శ్రీమద్భగవద్గీత - 281: 07వ అధ్., శ్లో 01 / Bhagavad-Gita - 281: Chap. 07, Ver. 01

 

🌹. శ్రీమద్భగవద్గీత - 281 / Bhagavad-Gita - 281 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴.7 వ అధ్యాయము - జ్ఞానవిజ్ఞాన యోగం - 01 🌴


01. శ్రీభగవానువాచ

మయ్యాసక్తమనా: పార్థ యోగం యుంజన్మదాశ్రయ: |
అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తుచ్చ్రుణు ||

🌷. తాత్పర్యం :

శ్రీకృష్ణభగవానుడు పలికెను: ఓ పార్థా! మనస్సును నా యందే సంలగ్నము చేసి నా సంపూర్ణభావనలో యోగమభ్యసించుట ద్వారా నీవు నిస్సందేహముగా నన్నెట్లు సమగ్రముగా నెరుగగలవో ఇప్పుడు ఆలకింపుము.

🌷. భాష్యము :

భగవద్గీత యొక్క ఈ సప్తమాధ్యాయమున కృష్ణభక్తిరసభావనా తత్త్వము సమగ్రముగా వివరింపబడినది.

సమస్త విభూతులను సంగ్రముగా కలిగియున్న శ్రీకృష్ణభగవానుడు తన విభూతులను సమగ్రముగా కలిగియున్న శ్రీకృష్ణభగవానుడు తన విభూతులను సమగ్రముగా కలిగియున్న శ్రీకృష్ణభగవానుడు తన విభూతులను ఏ విధముగా ప్రదర్శించునో ఈ అధ్యాయమున వర్ణింపబడినది.

అదే విధముగా శ్రీకృష్ణుని శరణుజొచ్చు నాలుగు తరగతుల అదృష్టభాగుల గూర్చియు మరియు కృష్ణునికి ఎన్నడును శరణమునొందని నాలుగు తరగతుల అదృష్టహీనుల గూర్చియు ఈ అధ్యాయమున వివరింపబడినది.

భగవద్గీత యొక్క మొదటి ఆరుఅధ్యాయములలో జీవుడు ఆత్మస్వరూపుడనియు మరియు వివిధములైన యోగముల ద్వారా తనను ఆత్మసాక్షాత్కారస్థితితికి ఉద్దరించుకొనగలడనియు వివరింపబడినది.

శ్రీకృష్ణభగవానుని యందు స్థిరముగా మనస్సును సంలగ్నము చేయుటయే (కృష్ణభక్తిరసభావనము) యోగములన్నింటి యందును అత్యున్నత యోగమనియు షష్టాధ్యాయపు అంతమున స్పష్టముగా తెలుపబడినది. అనగా శ్రీకృష్ణునిపై మనస్సును నిలుపుట ద్వారానే మనుజుడు పరతత్త్వమును సమగ్రముగా నెరుగగలడు గాని అన్యథా కాదు. నిరాకార బ్రహ్మానుభూతి గాని లేదా పరమాత్మానుభూతి గాని అసంపూర్ణమై యున్నందున ఎన్నడును పరతత్త్వపు సంపూర్ణజ్ఞానము కాజాలదు.

వాస్తవమునకు అట్టి సంపూర్ణ శాస్త్రీయజ్ఞానము శ్రీకృష్ణభగవానుడే. కృష్ణభక్తిరసభావన యందు మనుజుడు శ్రీకృష్ణుడే నిస్సందేహముగా చరమజ్ఞానమని ఎరుగగలడు. వివిధములైన యోగపద్ధతులు అట్టి కృష్ణభక్తిరసభావనమునకు సోపానములు వంటివి మాత్రమే. కనుకనే కృష్ణభక్తిభావన యందు ప్రత్యక్షముగా నెలకొనినవాడు బ్రహ్మజ్యోతి మరియు పరమాత్మలకు సంబంధించిన జ్ఞానమును సంపూర్ణముగా అప్రయత్నముగనే పొందగలుగును.

అనగా కృష్ణభక్తిభావనాయోగమును అభ్యసించుట ద్వారా మనుజుడు పరతత్త్వము, జీవులు, ప్రకృతి, సంపత్పూర్ణమైనటువంటి వాని వ్యక్తీకరణముల గూర్చి పూర్ణముగా తెలిసికొనగలుగును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 281 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Vijnana Yoga - 01 🌴


01. śrī-bhagavān uvāca

mayy āsakta-manāḥ pārtha yogaṁ yuñjan mad-āśrayaḥ
asaṁśayaṁ samagraṁ māṁ yathā jñāsyasi tac chṛṇu

🌷 Translation :

The Supreme Personality of Godhead said: Now hear, O son of Pṛthā, how by practicing yoga in full consciousness of Me, with mind attached to Me, you can know Me in full, free from doubt.

🌹 Purport :

In this Seventh Chapter of Bhagavad-gītā, the nature of Kṛṣṇa consciousness is fully described. Kṛṣṇa is full in all opulences, and how He manifests such opulences is described herein. Also, four kinds of fortunate people who become attached to Kṛṣṇa and four kinds of unfortunate people who never take to Kṛṣṇa are described in this chapter.

In the first six chapters of Bhagavad-gītā, the living entity has been described as nonmaterial spirit soul capable of elevating himself to self-realization by different types of yogas. At the end of the Sixth Chapter, it has been clearly stated that the steady concentration of the mind upon Kṛṣṇa, or in other words Kṛṣṇa consciousness, is the highest form of all yoga. By concentrating one’s mind upon Kṛṣṇa, one is able to know the Absolute Truth completely, but not otherwise. Impersonal brahma-jyotir or localized Paramātmā realization is not perfect knowledge of the Absolute Truth, because it is partial. Full and scientific knowledge is Kṛṣṇa, and everything is revealed to the person in Kṛṣṇa consciousness.

In complete Kṛṣṇa consciousness one knows that Kṛṣṇa is ultimate knowledge beyond any doubts. Different types of yoga are only steppingstones on the path of Kṛṣṇa consciousness. One who takes directly to Kṛṣṇa consciousness automatically knows about brahma-jyotir and Paramātmā in full. By practice of Kṛṣṇa consciousness yoga, one can know everything in full – namely the Absolute Truth, the living entities, the material nature, and their manifestations with paraphernalia.

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment