కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 153


🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 153 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మను తెలుసుకొను విధము - 83 🌻


కారణం ఏమిటి? అంటే ఈ విశ్వుడు అన్న సాక్షిత్వాన్ని జీవుడు సరిగ్గా సాధించలేదు కాబట్టి. కాబట్టి, ఈ ఎనిమిది శరీర అధిష్టాన స్థానములని ఏవైతే చెబుతున్నారో, ఆ అధిష్టాన స్థానములన్నీ కూడా సాక్షిత్వ సాధనలో పరిచయమయ్యేటటువంటి స్థితులు.

కాబట్టి, విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, ప్రత్యగాత్మ, విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత, పరమాత్మలు అనేటటటువంటి ఎనిమిది సాక్షి స్వరూపాలు, పరమాత్మ అనేటటువంటి, సర్వసాక్షి స్వరూపములో అంశీభూతములు. అలా సాక్షి సాధన చేసేటటువంటి వారు మాత్రమే, ఈ ఎనిమిది అధిష్ఠాన కేంద్రాలను, ఎనిమిది అధిష్టాన స్థితులను తెలుసుకోగలుగుతారు.

అలా ఎనిమిది అధిష్టాన స్థితులను తెలుసుకోలేని వాళ్ళు, ఆ యా వ్యవహారమునే సత్యమనుకుంటారు. ఆయా శరీర వ్యాపారమునే సత్యమనుకుంటారు. ఉదాహరణ చెపుతా... ప్రతి ఒక్కరూ కలలు కంటూ ఉంటారు. కలలు కన్నప్పుడల్లా ఆయా కలలో అనేక రకములైనటువంటి సినిమాలు వస్తుంటాయి.

అవన్నీ తమ జీవితములో ఉన్నటువంటి, తానే నేర్పించినటువంటి, తానే నటించినటువంటి, తానే నర్తించినటువంటి, తానే పాటలు పాడినటువంటి, తానే ఫైటింగులు చేసినటువంటి... సినిమాలన్నమాట. అన్నీ ఆయనే ... కథ, రచయిత, మాటలు, పాటలు, దర్శకత్వం, ప్రొడక్షన్‌ అన్నీ ఆయనే.

మరి అతువంటి కల అనే సినిమాను ప్రతి రోజూ మానవుడు దర్శిస్తూనే వున్నాడు కాని ఏ తెరమీదైతే, ఈ కల అనే సినిమా జరుగుతుందో, ఆ తెర ప్రకాశించడానికి ఆధారభూతమైనటువంటి, ఆ ప్రకాశంలో మాత్రమే ఈ సినిమా కనబడుతోంది కదా. మరి ప్రకాశం ఆధారంగా కనబడుతున్న సినిమాని నేనా? ప్రకాశం నేనా? అనేటటుంవంటి విచారణ దృక్పథం... కలగడం లేదు.

ఏ రోజు సినిమా ఆ రోజు వస్తూనే ఉంటుంది. ఆ రోజు కలని ‘అనుభోక్తవ్యం’ అనుభవిస్తూనే ఉంటాడు. అందులో ఏర్పడుతున్నటువంటి సుఖదుఃఖాలని అనుభవిస్తూనే ఉంటాడు. అట్టి అనుభవరీత్యా మరలా కలలో కూడా అవే సుఖదుఃఖాలు ఏర్పడుతూనే ఉన్నాయి.

మరి ఇలలోనూ సుఖదుఃఖాలు ఏర్పడుతూ ఉన్నాయి. లేదంటే మిశ్రితంగా ఏర్పడుతూ ఉన్నాయి. అలాగే కలలో కూడా సుఖదుఃఖాలు మిశ్రితముగా ఏర్పడుతున్నాయి. కాబట్టి, కర్మఫలము త్రివిధములుగా ఉన్నది. అయితే సుఖము, లేకపోతే దుఃఖము, లేక పోతే మిశ్రితము.

మరి ఈ రకంగా ఏర్పడుతున్నటువంటి దానిలోనుంచి ఏట్లా బయట పడాలంటే, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అనేటటుంవంటి శ్లోకం పురుషోత్తమ ప్రాప్తి యోగం (భగవద్గీత) లో ఉంది. అధ్యాత్మ - ఆత్మ వస్తువును నిత్యమైన వస్తువుగా గుర్తించి విచారణ చేసేటటువంటి దృక్పథాన్ని మానవుడు అభ్యాసం చేయాలి. తత్త్వజ్ఞానార్థ దర్శనం - ఈ అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అనేది ఎక్కడికి దారితీయాలటా? తత్త్వ జ్ఞానార్థ దర్శనం.- విద్యా సాగర్ గారు

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


05 Jan 2021

No comments:

Post a Comment