🌹. నారద భక్తి సూత్రాలు - 88 🌹
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, 🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
చతుర్ధాధ్యాయం - సూత్రము - 58
🌻 58. అన్యస్నాత్ సౌలభ్యం భక్తా ॥ 🌻
ప్రేమించడం అనేది అందరికీ తెలుసు. కాని అది వస్తువులు, బంధు మిత్రులు, భార్యా బిడ్డలు, తల్లిదండ్రులు మొదలైన నిమిత్త కారణాల పై ఆధారపడిన ప్రేమ. ఈ ప్రేమలో రాగం, అనురాగం ఉంటాయి. ఈ ప్రేమ స్వంత ప్రయోజనాన్ని ఆశించి ఉంటుంది. ఇంద్రియ భోగలాలసగా, స్వార్ధ పూరితంగా ఉంటుంది.
ఇతరుల వలన ఆ ప్రయోజనం అందక పోయినా, వ్యతిరేక ఫలితం వచ్చినా, లేక వారు తిరిగి ప్రైమించకపోయినా అది ద్వెషంగా మారుతుంది. ఈ రాగద్వెషాలు నిమిత్త కారణాల మీద ఆధారపడి పుట్టుకొస్తాయి. మనసు మీద వాసనలు ముద్రించ బడతాయి. అవి సంస్కారాలై పునర్జన్మకు హేతువవుతాయి. కనుక ఇట్టి ప్రేమ బంధమవుతుంది.
అదే ప్రేమ నిస్వార్ధం, అకారణం అయినప్పుడు అక్కడ నిమిత్త కారణం భగవంతుడే అయినప్పుడు, ఆ ప్రేమ బంధమవదు. ఒకవేళ అయితే, అది భగవంతునితో బంధమవుతుంది.
భగవంతునితో బంధం పునర్జన్మ హేతువు కాదు. ఆ విధంగా భగవంతునిపై ఉదయించే ప్రేమ లేక రాగం భగవత్ ప్రేమను పెంచుతుంది. అట్టి ప్రేమలో ఆటంకం కలిగితే, విరహంగా మారి ఆ ప్రేమ మరింత పెరుగుతుందే తప్ప భగవంతునిపై ద్వేషంగా మారదు. అందువలన భగవంతుని చేరడానికి అన్య మార్గాల కంటే భక్తి మార్గం సులభం, శ్రేష్టం.
ఒకసారి భగవత్ ప్రేమ నిలబడిపోతెే, అన్య వస్తువులపై రాగం సన్నగిల్లి పోతుంది. చిత్తవృత్తులు వెలవెలవోతాయి. ముఖ్యభక్తి కలగడానికి అన్ని అడ్డంకులు తొలగిపోతాయి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
07.Sep.2020
No comments:
Post a Comment