటకు భక్తియోగమే శ్రేష్ఠమయిన మార్గము.*
*భావబలమే అంతిమ శక్తి. మన నుండి దేనినయినను, ఇది కల్పింపగలదు. సముచిత పథము కల్పింపబడినచో, అది మనకును, ఒరులకును స్వర్గమును సృజించి, మనలను దైవ సామ్రాజ్యమున నిలుపును. అనుచితముగా కల్పింప బడినపుడు, దీని వలన రాజ్యములు వినాశమునకు గురియగును. దానితో మానవ జీవితము వికారమయిన శిథిలముల కట్టయగును.*
...✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 161 / Osho Daily Meditations - 161 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀 161. స్వాతంత్య్రం 🍀*
*🕉. 'ఏం జరిగినా నేను సంతోషంగానే ఉంటాను', అది నాకు ఎటువంటి తేడాను కలిగించదు అని చెప్పే వ్యక్తి మాత్రమే, ఏ పరిస్థితిలోనైనా సంతోషంగా ఉండటానికి నేను ఒక మార్గాన్ని కనుగొంటాను," అని స్వతంత్రంగా చెప్పవచ్చు. 🕉*
*ఏ రాజకీయాలు ఎలాంటి మార్పు తీసుకురాలేవు. బయటి ప్రపంచం పరిస్థితిలో ఎలాంటి తేడా వచ్చినా ఎలాంటి మార్పు జరగదు. పేదవాడుగా లేదా ధనవంతుడుగా, బిచ్చగాడుగా లేదా రాజుగా, స్వతంత్ర వ్యక్తి ఒకేలా ఉంటాడు. అతని లేదా ఆమె అంతర్గత వాతావరణం మారదు. అటువంటి ప్రశాంతతను, అటువంటి నిశ్చలతను పొందడం, ఇది అన్ని ధ్యానాల లక్ష్యం. అది షరతులు లేనిది. అప్పుడే అది నీది.*
*ఏది జరిగినా అది జరగనివ్వండి - మీరు సంతోషంగా ఉండండి. అప్పుడు మీరు ఆనందాన్ని అనుభూతి చెందుతారు. మీ సంకల్పాన్ని వదిలివేయండి మరియు మీరు కోరుకున్న విషయాలు వాటంతట అవే జరగడం మీరు చూస్తారు. అకస్మాత్తుగా పనులు సజావుగా సాగడం ప్రారంభిస్తాయి. ప్రతిదీ కలిసి సరిపోతుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 161 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 161. INDEPENDENCE 🍀*
*🕉 A person who says, 'Whatever happens, I am going to remain happy; it will not make any difference to me. I will find a way to be happy whatever the circumstance," is independent. 🕉*
*No politics can make any difference. No change in the state of the outside world can make any difference. Poor or rich, a beggar or a king, the independent person remains the same. His or her inner climate does not change. This is the goal of all meditation-to attain such tranquility, such stillness, that it is unconditional. Only then it is yours.*
*Then whatever happens, let it happen-you remain happy. You remain tremendously happy. Drop your will, and you will see that the things that you were hankering for start happening on their own. Suddenly things start running smoothly. Everything fits together.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 360-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 360-1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 79. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా ।*
*తరుణీ, తాపసారాధ్యా, తనుమధ్యా, తమోఽపహా ॥ 79 ॥ 🍀*
*🌻 360-1. 'తనుమధ్యా' 🌻*
*సన్నని నడుము కలది శ్రీదేవి అని అర్థము. శరీరము మధ్య భాగము అని తెలుపునది ఈ నామము. నడుము మధ్యభాగ మగుటచేతను మధ్యా అందురు. సృష్టి భగవంతుని శరీరము. దానియందు కూడ మధ్యభాగమున నుండునది శ్రీదేవి. తనువును రథము అని కూడ అందురు. రథము మధ్య భాగమున నుండునది అని కూడా తెలుపుచూ శ్రీ సూక్తమున, శ్రీమాతను 'రథమధ్యా' అని కూడ అందురు.*
*అవ్యక్తమునకు వ్యక్తమునకు మధ్య నుండునది చైతన్యము, ఆమె శ్రీమాత. లోకమునకు లోకమునకు మధ్య నుండునది శ్రీమాత. లోపలకు వెలుపలకు మధ్యనుండునది శ్రీమాత. తాను శుద్ధ చైతన్యమే అయిననూ తన సృష్టి యందు ఆవరణలు ఏర్పరచుచూ లోకములకు నడుమ మరియు లోకములుగను నుండునది శ్రీమాత. అణువునకు అణువునకు మధ్య నుండి పరస్పరత నేర్పరచుచు నుండును. అందు వలన ఆమెను 'ఆర్దాం' అని కూడ పిలుచుదురు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 360-1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 79. Tapatrayagni santapta samahladana chandrika*
*Tatuni tapasaradhya tanumadhya tamo-paha ॥ 79 ॥ 🌻*
*🌻 360. Tanumadhyā तनुमध्या 🌻*
*She has slender waist. Please refer nāma 85 also. There is a meter by name tanumadhya. Meter or chandas refers to the number of alphabets or words in a verse as per Sanskrit literature.*
*She is said to be in the form of this meter. Kṛṣṇa says, (Bhagavad Gīta X.35)” Gāyatrī candasāmahaṁ (गायत्री चन्दसामहं)” that He is in the form Gāyatrī meter.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment