నిర్మల ధ్యానాలు - ఓషో - 145
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 145 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మొదట నువ్వు ఎలా వుంటే అలా నిన్ను నువ్వు ప్రేమించు. కారణం వునికి నిన్ను నువ్వుగా ప్రేమిస్తుంది. అట్లా అంటే ఎప్పటికీ నువ్వు అలా వుంటావని కాదు. ఇది పరివర్తనకి మొదటి అడుగు. నిన్ను నువ్వు ప్రేమిస్తే నువ్వు తొందరగా ఎదుగుతావు. 🍀
తరాలుగా పెద్దలు మనిషిని తక్కువ చేశారు. కించపరిచారు. తిరస్కరించారు. అందువల్ల ప్రతి మనిషీ తను పనికిమాలిన వాణ్ణి అనుకున్నాడు. క్రమంగా మత పెద్దలు ఆత్మ గౌరవాన్ని నాశనం చేశారు. మనిషిని వాళ్ళు రెండుగా విభజించారు. విమర్శించే భాగం, విమర్శకుడుగా మార్చరు. విమర్శించేవాణ్ణి మనస్సాక్షిగా, విమర్శింపబడే దాన్ని సహజాతంగా చూశారు.
ఈ విభజన అనునిత్యం నీతో నిన్ను ఘర్శించేదిగా మార్చింది. సమశృతి దెబ్బ తింది. అది అస్తిత్వాన్ని అనుభవానికి తెచ్చుకునే పద్ధతి కాదు. మొదట నువ్వు ఎలా వుంటే అలా నిన్ను నువ్వు ప్రేమించు. కారణం వునికి నిన్ను నువ్వుగా ప్రేమిస్తుంది. అట్లా అంటే ఎప్పటికీ నువ్వు అలా వుంటావని కాదు. ఇది పరివర్తనకి మొదటి అడుగు. నిన్ను నువ్వు ప్రేమిస్తే నువ్వు తొందరగా ఎదుగుతావు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
04 Mar 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment