మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 113


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 113 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. జ్ఞానులు- దైత్యులు - 1 🌻

ఆది నుండియు మానవులలో రెండు తరగతుల వారున్నారు. ప్రకృతి శక్తులను చూచి మోజుపడి వానిని తమ అభిప్రాయముల ప్రకారము వినియోగించుకొనుటకు యత్నించు వారొక జాతి. ఈ ప్రకృతి యందును, తమ యందును గల అంతర్యామి చైతన్యమును నమ్మి దానికి ప్రాధాన్యమిచ్చువారు మరొక జాతి.

అందు మొదటి జాతి వారి దృష్టిలో ప్రకృతిని వశపరచుకొని వినియోగించుకొను స్వార్థ దృష్టి తప్పదు. వారిలో నాస్తికులు, ఆస్తికులు అను రెండు తెగలవారున్నారు. నాస్తికులకు ప్రకృతి శక్తులను వినియోగించుకొను దృష్టియే గాని, వినియోగ పద్ధతిలొ బాధ లేకుండునట్లు తీర్చిదిద్దుకొను నేర్పరితనము ఉండదు. దానితో సాంఘిక దురాచారములను ఎత్తి చూపుటతోనే ఆయుర్దాయము వ్యయమై పోవును.

ఇక మిగిలిన వారు ఆస్తికులు. ఏ దైవము పేరు పెట్టినను వారు తమ వినియోగమునకై దేవుని పేరిట ప్రకృతి శక్తులను కొలుచుచుందురు. ఏ ఇద్దరి దృష్టిలోను వినియోగము ఒక విధముగా ఉండదు‌.

కనుక ఈ తెగకు చెందిన అస్తికులు మతములను, సంప్రదాయములను, ఆరాధన విధానములను ఎవనికి వాడుగా ఏర్పరచుకొని, తాను మిగిలిన వారి కన్నా ఏ విధముగా జ్ఞానవంతుడో, తన ఆదర్శములు మిగిలిన వారి ఆదర్శముల కన్న ఏ విధముగా శ్రేష్ఠములో గుర్తుంచుకొనుటతోనే సరిపోవును. తత్ఫలితములుగా వర్గములు, పట్టుదలలు, కలహములు తప్పవు. ఈ లక్షణములు కలవారిని ప్రాచీనులు దైత్యులని వ్యవహరింతురు.....


✍️ మాస్టర్ ఇ.కె.🌻


03 Dec 2021

No comments:

Post a Comment