శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 364-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 364-1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 364-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 364-1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 80. చితి, స్తత్పదలక్ష్యార్థా, చిదేక రసరూపిణీ ।
స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః ॥ 80 ॥ 🍀


🌻 364-1. 'చిదేక రసరూపిణీ' 🌻


చైతన్యముతో కూడిన ఆనందరస రూపము శ్రీమాత అని అర్థము. శ్రీమాత చైతన్యరూపిణి అనునది విదితమే. సృష్టి చైతన్యమే శ్రీమాత. చైతన్యము నుండియే సమస్తము భాసించును. ప్రజాపతులు, రుద్రులు, ఆదిత్యులు, సనకసనందనాది బ్రహ్మ మానస పుత్రులు, మానవులు, సప్తఋషులు, దేవతలు, లోకములు, లోకస్థులు, సమస్తము శ్రీదేవి మహాచైతన్యము నుండి ఏర్పడినవే. చైతన్యము నందు సహజముగ భాసించునవి యోగము, ధర్మము, ఆనందము. శ్రీమాత యోగిని, ఆమె సృష్టి కావల బ్రహ్మముతో యోగము చెంది యుండును.

సృష్టి కీవల ఈశ్వరునితో యోగము చెంది యుండును. ఎట్లైనను, తాదాత్మ్యము చెందియే యుండును. బ్రహ్మము నుండి వేరై బ్రహ్మముతో కూడి యుండుట ఒక దివ్యమగు అనుభూతి. కూడియుండుట వలన ఆనందానుభవము వుండును. రసానుభూతి యుండును. ఏకమై యున్నచో యుండుటయే యుండును గాని అనుభూతి యుండదు. అనుభూతి పరాకాష్ఠకు చేరినపుడు రసానుభూతి యుండును. మనము మధురమగు పదార్థమును భుజించి నపుడు మధురానుభూతి యుండును. అది యోగము. మనమే మధురమైన పదార్థమైపోయిన అనుభూతి యుండదు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 364-1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 80. Chiti statpada lakshyardha chidekarasa rupini
Svatyananda lavibhuta bramha dyananda santatih ॥ 80 ॥ 🌻

🌻 364-1. Cideka-rasa-rūpiṇī चिदेक-रस-रूपिणी 🌻


She is the essence of knowledge. The difference between knowledge and the essence of knowledge is to be understood. The knowledge of the unconditioned Brahman or the Prakāśa form of the Brahman is different from the conditioned Brahman or the vimarśa form of the Brahman.

The Brahman with attributes and without attributes remains the same, so also their purity of knowledge. This is the reason for establishing the identity of the both as one.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


16 Apr 2022

No comments:

Post a Comment