శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 353-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 353-1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 353-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 353-1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 78. భక్తిమత్-కల్పలతికా, పశుపాశ విమోచనీ ।
సంహృతాశేష పాషండా, సదాచార ప్రవర్తికా ॥ 78 ॥ 🍀
🌻 353-1. ''భక్తిమత్కల్పలతికా'🌻
భక్త జనులకు కల్పలతవలె ఇష్టమైన కోరికలను తీర్చునది శ్రీమాత అని అర్థము. భక్తి మత్కల్పులు అనగా భక్తితో కూడినవారై కోరికలు తీరనివారు. వీని ప్రవర్తనమున భక్తియే గోచరించు చుండును. కాని జీవితమున కొన్ని అంశముల యందు సంపూర్ణత లేక కొంత అసంతృప్తులై యుందురు. ఇట్టి భక్తిమతులకు కల్పలతికవలె కోరికలను కూడ విస్తారముగ పూరించి పరిపూర్ణ భక్తులను శ్రీమాత చేయుచున్నది. లతిక అనగా తీగవలె విస్తారముగ సాగునది. కస్తూరివలె సువాసన కలిగినది.
కావున కల్పలతిక అనగా విస్తారముగ సువాసనలతో కూడినదై భక్తిమతుల కోర్కెలను శ్రీమాత పూరించు చుండును. సంపద రెండు విధములుగ నుండును. ఆనందమును, వైభవమును ఇచ్చు సంపద. దుఃఖమును బంధమును కష్టములను కొనివచ్చు సంపద. రెండవ రకము సంపద దివ్య సంపద కాదు. మొదటి రకము సంపద సుగంధముతో కూడినదై యుండును. శ్రీమాత భక్తి కలవారి కోరికలు తీర్చి పూర్ణ భక్తులుగ తీర్చిదిద్దును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 353-1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 78. Bhaktimatkalpalatika pashupasha vimochani
Sanhruta sheshapashanda sadachara pravartika ॥ 78 ॥ 🌻
🌻 353-1. Bhaktimat-kalpa-latikā भक्तिमत्-कल्प-लतिका 🌻
Kalpa is a divine creeper that grants boon to those who sit under it. In the same way She gives boon to Her devotees. Latika means spread over. This indicates that Her devotees are spread over across the earth (devotees is a general term representing the whole humanity). Kalpa also means imperfection.
Those who worship Her with imperfect devotion are made to acquire perfect devotion over several births and She gives them final liberation. There is difference between final liberation and reaching the Heavens which is called mokṣa.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
03 Mar 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment