నిత్య ప్రజ్ఞా సందేశములు - 105 : 14. అజ్ఞానుల విశ్వాసం చెదర కొట్టకూడదు. / DAILY WISDOM - 105 : 14. The Faith of the Ignorant is not to be Shaken




🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 105 / DAILY WISDOM - 105 🌹

🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 14. అజ్ఞానుల విశ్వాసం చెదర కొట్టకూడదు. 🌻


విద్య వెనుక ఉన్న ప్రాథమిక తత్వం ఏమిటంటే 'అనుభవ స్థితిలో ఉన్న ఆ స్థాయి వాస్తవికతకి భంగం కలిగించకూడదు.' అని. భగవద్గీత ఇలా ఉద్బోధిస్తుంది: “అజ్ఞానుల విశ్వాసం చెదర కొట్టకూడదు” అయితే జ్ఞాని అజ్ఞానులకు జ్ఞానాన్ని అందించే పనిని చేస్తాడు. విద్య యొక్క ఏ దశలోనూ విద్యార్థి యొక్క స్థాయిని విస్మరించలేము. అయితే ఇది ఉన్నత స్థాయి జ్ఞానంతో పోల్చితే సరిపోని స్థాయి అని పరిగణించవచ్చు.

విద్య అనేది ఒక పూల మొగ్గ వికసించే కళాత్మక ప్రక్రియను పోలి ఉంటుంది. ఇది క్రమంగా మరియు అందంగా ఉంటుంది. ఏదైనా అనవసరమైన శక్తిని ప్రయోగించడం ద్వారా మొగ్గ అకస్మాత్తుగా తెరవబడదు; అలా చేస్తే అది వికసించదు, విరిగిపోతుంది. అటువంటి విరిగిన నిర్మాణం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఉపాధ్యాయుడు ఎల్లప్పుడూ విద్యార్థి వెనుక దాగి ఉంటాడు, అయినా అతను ఎల్లప్పుడూ విద్యార్థితోనే ఉన్నాడు. ఆ విద్యార్థి ఏర్పరచుకునే భావజాలలో అతను భాగస్వామి కాకూడదు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 105 🌹

🍀 📖 The Ascent of the Spirit 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 14. The Faith of the Ignorant is not to be Shaken 🌻


The basic psychology behind education should be “not to disturb the degree of reality involved in any state of experience.” The Bhagavadgita exhorts: “The faith of the ignorant is not to be shaken” while the wise one performs the function of imparting knowledge to the ignorant. The standpoint of the student in any stage of education cannot be ignored, though it may be regarded as an inadequate standpoint in comparison with a higher level of knowledge.

Education is similar to the artistic process of the blossoming of a flower bud, gradually and beautifully. The bud is not to be opened suddenly by exerting any undue force; else, it would not be a blossom, but a broken structure serving no purpose. The teacher is always to be hidden behind the student, though he is with the student at all times. He is not to come to the forefront, either as a superior or an unpleasant ingredient among the constituents that go to form the feelings, aspirations and needs of the student at any particular level.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment