🌹 25, MARCH 2024 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు🌹

🌹 25, MARCH 2024 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు🌹
🌹 25, MARCH 2024 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు🌹
🌹🎨 హోళీ పండుగ, వసంత పూర్ణిమ, ఫాల్గుణ పూర్ణమి, లక్ష్మీ జయంతి శుభాకాంక్షలు అందరికి / Greetings on Holi Festival, Vasanta Purnima, Phalguna Purnima, Lakshmi Jayanti to All. 🎨🌹
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 512 / Bhagavad-Gita - 512 🌹
🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 23 / Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 23 🌴
2) 🌹. శ్రీ శివ మహా పురాణము - 867 / Sri Siva Maha Purana - 867 🌹
🌻. శంఖచూడుని దూత శివునితో సంభాషించుట - 4 / The conversation between Śiva and the emissary of Śaṅkhacūḍa - 4 🌻
3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 125 / Osho Daily Meditations  - 125 🌹
🍀 125. సందేహం మరియు ప్రతికూలత / 125. DOUBT AND NEGATIVITY 🍀
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 539-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 539-2 🌹 
🌻 539. 'శ్రుతిః' - 2 / 539. 'Shrutih' - 2 🌻
5) 🌹 సిద్దేశ్వరయానం - 22 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹🎨 హోళీ పండుగ, వసంత పూర్ణిమ, ఫాల్గుణ పూర్ణమి, లక్ష్మీ జయంతి శుభాకాంక్షలు అందరికి / Greetings on Holi Festival, Vasanta Purnima, Phalguna Purnima, Lakshmi Jayanti to All. 🎨🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*🎨. హోళికా పూర్ణిమ / కాముని పూర్ణిమ ఎందుకు ? 🎨*
*🍀🎨. హోలీ పండగ.. ఈ రంగుల పండగ విశిష్టత ఏంటి..ఎలా జరుపుకోవాలి..? 🎨🍀*

*తెలుగు నెలల్లో చివరిది ఫాల్గుణ మాసం. హోళి పర్వదినం ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. చతుర్దశి నాడు కాముని దహనం జరిపి మరుసటి రోజు పాల్గుణ పౌర్ణమి రోజు హోళి పండుగను జరుపుకుంటారు. వసంత కాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను 'వసంతోత్సవం' పేరిట జరుపుకునేవారు. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి. ఈ పండుగ సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. ఈ పండుగను హోళికా పూర్ణిమ, కాముని పూర్ణిమ, ఫాల్గుణ పౌర్ణమి, హుతాశనీ పూర్ణిమా, వహ్యుత్సవం, వసంతోత్సవం అను పేర్లతో కూడా పిలుస్తారు.*

*🍀. పురాణాలు ఏం చెబుతున్నాయి ? 🍀*

*రాక్షసులకు రాజైన హిరణ్యకశ్యపుడు, తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించ దీనికి విరుద్ధంగా, హిరణ్యకశ్యపుడి సొంత పుత్రుడైన ప్రహ్లాదుడు, భగవంతుడైన విష్ణువుకు భక్తుడు. హిరణ్యకశ్యపుడు పలు మార్లు బెదిరించినప్పటికి, ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుని ప్రార్థించేవాడు. హిరణ్యకశ్యపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరిగా, ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు, ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకి ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి, తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువా ఎగిరి పోవడం వలన ఆమె దహనం అవుతుంది ఆ శాలువా ప్రహ్లాదుడిని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల మనం హోలీను జరుపుకుంటున్నాము.*

*ఇంకొందరు ఫాల్గుణ పౌర్ణమి నాడు కాముని పున్నమి పేరిట సంబరాలు జరుపుకుంటారు. సతీవియోగంతో విరాగిలో మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయించారు. దీంతో పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని మన్మథుని సాయం తీసుకున్నారు. మన్మథుడు శివుడిపైకి పూల బాణాన్ని ప్రయోగించి, తపోభంగం కలిగించాడు. తపో భంగంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మథున్ని భస్మం చేస్తాడు. అలా కోరికలు దహింపజేసిన రోజు కావడం వల్ల ఆ రోజు కామదహనం పేరుతో మన్మథుడి బొమ్మను గడ్డితో చేసి తగులబెడతారు. మన్మథుడు శివుని తపోభంగం చేసినపుడు శివుడు మూడవ కంటితో దహించిన రోజు కనుక కాముని పూర్ణిమ అని అంటారు. హోలిక అనే రాక్షసి చంపబడినందున హోళికా పూర్ణిమ అని అంటారు. హోలికా, హోళికాదాహో అనే నామాలతో దీనిని పేర్కొంటున్నది స్మృతి కౌస్తుభము. కామదహనమనే పేరునూ వింటాము. హుతాశనీ పూర్ణిమా, వహ్యుత్సవం అని కూడా దీనిని అంటారు.*

*ఈనాడు లక్ష్మీనారాయణ వ్రతం, అశోక పూర్ణిమా వ్రతం, ధామత్రి రాత్ర వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి, శయన దాన వ్రతం చేస్తారని పురుషార్థచింతామణి, శశాంక పూజ చేస్తారని నీలమత పురాణం, చంద్రపూజ విషయం ప్రత్యేకం గమనింప తగింది. కొన్ని గ్రంథాలు దీనిని డోలా పూర్ణిమ అంటున్నాయి. ఈనాడు లింగ పురాణమును దానం చేస్తే శివలోక ప్రాప్తి కలుగునని ఫాల్గుణశుద్ధ పూర్ణిమను తెలుగువారు కాముని పున్నమ అంటారు. అది అరవవారి పంగుని ఉత్తిరమ్.*

*ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నాడు చంద్రుడు ఉత్తర ఫల్గునీ నక్షత్రంతో ఉంటాడనేది మనకు తెలిసిందే. ఈ వండుగతో శీతాకాలం వెనుకబడి వసంత ఋతువు లక్షణాలు పైకొంటాయి. చలి తగ్గు ముఖంలో ఉంటుంది. ఉక్కపోత ఇంకా ప్రారంభం కాదు. సూర్యుడు బాగా ప్రకాశిస్తూ హితవై ఉంటాడు. అన్నిపంటలు ఇంటికి వస్తాయి. కర్షకుడికి కడుపు నిండా తిండి దండిగా దొరికే రోజులు అంతా ఆనందం గోవిందంగా ఉంటుంది. వస్తూ వున్న వసంత ఋతువుకు స్వాగతోపచారాలు చేసే సమయం.*

*🍀. శాస్త్రీయ కారణాలు - సహజమైన రంగులు 🍀*

*శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంత కాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. దీనివల్ల వైరల్ జ్వరం, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన, నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందనేది ఒక వాదన. కుంకుమ, పసుపు, బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు. తడి రంగుల కోసం, మోదుగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు, అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. అందుకని సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధముగా పనిచేస్తుందని అర్థం.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 512 / Bhagavad-Gita - 512 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 23 🌴*

*23. ఉపద్రష్టానుమన్తా చ భర్తా భోక్తా మహేశ్వర: |*
*పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మేన్ పురుష: పర: ||*

*🌷. తాత్పర్యం : అయినను ఈ దేహమునందు దివ్యప్రభువును, దివ్యయజమానుడును, పర్యవేక్షకుడును, అంగీకరించు వాడును, పరమాత్మగా తెలియబడు వాడును అగు దివ్యభోక్త మరియొకడు కలడు.*

*🌷. భాష్యము : జీవాత్మతో సదా కూడియుండు పరమాత్ముడు దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రాతినిధ్యమని ఇచ్చట పేర్కొనబడినది. అట్టి పరమాత్మ ఎన్నడును సామాన్యజీవుడు కాడు. అద్వైతులైన వారు దేహము నెరిగిన క్షేత్రజ్ఞుడు ఒక్కడేయని భావించుట వలన ఆత్మ మరియు పరమాత్మల నడుమ భేదము లేదని తలతురు. కనుక సత్యమును వివరించుట కొరకే శ్రీకృష్ణభగవానుడు తాను పరమాత్మ రూపమున ప్రతిదేహమునందు ప్రాతినిధ్యము వహించుచున్నానని తెలియజేయుచున్నాడు. అతడు సదా జీవాత్మకు భిన్నుడైనవాడు. కనుకనే “పర”(దివ్యుడని) యని తెలియబడినాడు. జీవాత్మ కర్మక్షేత్రపు కర్మల ననుభవించుచుండ, పరమాత్ముడు మాత్రము భోక్తగా లేక కర్మల యందు వర్తించువాడుగా గాక సాక్షిగా, ఉపద్రష్టగా, అనుమంతగా, దివ్యభోక్తగా వర్తించును.*

*కనుకనే అతడు ఆత్మయని పిలువబడక పరమాత్మగా తెలియబడినాడు. అతడు సదా దివ్యుడు. అనగా ఆత్మ మరియు పరమాత్మ భిన్నమనునది స్పష్టమైన విషయము. పరమాత్మ సర్వత్రా పాణి,పాదములను కలిగియుండును. కాని జీవాత్మ అట్లు సర్వత్రా పాణి, పాదములను కలిగి యుండదు. అదియును గాక పరమాత్మ దేవదేవుని ప్రాతినిధ్యమైనందున హృదయస్థుడై నిలిచి, జీవాత్మ కోరు భోగానుభవమునకు అనుమతి నొసంగుచుండును. అనగా పరమాత్ముని అనుమతి లేనిదే జీవాత్మ ఏమియును చేయజాలదు. కనుకనే జీవాత్మ “భుక్తము” (పోషింపబడువాడు) అని, పరమాత్మ “భోక్త”(పోషించువాడు) యని తెలియబడుచున్నారు. అట్టి పరమాత్మ అసంఖ్యాకములుగా నున్న జీవులందరి యందును మిత్రుని రూపమున నిలిచియుండును.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 512 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 23 🌴*

*23. upadraṣṭānumantā ca bhartā bhoktā maheśvaraḥ*
*paramātmeti cāpy ukto dehe ’smin puruṣaḥ paraḥ*

*🌷 Translation : Yet in this body there is another, a transcendental enjoyer, who is the Lord, the supreme proprietor, who exists as the overseer and permitter, and who is known as the Supersoul.*

*🌹 Purport : It is stated here that the Supersoul, who is always with the individual soul, is the representation of the Supreme Lord. He is not an ordinary living entity. Because the monist philosophers take the knower of the body to be one, they think that there is no difference between the Supersoul and the individual soul. To clarify this, the Lord says that He is represented as the Paramātmā in every body. He is different from the individual soul; He is para, transcendental. The individual soul enjoys the activities of a particular field, but the Supersoul is present not as finite enjoyer nor as one taking part in bodily activities, but as the witness, overseer, permitter and supreme enjoyer.*

*His name is Paramātmā, not ātmā, and He is transcendental. It is distinctly clear that the ātmā and Paramātmā are different. The Supersoul, the Paramātmā, has legs and hands everywhere, but the individual soul does not. And because the Paramātmā is the Supreme Lord, He is present within to sanction the individual soul’s desiring material enjoyment. Without the sanction of the Supreme Soul, the individual soul cannot do anything. The individual is bhukta, or the sustained, and the Lord is bhoktā, or the maintainer. There are innumerable living entities, and He is staying in them as a friend.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 867 / Sri Siva Maha Purana - 867 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 35 🌴*

*🌻. శంఖచూడుని దూత శివునితో సంభాషించుట - 4 🌻*

*ఓ కైలాసగిరీశా! నీవు దేవపక్షపాతివని ప్రసిద్ధిని గాంచినావు (30). బలిచక్రవర్తియొక్క సర్వస్వమును ఊడలాగుకొని, ఆతనిని పాతాళమునకు సాగనంపుటకు కారణమేమి? గదాధరుడగు విష్ణువు ద్వారపాలకుడై ఆతనిని ఉద్ధరించినాడు 931). దేవతలు హిరణ్యాక్షుని, ఆతని సోదరుని హింసించుటకు కారణమేమి? దేవతలు శుంభాది రాక్షసులను సంహరించుటకు కారణమేమి? (32).*

*పూర్వము సముద్రమును మథించినప్పుడు దేవతలు అమృతమున భక్షించిరి. అపుడు మేము ఇడుముల పాలైతిమి. వారందరు ఫలమును అనుభవించిరి (33). ఈ జగత్తు కాలరూపుడగు పరమాత్మకు ఆటవస్తువు. ఆయన ఎప్పుడు ఎవ్వనికి ఐశ్వర్యమునిచ్చునో, అప్పుడు వాడు దానిని భోగించును (34). దేవదానవుల మధ్య శాశ్వతమగు వైరము గలదు. సర్వదా దానికి నిమిత్తము కూడ గలదు. వారికి జయపరాజయములు క్రమముగా కాలమునకు అధీనమై లభించు చుండును 935). వారి ఈ విరోధములో నీవు తలదూర్చుట వ్యర్థము అగును. ఇరుపక్షముల వారికి నీతో సమసంబంధము గలదు. కావున ఈశ్వరుడవగు నీవు ఒక పక్షమున చేరుట సొగసుగా లేదు (36). దేవదానవులకు అందరికీ ప్రభుడవు, మహాత్ముడవు అగు నీవు ఈ నాడు ఈ విధముగా మాతో కయ్యమునకు దిగుట సిగ్గుచేటు (37). నీవు జయించినచో నీ కీర్తి లేశ##మైననూ ఇనుమడించదు. కాని నీవు ఓడినచో కీర్తికి హాని కలుగును. ఈ వైపరీత్యమును నీవు మనస్సులో చక్కగా విచారించదగును (38).*

సనత్కుమారుడిట్లు పలికెను - ఈ మాటలను విని ముక్కంటి బిగ్గరగా నవ్వి దానవచక్రకర్తియగు శంఖచూడుని ఉద్దేశించి యథోచితము, మధురము అగు వచనమును పలెకెను (39).*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 867 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 35 🌴*

*🌻 The conversation between Śiva and the emissary of Śaṅkhacūḍa - 4 🌻*

30. Your Majesty too, O Śiva, is famous as a partisan of the gods. Why did you fight with the Tripuras[2] and reduce them to ashes?

31. After divesting him of every thing why was Bali packed off to Sutala and other regions[3]? Did Viṣṇu go to his threshold as his uplifter?

32. Why was Hiraṇyākṣa[4] harassed by the gods along with his brother? Why were Śumbha[5] and other Asuras subjected to fall by the gods?

33. Formerly when the ocean was churned, the nectar was drunk off by the gods.[6] All the strain and stress was ours but the gods reaped the fruit of our endeavour.

34. The entire universe is but an object of sport of Kāla the supreme soul. Whomsoever and whensoever he pleases to bestow the riches he atttains them.

35. The enmity of the gods and the Dānavas is perpetual and sparked off due to some reason or other. By turns, subject to the whims of Kāla they enjoy victory or defeat.

36. Interference on your part in the dispute between the two is futile. This does not behove you, the lord who are equally in touch with both.

37. Your rivalry to us is excessively shameful since you are lord unto the gods as well as to the Asuras. You are the supreme soul.

38. In the event of your victory your fame is not enhanced. In the event of your defeat you suffer a great loss. Let this disadvantage be pondered over.

Sanatkumāra said:—
39. On hearing these words, the three-eyed lord laughed and spoke sweetly to the leading Dānava what seemed proper.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 125 / Osho Daily Meditations  - 125 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 125. సందేహం మరియు ప్రతికూలత 🍀*

*🕉  సందేహం ఉండడం అంటే నీకు ఎలాంటి స్థితి లేదు; కానీ మీరు ఏదైనా స్వీకరించడానికి, విచారించడానికి సిద్ధంగా ఉంటే సందేహం అనేది ఉత్తమ ప్రారంభం. 🕉*

*సందేహం చెడ్డది కాదు. ప్రతికూలత పూర్తిగా భిన్నమైన విషయం. ప్రతికూలత అంటే మీరు ఇప్పటికే వ్యతిరేక స్థానాన్ని తీసుకున్నారని అర్థం. సందేహం అంటే నీకు ఎలాంటి స్థితి లేదు; మీరు విశాల దృక్పథంతో విచారించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ నుండి ప్రారంభించాలి అన్నప్పుడు సందేహం ఉత్తమ ప్రారంభం.*

*సందేహం అంటే తపన, ప్రశ్న; ప్రతికూలత అంటే మీకు ఇప్పటికే పక్షపాతం ఉంది, మీరు మూర్ఖులు. మీరు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా మీ పక్షపాతం సరైనదని నిరూపించు కోవడం. సందేహం అపారమైన ఆధ్యాత్మికం. కానీ ప్రతికూలత అనేది ఏదో అనారోగ్యం.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 125 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 125. DOUBT AND NEGATIVITY 🍀*

*🕉  Doubt means that you don't have any position; you are ready to inquire. with an open mind. Doubt is the best point from where to begin. 🕉*

*Doubt is not bad. Negativity is a totally different thing. Negativity means you have already taken a position-against. Doubt means you don't have any position; you are ready to inquire, with open mind. Doubt is the best point from where to begin.*

*Doubt simply means a quest, a question; negativity means you already have a prejudice, you are bigoted. You have already decided. Now all that you have to do is somehow to prove your prejudice right. Doubt is immensely spiritual.  But negativity is something sick.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 539 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 539 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 110. సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ ।*
*స్వాహా, స్వధా, అమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా ॥ 110 ॥ 🍀*

*🌻 539. 'శ్రుతిః' - 2 🌻*

*వేదము నుండియే ప్రథమ సంకల్పము ఏర్పడును. కాలము ఏర్పడును. ప్రకృతి పురుషులు ఏర్పడుదురు. మహదహంకారము, త్రిగుణములు యేర్పడును. త్రిగుణముల నుండి సృష్టిజీవులు, లోకములు యేర్పడును. పంచభూతాత్మక సృష్టి యేర్పడును. ఇట్లు అన్నిటికి మూల మేదియో తెలియుట వేదములు తెలియుట, బ్రహ్మమును తెలియుట, తత్త్వమును తెలియుట. ఈ తత్త్వము ఏమియూ లేనట్లుగ యుండును. చోటువలె యుండును. అందుండి క్రమముగ అన్నియూ యేర్పడును. ఏర్పడిన వాటి కన్నిటికినీ కాలపరిమితి యుండును. కాని ఆ తత్త్వము మాత్రము కాలమునకు కూడ మూలమై యుండును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 539 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 110. Sarvaodana pritachitta yakinyanba svarupini*
*svahasvadha amati rmedha shrutih smrutiranuttama ॥110 ॥ 🌻*

*🌻 539. 'Shrutih' - 2 🌻*

*The first will is formed from the Veda itself. Time is formed. Nature and man are formed. Mahadahankara, Triguna aree formed. Creatures and worlds are formed from trigunas. The creation with five elements is formed. Knowing the root of all these means knowing the Vedas, knowing Brahma, knowing Tattva. This philosophy is like nothing. It will be like a place. From there everything will be formed gradually. There is a time limit for all those that are formed such. But that philosophy would also be the source of time.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 సిద్దేశ్వరయానం - 22 🌹*

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
     
*🏵 భైరవనాథుడు 🏵*

*నాగ భైరవుడు గుహ లోపలికి అడుగు పెట్టగానే అసభ్యదృశ్యాలు కనిపిస్తున్నవి. అరకొరగుడ్డలతో ఉన్న ఒక మధ్యవయస్కుడు అతని ఒడిలో అర్ధనగ్నస్త్రీ. ఇద్దరూ మద్యం తాగుతున్నారు. ఎదురుగా మద్యపాత్రలు, మాంసఖండములు ఉన్నవి. ఇతడు లోపలికి ప్రవేశించగానే చూచి అతడు కోపంతో ఊగిపోయాడు. “మూర్ఖుడా! బుద్ధిలేదా? కామాసక్తులమై ఒంటరిగా ఉన్న స్త్రీ పురుషుల దగ్గరకు రాకూడదని తెలియదా? వెళ్ళిపో. వెంటనే బయటకువెళ్ళు అని అరిచాడు.*

*యువకుడు "నమోదత్త ! నమోదత్త! అయ్యా! ఇది దత్తాత్రేయస్వామి గుహ అని విని ఆ మహాత్ముని దర్శనానికి వచ్చాను. మీరెవరో నన్ను కోప్పడుతున్నారు. తప్పైతే మన్నించండి" అని చేతులు జోడించాడు. అతడు "తప్పా! తప్పున్నరా ! ఇది ఎవరి గుహ అనేది నాకు తెలియదు. ప్రక్కనే ఉన్న గ్రామం మాది. మేం కామం తీర్చుకోవటానికి చూస్తుంటే ఈ గుహ కనిపించింది. ఆ దత్తుడెవడో మాకు తెలియదు. చెప్పానుగా ఇంక మరుక్షణం వెళ్ళిపో" అని మళ్ళీ కేకలు పెట్టాడు.*

*యువకునకు ఏం చేయాలో తోచలేదు. వస్తానన్న గురువుగారింకా రాలేదు. మారుమాట్లాడకుండా నిలబడ్డాడు. ఆ కోపిష్టి మనిషి "నీకు సిగ్గులేదా? మెడ బట్టి బయటకు గెంటాలా? ఏం చేస్తానో చూడు. అని ఎదురుగా ఉన్న కల్లుముంత పట్టుకొని యువకుని మోహం మీదికి విసిరేశాడు. ఆ దెబ్బకు మొహంమీద ముంతపగిలి గాయమై నెత్తురు కారటం మొదలు పెట్టింది. కల్లు శరీరమంతా పడింది. అయినా అతడు కదలలేదు. విక్రియ చెందలేదు. ఇంతలో వామదేవమహర్షి వచ్చాడు. "దత్తస్వామీ ! ఈ పిల్లవాణ్ణి పరీక్షిస్తున్నారా! అనుగ్రహించండి" అని చేతులు జోడించాడు. క్షణంలో దృశ్యం మారిపోయింది. మద్యపాత్రలు లేవు. మాంస ఖండములు లేవు. అర్ధ నగ్నకామిని లేదు. జటాజూటధారి దండకమండలు సమన్వితుడు అయిన దత్తాత్రేయస్వామి సాక్షాత్కరించాడు. “మంచి కుర్రాడినే పట్టుకొచ్చావయ్యా! అనుకున్నది. సాధించటానికి పనికి వస్తాడు" అన్నాడు.*

*యువకుడు దత్తస్వామికి సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామి అతని శిరస్సు మీద చేయిపెట్టి ఆశీర్వదించాడు.. వామదేవుడు "దత్తప్రభూ ! దేవకార్యం కోసం ఇతనిని శక్తిమంతుణ్ణి చేయటానికి మీరు సంకల్పించాలి. జగన్నాథుడైన కృష్ణ భగవానుడు భౌతికశరీరాన్ని విడిచిన తర్వాత ఆయనను ఎదిరించలేని శత్రువులు కృష్ణధామాన్ని, భారతభూమిని విధ్వంసం చేయాలని ప్రయత్నిస్తున్నారు. మీకు తెలియనిదేదీ లేదు. మీ దీవెనలతో ఈ మహాకార్యం సిద్ధించాలి. హస్తమస్తక సంయోగం చేసి ఇతనిలోకి శక్తిపాతం చేశారు. చాలా సంతోషం కలిగింది. మరొక ప్రార్ధన. వృషభానుపుత్రిక కృష్ణప్రియ రాధాదేవి ఇక్కడ నూరు సంవత్సరములు తపస్సు చేసి శరీరాన్ని విడిచిపెట్టి ఉపరాధయై బృందావనేశ్వరి కృష్ణారాధ్య, కృష్ణపత్ని అయిన రాధాదేవి సేవలోకి వెళ్ళిందని విన్నాను. ఆమె శరీర అవశేషాల మీద మీరు సువర్ణ రాధా విగ్రహాన్ని నిర్మించారని సిద్ధాశ్రమ యోగులు చెప్పారు. రేపు భాద్రపద శుద్ధ అష్టమి - రావల్ గ్రామంలో ఆమె అవతరించిన రోజు గదా! మీరు దయతో ఆమె దర్శనం చేయించాలి. ఈ పిల్లవాడు కూడా మనతో రావటానికి అనుమతించండి!*

*దత్రాత్రేయులవారు అంగీకరించారు. మరునాడు ఆ దేవిని దర్శించి దత్తస్వామి దగ్గర సెలవు తీసుకొని వామదేవ ఋషి నాగభైరవునితో బయలుదేరి కైలాస పర్వత ప్రాంతంలోను, మానస సరస్సు దగ్గర ఉన్న కొందరు శతసహస్ర వర్ష మహర్షుల ఆశీస్సులిప్పించి హిమవత్ పర్వతశ్రేణులలో కొంతదూరం వెళ్ళారు. త్రోవలో ఒక కోయపల్లె కనిపించింది. కొండ క్రింద అడవి. అక్కడ ఈ గ్రామం. వామదేవ మహర్షికి ఆ ప్రదేశాలన్నీ సుపరిచితములైనవి. వీరా ఊరు చేరగానే ఆ గ్రామస్థులు భక్తితో స్వాగతం చెప్పి వసతి, భోజనాదులు ఏర్పాటు చేశారు. ఆ ఊరిలో రేణుకాదేవి ఆలయమున్నది. ఆ గుడిలో ఆ దేవి శబరకాంతగా భాసిస్తున్నది. అక్కడకు వెళ్ళి ఆ తల్లి దర్శనం చేసుకొన్నారు. మహర్షి ఆ ఎల్లమ్మ తల్లిని స్తుతించాడు.*

*శ్లో గుంజాఫలాకల్పిత చారుహారా శీర్షిశిఖండం శిఖినోవహంతీ ధనుశ్చబాణాన్ దధతీకరాభ్యాం సా రేణుకావల్కల భృత్ విచింత్యా*
*మెడలో గురివెంద గింజల దండ, తల మీద నెమలి పింఛము చేతులలో విల్లంబులు ధరించిన రేణుకాదేవికి నమస్కరిస్తున్నాను.*

సీ వందనంబిందిరావరుగన్నతల్లికి దండంబు ఫణిరాజ మండనకును అంజలి సోమ సూర్యానలనేత్రకు అభివందనము జగదంబికకును మొగుపు చేతులు దేవముని సిద్ధసేవ్యకు నమితంబు గిరిరాజ నందనకును జోహారు రమణీయ శోభనాకారకు జమదగ్ని గారాబు సతికి శరణు*
*అంటూ పారవశ్యంతో 'సురశిరశ్చరణ రేణుకా జగదధీశ్వరీ జయతి రేణుకా అని గీతాగానం చేశాడు.*

*నాగభైరవుడు ఆశ్చర్యంతో చూస్తూ ఆ ప్రస్తుతి పూర్తియై మహర్షి పూజ చేసిన తరువాత ఆ దేవత గురించి తానెప్పుడూ వినలేదని ఆమె మహత్వాన్ని గురించి తెలియ జేయమని అభ్యర్థించాడు.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj

No comments:

Post a Comment