శ్రీ మదగ్ని మహాపురాణము - 14 / Agni Maha Purana - 14


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 14 / Agni Maha Purana - 14 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 6

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. అయోధ్యాకాండ వర్ణనము - 1 🌻


నారద ఉవాచ :

భరతుడు మాతుల గృహమునకు వెళ్ళిన పిమ్మట రాముడు తండ్రి మొదలగు వారిని భక్తితో సేవించెను. దశరథ మహారాజు రామునితో ఇట్లనెను -- ''రామా ! వినుమ''

''నీ గుణములందు ప్రేమచే ప్రజలు నిన్ను ఇంతకు పూర్వమే, మనసా రాజ్యాభిషిక్తుని చేసినారు. నేను రేపు ప్రాతఃకాలమున నీకు ¸°వరాజ్యము ఇచ్చుచున్నాను, సీతా సహితుడవై ఈ రాత్రి నీవు వ్రతమును అవలంబింపుము'' వసిష్ఠుడు, సృష్ట, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, రాష్ట్రవర్దనుడు, అశోకుడు, ధర్మపాలుడు, సుమంత్రుడు, అను ఎనమండుగురు మంత్రులను రామునితో ఆ విధముగనే పలికిరి.

రాముడు తండ్రి మొదలైన వారి మాటలు విని, అట్లే చేసెదను అని చెప్పి, కౌసల్యకు కూడ తెలిపి, దేవతలను పూజించి, వ్రతము నవలంబించెను.


దశరథుడు --

''రాముని పట్టాభిషేకమునకు కావలసిన సంభారము లన్నియు సమకూర్చుడు'' అని వసిష్ఠాదులతో చెప్పి కై కేయి వద్దకు వెళ్ళెను.

కై కేయికి సఖురాలగు మంథర అయోధ్యా నగరమును అలంకరించుటను చూచి, రామునకు పట్టాభిషేకము జరుగనున్నదను విషయమును తెలిసికొని, దానిని కైకేయికి చెప్పెను.

ఒకప్పుడు ఆమె ఏదియో అపరాధము చేయగా రాముడు ఆమెను పాదములు పట్టి ఈడ్పించెను. ఆ వైరమును పురస్కరించుకొని ఆయె ఆతనిని వనమునకు పంపవలెనని అనుకొనెను.

ఓ! కై కేయి ! లెమ్ము. రామునకు రాజ్యాభిషేక మనగా నీకును, నాకును, నీ కుమారునకును మరణమే ఇందులో సందేహము లేదు.

కై కేయి ఆ కుబ్జ పలికిన మాటలు విని ఒక ఆభరణమును బహూకరించి ఇట్లు పలికెను -- నాకు భరతుడెంతయో రాముడు కూడ అంతయే. కాని భరతునికి రాజ్యము లభించు ఉపాయ మేదియు కానరాకున్నది. మంథర ఆ మాటలకు కోపించి ఆమె ఇచ్చిన హారమును గ్రహింపక కై కేయితో ఇట్లనెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana -14 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj


Chapter 6

🌻 Ayodhya Kand - 1 🌻

Nārada said:

1-2. After Bharata had gone, Rāma saluted the parents and others. King Daśaratha said to Rāma, “Rāghava (Rāma)! listen to me, you have been anointed mentally by the people as ruler on account of (your) qualities. I shall make you the heir-apparent (next) morning.”

3-4. “In the night you observe (the necessary) rites (vows) along with Sītā.” And the eight ministers[1] of the king—Sṛṣṭi, Jayanta, Vijaya, Siddhārtha, Rāṣṭravardhana, Aśoka, Dharmapāla and Sumantra and also Vasiṣṭha spoke.

5. After hearing the words of the father and others, Rāghava said that he will do accordingly. He worshipped the gods and informed the news to Kauśalyā.

6. The king told Vasiṣṭha and others to gather the materials required for the coronation of Rāma and went to Kaikeyī.

7. After seeing the decoration of the city of Ayodhyā and knowing that the coronation of Rāma is to take place, Mantharā informed her friend Kaikeyī (accordingly).

8. Having been pulled by Rāma by the foot by mistake,. on account of that enmity she desired of Rāma’s sojourn to the forest.

9. “O! Kaikeyī! you get up (and see) the anointment of Rāma. There is no doubt (that it is) death (itself) for your son, to me and to you (said Mantharā).

10-11. She (Kaikeyī) heard the words of the kubjā (hunchbacked) (Mantharā) and gave her an ornament. She said "Just as Rāma is (my son) so also Bharata is my son. I do not find any plan, by which Bharata may get the kingdom.” The angry Mantharā after rejecting the ornament (given by Kaikeyī) said to Kaikeyī:


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


04 Mar 2022

No comments:

Post a Comment