రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
48. అధ్యాయము - 3
🌻. కామశాపానుగ్రహములు - 2 🌻
బ్రహ్మోవాచ |
కౌసుమాని తథాస్త్రాణి పంచాదాయ మనోభవః | ప్రచ్ఛన్నరూపీ తత్రైవ చింతయామాస నిశ్చయమ్ || 11
హర్షణం రోచనాఖ్యం చ మోహనం శోషణం తథా | మారణం చేతి ప్రోక్తాని మునే ర్మోహకరాణ్యపి || 12
బ్రహ్మణా మమ యత్కర్మ సముద్దిష్టం సనాతనమ్ | తదహైవ కరిష్యామి మునీనాం సన్నిధౌ విధేః || 13
తిష్ఠంతి మునయశ్చాత్ర స్వయం చాపి ప్రజాపతిః | ఏతేషాం సాక్షి భూతం మే భవిష్యంత్యద్య నిశ్చయమ్ || 14
సంధ్యాపి బ్రహ్మణా ప్రోక్తా చేదానీం ప్రేషయేద్వచః | ఇహ కర్మ పరీక్ష్యైవ ప్రయోగాన్మోహయామ్యహమ్ || 15
బ్రహ్మ ఇట్లు పలికెను -
మనస్సులో ఉదయించు మన్మథుడు అయిదు పుష్పబాణములను తీసుకొని, ప్రచ్ఛన్న రూపముతో అక్కడనే యుండి ఆలోచించి ఒక నిశ్చయమునకు వచ్చెను (11).
మునులకు కూడ మోహమును కలిగించు ఈ బాణములకు హర్షణము, రోజనము, మోహనము, శోషము మరియు మారణము అని పేర్లు (12).
బ్రహ్మ నాకు ఉపదేశించిన సనాతన సృష్టి కార్యమును నేను ఇచటనే ఈ మునుల సన్నిధిలో, బ్రహ్మ సన్నిధిలో ప్రయోగించెదను (13).
ఇచట మునులు ఉన్నారు. ప్రజాపతి కూడ స్వయముగ ఉన్నాడు. నా నిశ్చయమునకు వీరందరు ఈనాడు సాక్షులు కాగలరు (14).
సంధ్య కూడ ఇచట గలదు. బ్రహ్మచే నిర్దిష్టమైన పుష్పబాణ ప్రయోగరూప కర్మను పరీక్షకొరకై ఈమె యందు ఆచరించి నేను ఈమెను మోహింపజేయగలను (15).
ఇతి సంచింత్య మనసా నిశ్చిత్య చ మనోభవః | పుష్పజం పుష్పజాతస్య యోజయామాస మార్గణౖః || 16
ఆలీఢ స్థానమాసాద్య ధనురాకృష్య యత్నతః | చకార వలయాకారం కామో దన్వివరస్తదా || 17
సంహితే తేన కోదండే మారుతాశ్చ సుగంధయః | వవుస్తత్ర మునిశ్రేష్ఠ సమ్యగాహ్లాద కారిణః || 18
తతస్తానపి ధా త్రా దీన్ సర్వానేవ చ మానసాన్ | పృథక్ పుష్పశ##రైస్తీక్ణై ర్మోహయామాస మోహనః || 19
తతస్తే మునయస్సర్వే మోహితాశ్చాప్యహం మునే | సంహితో మనసా కంచిద్వికారం ప్రాపురాదితః || 20
మన్మథుడు మనసులో నిట్లు నిశ్చయించుకొని పుష్పధనస్సుపై పుష్ప బాణములను ఎక్కు పెట్టెను (16).
అపుడు ధనుర్ధారులలో శ్రేష్ఠుడగు కాముడు కుడికాలును ముందుకు వంచి, ఎడమ కాలును వెనుకకు పెట్టి, ధనస్సును బలముగా లాగి గుండ్రముగా చేసెను. (17).
ఆతడు ధనస్సును ఎక్కు పెట్టగానే పరిమళ భరితములు అగు వాయువులు అచట వీచినవి. ఓ మహర్షీ! ఆ వాయువులు గొప్ప ఆహ్లాదమును కలిగించినవి (18).
మోహింప జేయు ఆ మన్మథుడు తీక్ణములగు పుష్పబాణములతో బ్రహ్మను, ఆతని మానస పుత్రులనందరినీ మోహింపజేసెను (19).
ఓ మునీ! అపుడు నేను మరియు ఆ మునులందరు మోహితులమైతిమి. మొట్టమొదటిసారిగా బ్రహ్మాదులు మనస్సులో ఒక విలక్షణమైన వికారమును పొందిరి (20).
సంధ్యాం సర్వే నిరీక్షంతస్సవికారం ముహుర్ముహుః | ఆసన్ ప్రవృద్ధమదనాః స్త్రీ యస్మాన్మదనైధినీ || 21
తతస్సర్వాన్ స మదనో మోహయిత్వా పునః పునః | యథేంద్రియవికారంతే ప్రాపుస్తానకరోత్తథా || 22
ఉదీరితేంద్రియో ధాతా వీక్ష్యాహం స యదా చ తామ్ | తదైవ చోన పంచాశద్భావా జాతాశ్శరీరతః || 23
సాపి తైర్వీక్ష్య మాణాథ కందర్పశరపాతనాత్ | చక్రే ముహుర్ముహుర్భావాన్ కటాక్షావరణాదికాన్ || 24
వారందరు సంధ్యను మరల మరల వికారములతో చూచిరి. వారి మన్మథ వికారములు వృద్ధిపొందెను. స్త్రీ కామవికారమును వృద్ధి జేయును గదా! (21).
ఇట్లు ఆ మన్మథుడు వారినందరిని మరల మరల మోహింపజేసి, వారు ఇంద్రియ వికారమును పొందునట్లు చేసెను (22).
బ్రహ్మనగు నేను ఆమెను వృద్ధిపొందిన ఇంద్రియ వికారముతో చూచుచున్న సమయములో శరీరము నుండి నలభై తొమ్మిది పదార్థములు పుట్టినవి (23).
వారు ఇట్లు చూచుచుండగా, ఆమెపై కూడ మన్మథ బాణముల ప్రభావము పడెను. ఆమెయు క్రీగంటితో చూచుట, సంజ్ఞలతో ఆహ్వానించుట మొదలగు శృంగార వికారములను అధికముగా చేయజొచ్చెను (24).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
07.Sep.2020
No comments:
Post a Comment