2) 🌹. శ్రీమద్భగవద్గీత - 167 / Bhagavad-Gita - 167 - 4-05 జ్ఞానయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 565 / Vishnu Sahasranama Contemplation - 565🌹
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 14 / Agni Maha Purana 14 - అయోధ్య కాండ వర్ణనము - 1🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 244 / DAILY WISDOM - 244 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 145 🌹
7) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 83 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ శుక్రవారం మిత్రులందరికీ 🌹*
*భృగు వాసరే, 04, మార్చి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : రామకృష్ణ జయంతి, Ramakrishna Jayanti 🌻*
*🍀. శ్రీ మహాలక్ష్మి స్తోత్రం - 12 🍀*
*23. దారిద్య్రార్ణవమగ్నోఽహం నిమగ్నోఽహం రసాతలే |*
*మజ్జంతం మాం కరే ధృత్వా తూద్ధర త్వం రమే ద్రుతమ్*
*24. కిం లక్ష్మి బహునోక్తేన జల్పితేన పునః పునః |*
*అన్యన్మే శరణం నాస్తి సత్యం సత్యం హరిప్రియే*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : ఎవరి వద్ద ఏమి ఉంటుందో వారు దానినే పంచుకోగలరు. మీ వద్ద ఏం వుంది? సదా గమనించుకోండి. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: శుక్ల విదియ 20:46:47 వరకు
తదుపరి శుక్ల తదియ
నక్షత్రం: ఉత్తరాభద్రపద 25:53:33
వరకు తదుపరి రేవతి
యోగం: శుభ 25:44:20 వరకు
తదుపరి శుక్ల
సూర్యోదయం: 06:32:28
సూర్యాస్తమయం: 18:23:20
చంద్రోదయం: 07:42:51
చంద్రాస్తమయం: 19:59:30
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: మీనం
కరణం: బాలవ 09:08:20 వరకు
వర్జ్యం: 11:30:24 - 13:06:08
దుర్ముహూర్తం: 08:54:38 - 09:42:01
మరియు 12:51:35 - 13:38:59
రాహు కాలం: 10:59:02 - 12:27:54
గుళిక కాలం: 08:01:19 - 09:30:11
యమ గండం: 15:25:37 - 16:54:28
అభిజిత్ ముహూర్తం: 12:04 - 12:50
అమృత కాలం: 21:04:48 - 22:40:32
మరియు 29:01:54 - 46:09:18
ధ్వజ యోగం - కార్య సిధ్ధి 25:53:33
వరకు తదుపరి శ్రీవత్స యోగం -
ధన లాభం , సర్వ సౌఖ్యం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
#PanchangDaily
#DailyTeluguCalender
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 167 / Bhagavad-Gita - 167🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. చతుర్ధ అధ్యాయము - జ్ఞాన యోగము - 05 🌴*
*05. శ్రీ భగవానువాచ*
*బహుని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున |*
*తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్త పరన్తప*
*🌷. తాత్పర్యం :*
*దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను : ఓ పరంతపా! నీకును మరియు నాకును పలుజన్మలు గడిచినవి. నాకు అవియన్నియును జ్ఞప్తియందున్నవి. కాని నీవు వానిని జ్ఞప్తి యందుంచు కొనజాలవు.*
🌷. భాష్యము :
శ్రీకృష్ణభగవానుని అనేకానేక అవతారములను గూర్చిన సమాచారము బ్రహ్మసంహిత(5.33) యందు మనకు లభించుచున్నది. దాని యందు ఇట్లు తెలుపబడినది.
అద్వైతమచ్యుతమనాదిమనన్తరూపమ్
ఆద్యం పురాణపురుషం నవయౌవనం చ |
వేదేషు దుర్లభ మదుర్లభ మాత్మభక్తౌ
గోవిందం ఆదిపురుషం తమహం భజామి
“అద్వితీయుడును, అచ్యుతుడును, అనాదియును అగు దేవదేవుడైన గోవిందుని(శ్రీ కృష్ణుని) నేను భజింతును. అతడు అనంతరూపములలోనికి అదే ఆదిపురుషునిగా, అనాదిగా మరియు నిత్యయౌవనములో అలరారువానిగా భాసించును. భగవానుని అట్టి సచ్చిదానందవిగ్రహరూపములు వేదంవేత్తలకు సాధారణముగా దుర్లభములైనను, శుద్ధభక్తులకు మాత్రము స్వయముగా ప్రకటితమగుచుండును.”
అదే బ్రహ్మసంహిత(5.39) యందు ఈ క్రింది విషయము కూడా తెలుపబడినది.
రామాదిమూర్తిషు కలానియమేన తిష్ఠన్
నానావతార మకరోద్భువనేషు కింతు |
కృష్ణ: స్వయం సమభవత్పరమ: పుమాన్ యో
గోవిందం ఆదిపురుషం తమహం భజామి ||
“రామ, నృసింహాది పలు అవతారములను, ఇతరములైన అనేక అంశావతారములను ధరించువాడును మరియు ఆదిదేవుడైన శ్రీకృష్ణునిగా తెలియబడుచు స్వయముగా అవతరించెడివాడును అగు గోవిందుని(శ్రీకృష్ణుని) నేను భజింతును.
భగవానుడు అద్వితీయుడని తెలియబడినను అసంఖ్యాక రూపములలోనికి ప్రకటితమగుచుండునని వేదము లందు తెలుప బడినది. పలురంగులు మార్చినను వాస్తవమునకు మార్పురహితముగా నుండు వైడుర్యముతో అతనిని పోల్చవచ్చను. ఆ నానావిధ రూపములన్నియును విశుద్ధభక్తులకే సంపూర్ణముగా అవగతమగును. కేవలము వేదాధ్యయనముచే అవి అవగతము కావు ( వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మ భక్తౌ). అర్జునుని వంటి భక్తులు శ్రీకృష్ణభగవానుని నిత్యసహచరులు. భగవానుడెప్పుడు అవతరించినను వివిధస్థాయిలలో అతని సేవ కొరకు ఆ నిత్యసహచరులైన భాకులును అవతరింతురు.
🌹 🌹 🌹 🌹🌹
*🌹 Bhagavad-Gita as It is - 167 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 4 - Jnana Yoga - 05 🌴*
*05. śrī-bhagavān uvāca*
*bahūni me vyatītāni janmāni tava cārjuna*
*tāny ahaṁ veda sarvāṇi na tvaṁ vettha paran-tapa*
*🌷 Translation :*
*The Personality of Godhead said: Many, many births both you and I have passed. I can remember all of them, but you cannot, O subduer of the enemy!*
🌷 Purport :
In the Brahma-saṁhitā (5.33) we have information of many, many incarnations of the Lord. It is stated there:
advaitam acyutam anādim ananta-rūpam
ādyaṁ purāṇa-puruṣaṁ nava-yauvanaṁ ca
vedeṣu durlabham adurlabham ātma-bhaktau
govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi
“I worship the Supreme Personality of Godhead, Govinda [Kṛṣṇa], who is the original person – absolute, infallible, without beginning. Although expanded into unlimited forms, He is still the same original, the oldest, and the person always appearing as a fresh youth. Such eternal, blissful, all-knowing forms of the Lord are usually not understood by even the best Vedic scholars, but they are always manifest to pure, unalloyed devotees.”
It is also stated in Brahma-saṁhitā (5.39):
rāmādi-mūrtiṣu kalā-niyamena tiṣṭhan
nānāvatāram akarod bhuvaneṣu kintu
kṛṣṇaḥ svayaṁ samabhavat paramaḥ pumān yo
govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi
“I worship the Supreme Personality of Godhead, Govinda [Kṛṣṇa], who is always situated in various incarnations such as Rāma, Nṛsiṁha and many subincarnations as well, but who is the original Personality of Godhead known as Kṛṣṇa, and who incarnates personally also.”
In the Vedas also it is said that the Lord, although one without a second, manifests Himself in innumerable forms. He is like the vaidūrya stone, which changes color yet still remains one. All those multiforms are understood by the pure, unalloyed devotees, but not by a simple study of the Vedas (vedeṣu durlabham adurlabham ātma-bhaktau). Devotees like Arjuna are constant companions of the Lord, and whenever the Lord incarnates, the associate devotees also incarnate in order to serve the Lord in different capacities.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 565 / Vishnu Sahasranama Contemplation - 565 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻 565. సహిష్ణుః, सहिष्णुः, Sahiṣṇuḥ 🌻*
*ఓం సహిష్ణువే నమః | ॐ सहिष्णुवे नमः | OM Sahiṣṇuve namaḥ*
*ద్వన్ద్వాని శీతోష్ణాదీని సహతే పరమేశ్వరః ।*
*ఇతి విష్ణుస్సహిష్ణురిత్యుచ్యతే విదుషాం వరైః ॥*
*శీతోష్ణాది రూపములగు ద్వంద్వములను అనాయాసముగా సహించువాడు గనుక శ్రీ విష్ణువు సహిష్ణువుగా పిలువబడుతాడు.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 565🌹*
*📚. Prasad Bharadwaj*
*🌻 565. Sahiṣṇuḥ 🌻*
*OM Sahiṣṇuve namaḥ*
द्वन्द्वानि शीतोष्णादीनि सहते परमेश्वरः ।
इति विष्णुस्सहिष्णुरित्युच्यते विदुषां वरैः ॥
*Dvandvāni śītoṣṇādīni sahate parameśvaraḥ,*
*Iti viṣṇussahiṣṇurityucyate viduṣāṃ varaiḥ.*
*Since effortlessly He bears different dualities like heat and cold etc., Lord Viṣṇu is known as Sahiṣṇuḥ.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
भगवान् भगहाऽऽनन्दी वनमाली हलायुधः ।आदित्यो ज्योतिरादित्यस्सहिष्णुर्गतिसत्तमः ॥ ६० ॥
భగవాన్ భగహాఽఽనన్దీ వనమాలీ హలాయుధః ।ఆదిత్యో జ్యోతిరాదిత్యస్సహిష్ణుర్గతిసత్తమః ॥ 60 ॥
Bhagavān bhagahā’’nandī vanamālī halāyudhaḥ,Ādityo jyotirādityassahiṣṇurgatisattamaḥ ॥ 60 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 14 / Agni Maha Purana - 14 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 6*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*🌻. అయోధ్యాకాండ వర్ణనము - 1 🌻*
నారద ఉవాచ :
భరతుడు మాతుల గృహమునకు వెళ్ళిన పిమ్మట రాముడు తండ్రి మొదలగు వారిని భక్తితో సేవించెను. దశరథ మహారాజు రామునితో ఇట్లనెను -- ''రామా ! వినుమ''
''నీ గుణములందు ప్రేమచే ప్రజలు నిన్ను ఇంతకు పూర్వమే, మనసా రాజ్యాభిషిక్తుని చేసినారు. నేను రేపు ప్రాతఃకాలమున నీకు ¸°వరాజ్యము ఇచ్చుచున్నాను, సీతా సహితుడవై ఈ రాత్రి నీవు వ్రతమును అవలంబింపుము'' వసిష్ఠుడు, సృష్ట, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, రాష్ట్రవర్దనుడు, అశోకుడు, ధర్మపాలుడు, సుమంత్రుడు, అను ఎనమండుగురు మంత్రులను రామునితో ఆ విధముగనే పలికిరి.
రాముడు తండ్రి మొదలైన వారి మాటలు విని, అట్లే చేసెదను అని చెప్పి, కౌసల్యకు కూడ తెలిపి, దేవతలను పూజించి, వ్రతము నవలంబించెను.
దశరథుడు --
''రాముని పట్టాభిషేకమునకు కావలసిన సంభారము లన్నియు సమకూర్చుడు'' అని వసిష్ఠాదులతో చెప్పి కై కేయి వద్దకు వెళ్ళెను.
కై కేయికి సఖురాలగు మంథర అయోధ్యా నగరమును అలంకరించుటను చూచి, రామునకు పట్టాభిషేకము జరుగనున్నదను విషయమును తెలిసికొని, దానిని కైకేయికి చెప్పెను.
ఒకప్పుడు ఆమె ఏదియో అపరాధము చేయగా రాముడు ఆమెను పాదములు పట్టి ఈడ్పించెను. ఆ వైరమును పురస్కరించుకొని ఆయె ఆతనిని వనమునకు పంపవలెనని అనుకొనెను.
ఓ! కై కేయి ! లెమ్ము. రామునకు రాజ్యాభిషేక మనగా నీకును, నాకును, నీ కుమారునకును మరణమే ఇందులో సందేహము లేదు.
కై కేయి ఆ కుబ్జ పలికిన మాటలు విని ఒక ఆభరణమును బహూకరించి ఇట్లు పలికెను -- నాకు భరతుడెంతయో రాముడు కూడ అంతయే. కాని భరతునికి రాజ్యము లభించు ఉపాయ మేదియు కానరాకున్నది. మంథర ఆ మాటలకు కోపించి ఆమె ఇచ్చిన హారమును గ్రహింపక కై కేయితో ఇట్లనెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana -14 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *
Chapter 6
*🌻 Ayodhya Kand - 1 🌻*
Nārada said:
1-2. After Bharata had gone, Rāma saluted the parents and others. King Daśaratha said to Rāma, “Rāghava (Rāma)! listen to me, you have been anointed mentally by the people as ruler on account of (your) qualities. I shall make you the heir-apparent (next) morning.”
3-4. “In the night you observe (the necessary) rites (vows) along with Sītā.” And the eight ministers[1] of the king—Sṛṣṭi, Jayanta, Vijaya, Siddhārtha, Rāṣṭravardhana, Aśoka, Dharmapāla and Sumantra and also Vasiṣṭha spoke.
5. After hearing the words of the father and others, Rāghava said that he will do accordingly. He worshipped the gods and informed the news to Kauśalyā.
6. The king told Vasiṣṭha and others to gather the materials required for the coronation of Rāma and went to Kaikeyī.
7. After seeing the decoration of the city of Ayodhyā and knowing that the coronation of Rāma is to take place, Mantharā informed her friend Kaikeyī (accordingly).
8. Having been pulled by Rāma by the foot by mistake,. on account of that enmity she desired of Rāma’s sojourn to the forest.
9. “O! Kaikeyī! you get up (and see) the anointment of Rāma. There is no doubt (that it is) death (itself) for your son, to me and to you (said Mantharā).
10-11. She (Kaikeyī) heard the words of the kubjā (hunchbacked) (Mantharā) and gave her an ornament. She said "Just as Rāma is (my son) so also Bharata is my son. I do not find any plan, by which Bharata may get the kingdom.” The angry Mantharā after rejecting the ornament (given by Kaikeyī) said to Kaikeyī:
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 244 / DAILY WISDOM - 244 🌹*
*🍀 📖. ఉపనిషత్తులపై పాఠాల నుండి 🍀*
*📝. స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ్*
*🌻 31. స్వాధీనత కలిగి ఉండకండి 🌻*
*అత్యాశ వద్దు. స్వార్ధంగా ఉండకండి. "నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి" అని చెప్పకండి. చివరకు మీకు ఏమీ అవసరం లేదు. ధనవంతులు కూడా పదికిలోమీటర్ల భూమిలో నిద్రపోరు. వారు నిద్రించడానికి ఆరు అడుగుల అవసరం. కోటీశ్వరుడికి నిద్రించడానికి చాలా పొడవుగా, పొడవుగా, అనేక ఫర్లాంగుల పొడవు అవసరమని మీరు అనుకుంటున్నారా? ధనవంతుడు ధనవంతుడు కాబట్టి రెండు క్వింటాళ్ల ఆహారం తింటాడా? అతను బహుశా మీరు తినే దానికంటే తక్కువ తింటాడు. ఇవి మనసులో గందరగోళాలు. సంపద మరియు స్వాధీనత-వస్తువుల సముపార్జన, ఈ ప్రపంచంలో తనకు అన్నీ ఉన్నాయని ఊహ - "నేనే ఈ భూమికి అధిపతిని" - ఇవి మనస్సులోని భ్రమలు మరియు సమయం వచ్చినప్పుడు మీకు ఇది తెలుస్తుంది.*
*ప్రతిదీ మీ వద్ద నుండి వెళ్ళినప్పుడు, మీరు ప్రతిదీ కలిగి ఉన్నారని భావించడంలో మీరు పొరపాటు చేశారని మీరు గ్రహిస్తారు. నువ్వు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు. మీరు తీసుకురాని మీరు వస్తువులను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? వచ్చినప్పుడు తెచ్చుకోని ఈ లోక ఆస్తిని ఎలా సంపాదించావు? వాస్తవానికి, మీరు ఈ ఆస్తిని సంపాదించినట్లయితే, మీరు వెళ్లినప్పుడు దాన్ని తీసుకోవచ్చు. మీరు దానిని మీతో ఎందుకు తీసుకెళ్లరు? మీరు మీ వృత్తి ద్వారా సంపాదించిన చాలా సంపద ఉంది; మీరు వెళ్లినప్పుడు మీతో తీసుకెళ్లండి. నువ్వు చేయగలవా? మీరు ఏమీ తీసుకురాలేకపోతే మరియు మీరు ఏమీ తీసుకోలేకపోతే, మధ్యలో ఏదైనా మీ స్వంతం చేసుకోవడం ఎలా సాధ్యమవుతుంది?*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 244 🌹*
*🍀 📖 from Lessons on the Upanishads 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*
*🌻 31. Do Not be Possessive 🌻*
*Do not be greedy. Do not be possessive. Do not say “I want, I want, I want.” You require nothing, finally. Even the richest people do not sleep on ten kilometres of land. They require six feet on which to sleep. Do you think a millionaire requires a longer, lengthier bed, several furlongs long, to sleep on? Will a rich person eat two quintals of food because he is rich? He will perhaps eat less than what you eat. These are confusions in the mind. Wealth and possession—accretion of objects, imagination that one has everything in this world—“I am the ruler of this Earth”—these are rank illusions in the mind, and you will know this when the time comes.*
*When everything goes, you will realise that you made a mistake in thinking that you had everything. You never brought anything when you came to this world. Are you trying to possess things which you did not bring? How did you earn this property of the world when you did not bring it with you when you came? Actually, if you have earned this property, you could take it when you go. Why do you not take it with you? You have so much wealth that you have earned through your profession; take it with you when you go. Can you? If you cannot bring anything and if you cannot take anything either, how is it possible for you to possess anything in the middle?*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
#PrasadBhardwaj
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 145 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. మొదట నువ్వు ఎలా వుంటే అలా నిన్ను నువ్వు ప్రేమించు. కారణం వునికి నిన్ను నువ్వుగా ప్రేమిస్తుంది. అట్లా అంటే ఎప్పటికీ నువ్వు అలా వుంటావని కాదు. ఇది పరివర్తనకి మొదటి అడుగు. నిన్ను నువ్వు ప్రేమిస్తే నువ్వు తొందరగా ఎదుగుతావు. 🍀*
*తరాలుగా పెద్దలు మనిషిని తక్కువ చేశారు. కించపరిచారు. తిరస్కరించారు. అందువల్ల ప్రతి మనిషీ తను పనికిమాలిన వాణ్ణి అనుకున్నాడు. క్రమంగా మత పెద్దలు ఆత్మ గౌరవాన్ని నాశనం చేశారు. మనిషిని వాళ్ళు రెండుగా విభజించారు. విమర్శించే భాగం, విమర్శకుడుగా మార్చరు. విమర్శించేవాణ్ణి మనస్సాక్షిగా, విమర్శింపబడే దాన్ని సహజాతంగా చూశారు.*
*ఈ విభజన అనునిత్యం నీతో నిన్ను ఘర్శించేదిగా మార్చింది. సమశృతి దెబ్బ తింది. అది అస్తిత్వాన్ని అనుభవానికి తెచ్చుకునే పద్ధతి కాదు. మొదట నువ్వు ఎలా వుంటే అలా నిన్ను నువ్వు ప్రేమించు. కారణం వునికి నిన్ను నువ్వుగా ప్రేమిస్తుంది. అట్లా అంటే ఎప్పటికీ నువ్వు అలా వుంటావని కాదు. ఇది పరివర్తనకి మొదటి అడుగు. నిన్ను నువ్వు ప్రేమిస్తే నువ్వు తొందరగా ఎదుగుతావు.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 83 🌹*
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻 69. శిల్ శిలా 🌻*
*మమ్ములను చేరుటకు సద్గురువు ఆవశ్యకత ఉన్నది. భూమి జీవులకు దివ్యత్వమును చేరుటకు గురువే మార్గము. భారతీయుల కిది చిరకాలము నుండి తెలియును. పాశ్చాత్యులకు ఈ విషయము రెండువేల సంవత్సరముల క్రితము ఏసు ద్వారా తెలుపబడినది. ఏసు, “నేనే మార్గము” అని తెలుపుటలో ఈ రహస్యమున్నది.*
*గురువు చేయు మేలు నీకుగ నీవు చేసుకొనలేవు. దీనినే గురు పరంపరాగత మార్గము అందురు. ఇందు నడచు వారందరు తథాగతులే. బుద్ధుడు కూడ తథాగతుడే. తథాగత మార్గమును “శిల్ శిలా” అని హిమాలయపు ఉత్తర ప్రాంతము వారు పలుకుదురు.*
*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment