శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 470 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 470 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 470 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 470 - 3 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 97. వజ్రేశ్వరీ, వామదేవీ, వయోఽవస్థా వివర్జితా ।
సిద్ధేశ్వరీ, సిద్ధవిద్యా, సిద్ధమాతా, యశస్వినీ ॥ 97 ॥ 🍀

🌻 470. ‘సిద్ధేశ్వరి'- 3 🌻


సిద్ధులు శ్రీమాత వశమున నుండును గాని, యితరుల వశమున నుండవు. ఇతరులు ధర్మము పాటించినపుడు వశమై, అధర్మము పాటించు నపుడు అదృశ్యమగును. రాక్షస ప్రవృత్తితో వశము చేసుకొను వారికి ఆపన్న సమయమున అవసర పడవు. ఈ సత్యము తెలిసిన వారు సిద్ధుల వెంటపడరు. సిద్దులకై ఆరాధన చేయరు. దైవారాధనము, ధర్మాచరణము అనుసరింతురు. అమ్మ అనుగ్రహమున సిద్ధులు కలుగును. అట్టి అనుగ్రహము కలిగినవారు నిజమగు సిద్ధపురుషులు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 470 - 3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 97. Vajreshvari vamadevi vayovasdha vivarjita
sideshvari sidhavidya sidhamata yashasvini ॥ 97 ॥ 🌻

🌻 470. 'Siddheshwari'- 3 🌻


Siddhas are in Srimata's possession and not in any other's'. For others, when they practice dharma, the Siddhas remain in their possession and when they practice unrighteousness, they disappear. When someone with demonic nature gains them, they do not come of use in the time of need. Those who know this truth do not hanker for the siddhas. They do not worship for Siddhas. They follow Devotional worship and dharmacharana. By the grace of Amma, siddhas are attained. Those who have such a grace are real virtuous men or Siddha purushas.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹



No comments:

Post a Comment