మీ నిజ స్వరూపాన్ని తెలుసుకోండి. నిజస్వరూపానికి వదనమే చిహ్నం


🌹. మీ నిజ స్వరూపాన్ని తెలుసుకోండి. నిజస్వరూపానికి వదనమే చిహ్నం 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో ) 🍀

📚. ప్రసాద్‌ భరద్వాజ.


మీకు జరిగిన దానికి మీరే బాధ్యులు కానీ, ఇతరులు కాదు. ఎందుకంటే, మీరు చెయ్యాలనుకున్నదే చేశారు. మీరు ఇష్టపడే మిమ్మల్ని దోచుకునే అవకాశమిచ్చారు. అందుకే ఇతరులు మిమ్మల్ని దోచుకున్నారు.

అలాగే మీరు జైలులో ఉండాలని కోరుకున్నారు. దానికోసమే మీరు పాకులాడారు. అందుకే మిమ్మల్ని జైలులో పెట్టారు. బహుశా, అక్కడే భద్రత ఉంటుందని మీరు అనుకోవచ్చు. మీ పేర్లు, వాటికున్న చీటీలు వేరువేరుగా ఉండవచ్చు. కానీ, వాటి బంధనాలలో ఉండాలనే మీరు కోరుకుంటున్నారు. ఎందుకంటే, ఎవరైనా జైలులోనే ఎలాంటి ప్రమాదం లేకుండా చాలా సురక్షితంగా ఉంటారు.

కానీ, జైలు గోడలతో పోరాడకుండా మీ అంతరంగంలోకి చూడండి. భద్రత కోసం ఆశపడే మిమ్మల్ని గుంపు ఎలా మోసగిస్తుందో చాలా జాగ్రత్తగా గమనించండి. గుర్తింపు, గౌరవం, మర్యాద, కీర్తి, ప్రతిష్ఠలను మీరు గుంపు నుంచి కోరుకుంటారు. అందుకు మీరు మీ స్వేచ్ఛను గుంపుకు చెల్లించక తప్పదు. ఇది మామూలు బేరమే. అన్నీ మీకు మీరే చేసుకుంటారు కానీ, గుంపు మీకు ఎప్పుడూ ఏమీచెయ్యదు. కాబట్టి, ముందు మీరు మీ విధానాల నుంచి బయటపడండి.

🌻. మీ నిజ స్వరూపాన్ని తెలుసుకోండి: 🌻

ప్రపంచం గురించి మీరు ఏమాత్రం పట్టించుకోకుండా మీకు మీరుగా ఉండండి. అప్పుడే మీకు చక్కని విశ్రాంతి, మీ హృదయానికి అద్భుతమైన శాంతి లభిస్తుంది. కాబట్టి, ఎలాంటి ఉద్రిక్తతలు, కపట నటనలు, క్రమశిక్షణతో కూడిన ప్రవర్తనలు లేకుండా, మీకుమీరుగా, యధాతథంగా ఉండండి. అదే ‘‘మీ నిజ స్వరూపం’’అని ‘‘జెన్’’ వాదులంటారు.

నిజ స్వరూప ముఖవైఖరి ఎప్పుడూ చక్కని కవితాత్మక సౌందర్యం కలిగి ఉంటుందని గుర్తుంచుకోండి. అంటే, మీకేదో ప్రత్యేకమైన ముఖం ఉంటుందని కాదు అర్థం. ఎలాంటి ఉద్రిక్తతలు, కపట నటనలు, క్రమశిక్షణతో కూడిన ప్రవర్తనలు లేని, ఎలాంటి తీర్పులు చెప్పని, ఇతరులను ఎప్పుడూ తక్కువగా చూడని విలువలతో కూడిన ప్రశాంత వదనమే మీ నిజ స్వరూపం.

‘‘పిరికివాడుగా ఉండేందుకు ఏమాత్రం ధైర్యం లేనివాడే అసలైన వీరుడు’’ అనేది ప్రాచీన సామెత. ఒకవేళ మీరు నిజంగా పిరికివారే అయినా, అందులో తప్పేముంది? అది మంచిదే.

సమాజానికి పిరికివాళ్ళు కూడా అవసరమే. వారి నేపథ్యంలోనే వీరులు కనిపిస్తారు. లేకపోతే, వీరులను గుర్తించేదెలా? కాబట్టి, ఏదేమైనా మీరుమీరుగా ఉండండి. ఇంతవరకు ఇలా ఎవరూ చెప్పలేదు. అందరూ అతి చిన్న విషయాలలో కూడా ‘‘మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి’’అన్నవారే.

చిన్నప్పటినుంచి నేను నేనుగానే ఉండేవాడిని. అది ఎవరికీ అంతగా నచ్చేది కాదు. ఒకరోజు మా మాస్టారు ‘‘నేను చెప్పేది వినకుండా ఎప్పుడూ ఆ కిటికీలోంచి అలా చూస్తావేమిటి?’’అని నన్ను అడిగారు.

‘‘అందమైన పక్షులతో కూడిన చెట్లతో నిండిన విశాలమైన ఆకాశం కనిపించే ఇలాంటి అందమైన కిటికీ మా ఇంట్లో లేదు సార్’’అన్నాను. ‘‘చూడు, నువ్వు చక్కగా చదువుకుంటే గొప్ప మేధావి అవుతావు’’అన్నారాయన. ‘‘నాకు అలా అవాలని లేదు సార్, నేను నేనుగా ఉంటే చాలు’’ అన్నాను ఆయనతో. ‘‘అయితే స్కూలుకు ఎందుకు వస్తున్నట్లు?’’ అన్నారాయన చిరాకుపడుతూ. కపట నటన నాకు ఇష్టంలేదు కాబట్టి, నిజమే చెప్తున్నా.

స్కూలుకు ఫీజు కడుతున్నందుకు, మీ పాఠాలు వింటున్నట్లు నటిస్తూ ఈ కిటికీలోంచి చూసేందుకే రోజూ నేను స్కూ లుకు వస్తున్నా’’ అన్నాను ఆయనతో. ఆ రోజుల్లో నేను చదువుకునే కాలేజీలో అందరూ టోపీ ధరించాలనే నిబంధన ఉండేది. దానికి నేను వ్యతిరేకిని కాదు.

🌹 🌹 🌹 🌹 🌹


20 Jan 21

No comments:

Post a Comment