శ్రీ శివ మహా పురాణము - 528 / Sri Siva Maha Purana - 528


🌹 . శ్రీ శివ మహా పురాణము - 528 / Sri Siva Maha Purana - 528 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 46

🌻. శివుడు పెళ్లికొడుకు - 1 🌻


బ్రహ్మ ఇట్లు పలికెను -

అపుడు ప్రసన్నమగు మనస్సుగల శివుడు దూతలతో, తన గణములతో, దేవతలతో, మరియు మిగిలిన వారందరితో గూడి కుతూహలము గలవాడై హిమవంతుని గృహమునకు వెళ్లెను (1). హిమవంతుని ప్రాణప్రియురాలగు ఆ మేన కూడా అప్పుడు లేచి ఆ స్త్రీ గణములతో కూడి తన ఇంటి లోపలికి వెళ్లెను (2). ఆమె చేతి యందు దీపపాత్రను ధరించి శంభునకు నీరాజనమిచ్చుట కొరకై స్త్రీ గణములందరితో బాటు సాదరముగా ద్వారము వద్దకు వచ్చెను (3). అచటకు విచ్చేసి నట్టియు, మహేశ్వరుడైనట్టియు, పార్వతీపతియైనట్టియు, దేవతలందరిచే సేవింపబడునట్టి శంకుని మేన ప్రీతితో చూచెను (4).

సుందరమగు సంపెంగల కాంతి వంటి కాంతితో ప్రకాశించువాడు, ఒక ముఖము గలవాడు, మూడు కన్నులు గలవాడు, చిరునవ్వుతో గూడి ప్రసన్నముగా నున్న ముఖము గలవాడు, రత్నములతో, బంగరు ఆభరణములతో అలంకరింపబడినవాడు (5), మల్లెల మాలను ధరించినవాడు, గొప్ప రత్నములు పొదిగిన కిరీటముతో విరాజిల్లువాడు, మంచి కంఠహారమును ధరించినవాడు, సుందరమగు కంకణములతో అంగదములతో అలంకరింపబడినవాడు (6), అగ్నివలె ప్రకాశించు సాటిలేని సన్నని నూలుతో వడకిన సుందరమగు అమూల్యమైన రంగు రంగుల వస్త్రముల జంటతో ప్రకాశించువాడు (7) చందనము, అగరు, కస్తూరి, మంచి కుంకుమలతో అలంకరింపబడిన వాడు, రత్నపుటద్దము చేతి యందు గలవాడు, కాటుకతో ఒప్పారు కన్నులు గలవాడు అగు శివుని చూచెను (8).

తన కాంతిచే సర్వమును కప్పివేసిన వాడు, మిక్కిలి మనోహరాకారుడు, యువకుడు, సుందరుడు, అలంకరింపబడిన అవయవములతో నొప్పారువాడు (9), స్త్రీలను మోహింపజేయువాడు, తొందరపాటు లేనివాడు, కోటిచంద్రుల కాంతి గల పద్మము వంటి ముఖము గలవాడు, కోటి మన్మథుల కంటె అధికమగు శరీరకాంతి గలవాడు, సర్వాంగ సుందరుడు (10), గొప్ప దైవము, మహాప్రభుడు అగు అటు వంటి శివుడు అల్లుని స్థానములో తన యెదట నిలబడియుండగా గాంచిమేన శోకమును వీడి ఆనందించెను (11).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 SRI SIVA MAHA PURANA - 528 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 46 🌴

🌻 The arrival of the bridegroom - 1 🌻


Brahmā said:—

1. The delighted Śiva accompanied by His Bhūtas, Gaṇas, gods and others went to the abode of the mountain zealously.

2. Menā, the exquisite beloved of Himācala, got up from her seat and went into the harem along with the women-folk.

3. For the customary Nīrājana (waving of lights) rites of Śiva, the chaste lady came near the entrance with lights and vessels in her hands along with womenfolk of the sages.

4. Menā saw with pleasure lord Śiva, the bridegroom of Pārvatī, served by all the gods and who by that time had come there.

5-11. Śiva had the complexion of the colour of the Campaka flower. He had only one face but retained the three eyes. The face was beaming with a simple smile. He was bedecked in gems and gold and wore a garland of Mālatī flowers. The gemset crown was lustrous. He wore brilliant necklaces. He was bedecked in bangles and bracelets of fine workmanship. He was shining well with the two clothes of great value, fine texture and unrivalled beauty and purified in fire.

Highly embellished in sandal paste, aguru, musk and fine saffron, he had a gemset mirror in his hand and his eyes were lustrous with the collyrium. He was shedding a halo around him enveloping everything. He was extremely beautiful. He appeared to be very young. His limbs had the full complement of their ornaments. He was very attractive to the ladies.

He was not nervous or self-conscious. His lotuslike face had the brilliance of a thousand moons. His body shone with a refulgence more than that of a thousand cupids. He was beautiful in every limb. Seeing the lord thus as her son-in-law, Menā forgot all her grief. She was glad.


Continues....

🌹🌹🌹🌹🌹


03 Mar 2022

No comments:

Post a Comment