🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. శుకమహర్షి - 3 🌻
15. ఇవి ఈ జీవుడికి ఎప్పుడూ సౌఖ్యాన్నిస్తాయి. కాని ముక్తిని పొందేప్రయత్నం చేయకపోతే అది ఇక ఏ జన్మలోనూ లభించదు. అంటే ఆ తరువాత, కోరుకోవలసిన బాధ్యత ఆ జీవుడి యందుంటుంది.
16. ఇవి కలిగాక – విద్య, వేదాంగములు, సత్యము, ఇవన్నీ ఉన్నతరువాతకూడా తపస్సుచేస్తారు. అహంకారంతో తపస్సుచేస్తారు. దుఃఖంతో తపస్సుచేస్తారు. క్రోధం చేత కూడా తపస్సుచేస్తారు.
17. ఏ కారణచేత తపస్సుచేసినా తమ తేజస్సును ఇనుమడింపచేసుకోవటానికే చేస్తారు. ఇవన్నీచేసాక విద్య సంపాదిస్తారు. వేద వేదాంగములు చదువుకుంటారు. క్రతువులన్నీ చేస్తారు. అంతా బాగానే ఉంది. శౌచముంటుంది. అన్నీ ఉంటాయి. ముక్తికాంక్ష ఉందా, లేదా? అనేది ప్రశ్న.
18. అందుకు బదులుగా సనత్కుమారుడు ఇలా అన్నాడు: “ముక్తియందు కోరిక కలిగినవాడు కామక్రోధాలు జయించాలి. అపరిగ్రహం, సర్వారంభ పరిత్యాగం, అహింస, ఇంద్రియజయం – వీటిని ముక్తినికోరుకుంటూ ఆశ్రయించినప్పుడు ముక్తి కరతలామలక మవుతుంది. సంకల్పవర్జనంచేత ధర్మం, అహింసవలన అధర్మం రెండూనశిస్తాయి.
19. అంటే మోక్షం పొందటానికి ధర్మాధర్మాలు రెండూ ఉండరాదు. అతడు ముందు సర్వారంభ పరిత్యాగి, సంకల్పరహితుడు కావాలి. ధర్మము అనేది సుఖప్రదమైనది, క్షేమకరమైనది. కాని మోక్షసాధనలో భౌతిక, లౌకికక్షేమంకూడా అతడిని విసర్జిస్తుంది. సత్యాసత్యాలు రెండింటిని విడువవలసి ఉంటుంది. సర్వదేహసంపత్తి, సత్యాసత్యములు ప్రారంభదశలోనే ఉంటాయి. అంతకుముందు పదివేల శోకభయహేతువులు కనబడినప్పటికీకూడా చలించకుండా ఉండాలి.
20. కనుక ప్రపంచంలో తనచుట్టూ ఎన్ని సంఘటనలు జరుగుతున్నా నిస్పృహతో అతడుండి, ముక్తిహేతువును అన్వేషించాలి. అట్లాంటివాళ్ళు ముక్తిని పొందుతారు” అని చెప్పాడు నారదుడు, సనత్కుమారుడి మాటలుగా.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
22 Jan 2021
No comments:
Post a Comment