భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 76


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 76 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ



🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 26 🌻


324. స్థూలకాయముతో అపవిత్రుడైన మానవుడు దేవతల కంటే తక్కువ స్థితి గలవాడు. కానీ మానవుడు వానిలో అంతర్నిహితమైయున్న శక్యతల వలన నిజముగా శ్రేష్ఠుడు.


325. మానవుడు తన అపరిపూర్ణతలను, హద్దులను బలహీనతలను అనుభవించుచు తన నిజమైన శక్తిని, పవిత్రతను అనుభూతి నొందుటలో (అంతర్గతముగా) శక్యతగా పరిపక్వమైనవాడు.
ఈశక్యతయు, పవిత్రతయు ప్రధాన దేవదూతలకు కూడా అందుబాటులో లేనిది.


మౌఖిక ఐక్యము :__
326. మానవుని ఆధ్యాత్మిక వికాసములలోనిది యొకటి.అధిక సంఖ్యాకులైన మానవులు ఏదియో ఒక అవతారమును నమ్మి ఆతడు చెప్పు సందేశమందు విశ్వాసము కలిగి యుందురు .ఇక్కడ భగవంతునితో గల ఐక్యత మాటల ద్వారానే అంగీకరించుట జరుగుచున్నది .


దానికి తోడు మతగురువు లొసంగు మతధర్మములను పాటించుటతో , అది , రాబోవు ఆధ్యాత్మిక మార్గములో ప్రవేశించుటకు మానవుని తయారు చేయుచున్నది .

327. సామాన్య మానవుడు , మానవునిగా, తనను ప్రతి వారిలో ప్రతిదానిలో చూచును .ఇతడు భూమికలను గురించి వివరించలేడు .


సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


19 Oct 2020

No comments:

Post a Comment