🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 24 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
18. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతునాభ జంఘిక
గూఢగుల్ఫా కూర్మపృష్ట జయిష్ణు ప్రపదాన్విత
🌻 41. 'ఇంద్రగోప పరిక్షిప్త స్మరతునాభ జంఘిక 🌻
దేవి పిక్కలు అమ్ములపాదులతో పోల్చబడినవి. అవి ఎర్రగ
నున్నవని తెలుపబడినవి. మన్మథుడు పుష్పబాణముల నుంచు పొదులవలె తెలుపబడినవి. ఎర్రని రంగు అనగా ఆరుద్ర పురుగుల రంగు. అది అందమైన ఎరుపు.
కదంబ పుష్పపు ఎరుపు. అట్లు అందమైన ఎరుపుతో కాంతివంతముగ నున్న అమ్ముల పొదివలె, అదియును మన్మథుని అమ్ములపొదివలె శ్రీదేవి పిక్కలు గోచరించుచున్నవని భావము. ఆ అమ్ములపొదిలో మన్మథుని బాణములు గోప్యముగ రక్షింపబడుచున్నవి.
అవి సమస్త కామములను పూరింపగల శక్తిగలవి. పిక్కల యందుగల బలమును బట్టి జీవునికి కామమునందు గల బలము తెలియును.
శ్రీదేవి సమస్త కామములను వర్షింపగల శక్తి స్వరూపిణి. మోక్షకాములకు కూడ మోక్షము నందించగల శక్తి ఆమె పిక్కల కున్నది. బలహీనపు పిక్కలు గలవారు అమ్మవారి పిక్కల వర్ణమును ఆరాధన చేసినచో కామపూరణము సిద్ధించును.
ధర్మమునకు విరుద్ధము కాని కామము దివ్యమే. కామి కానివాడు
మోక్షకామి కూడ కాలేడు.
కావున కామమే సృష్టికిని అందుండి మోక్షము నకును ఆధారమగు శక్తి. అట్టి కామశక్తి పిక్కల యందుండునని శాస్త్రములు తెలుపుచున్నవి. సమస్త కామములనెడు అమ్ములను అమ్మవారు తన ఎఱ్ఱని, అందమైన పిక్కలనెడు పొదిలో రహస్యముగ దాచి ఉంచెనని అర్థము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 41 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
41. Indragopa- parikṣipta- smaratūṇābha-jaṅghikā इन्द्रगोप-परिक्षिप्त-स्मरतूणाभ-जङ्घिका (41)
Her calf muscles look like the quiver of Manmatha, the god of love.
Saundarya Laharī (verse 83) says “In order to win the heart of your Lord Śiva, the five arrowed cupid God of love has made your legs into an arrow case with ten arrows (toe nails).”
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 42 / Sri Lalitha Chaitanya Vijnanam - 42 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
18. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతునాభ జంఘిక
గూఢగుల్ఫా కూర్మపృష్ట జయిష్ణు ప్రపదాన్విత
🌻 42. 'గూఢగుల్ఫా' 🌻
బలిష్ఠమైన చీలమండలు గలది దేవి అని అర్థము. గుల్ఫ అను పదమునకు రక్షణ చేయునది అని అర్థము. గూఢ అనగా రహస్యముగ అని అర్థము. రహస్యముగ తనను ధ్యానించువానిని రక్షించు స్వభావము గలది శ్రీదేవి అని తెలియవలెను.
రహస్యముగ రక్షించుట ఇహజీవనమందలి సమస్యల నుండియే గాక ఇహమునుంచి కూడ రహస్యముగ శ్రీదేవి రక్షించ గలదు.
ఆమె మూల ప్రకృతి. ఆమె నుండియే అష్ట ప్రకృతులు ఉద్భవించినవి. ఆమె అవ్యక్తము యొక్క వ్యక్తరూపమే. ఇష్ట ప్రకృతులు ఆవరణములు సృష్టించగ ఆమె అవ్యక్తమునకు మొదటి ఆవరణముగ నిలచినది. ఆమె పరాప్రకృతి. ఆమె నుండి ఉద్భవించినవి అపర ప్రకృతులు.
అపర ప్రకృతుల నుండి దాటించి పరాప్రకృతి అనుభవము నిచ్చి అవ్యక్తమునకు గొనిపోవ సమర్ధురాలు శ్రీదేవియే. అమ్మవారి ఆరాధన సకల శుభములను రహస్య ముగ అందించును. బాహాటముగ రక్షణము గోచరింపక పోయినను అమ్మ తప్పక రక్షించును అను దృఢ విశ్వాసముతో ధ్యానించు వారికి ఆమె రక్షణ లభించును.
చీలమండలను ఒకదానిపై నొకటి పేర్చి గుదము క్రిందుగ నుంచి
సిద్ధాసనము వహించి ధ్యానించువారికి ప్రకృతి సహకరించి ప్రజ్ఞను
ఊర్థ్వగతి చేర్చి ఆజ్ఞయందు స్థిరపరచునని హఠయోగము బోధించుచున్నది. ఇది కుండలిని ప్రచోదన రహస్యవిద్య. దీని కధిదేవతకూడ అమ్మయే.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 42 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 42. Gūḍha-gulphā गूढ-गुल्फा (42) 🌻
She has round and well shaped ankles that are hidden.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Facebook, WhatsApp, Telegram groups:
19 Oct 2020
No comments:
Post a Comment