🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అభంగ్ - 27 🍀
సర్వసుఖ గోడీ సాహీ శాశ్ నివడీ!
రికామా అర్థఘడీ రాహూ నకో!!
లటికా వ్యవహార్ సర్వహా సంసార్!
వాయా యేర్ ఝార్ హరీ వీణ్!!
నామ మంత్ర జప కోటీ జాఈల్ పాప్!
కృష్ణనామీ సంకల్ప్ ధరూని రాహే!!
నిజ వృత్తి కాథీ సర్వ మాయా తోడీ!
ఇంద్రియా సవడీ లపోనకో!!
తీర్థప్రతీ భావ ధరీ రే కరుణా!
శాంతీ దయా పాహుణా హరి కరీ!!
జ్ఞానదేవా ప్రమాణ్ నివృత్తిదేవీ జ్ఞాన్!
సమాధి సంజీవన్ హరి పార్!!
భావము :
సర్వ సుఖాలలో హరి నామము మధురమైనదని ఆరు శాస్త్రాలు ఎన్నిక చేసి చెప్పినవి. కావున అర నిమిషము కూడ వృధా గడప బోకుము. సంసారమంత క్షణ భంగురము. కావున హరి సంబంధము వీడినచో చావు పుట్టుకలు వ్యర్థమై పోతాయి.
కృష్ణ నామమందు మనసు పెట్టి సంకల్పము చేసి నామ మంత్రమును జపము చేయు వారి కోటి పాలు తొలగిపోతాయి. సర్వ మాయలను త్రుంచి వేసి నిజ వృత్తులను బయటకు తీసి ఇంద్రియాలబడి తిరుగక జాగురుకతో ఉండుము.
భావన పెట్టి తీర్థ వ్రతాలు చేయుట వలన శాంతి, దయ నీకు ప్రియ బాంధవులై హరి యొక్క కరుణ ప్రాప్తించగలదు. సద్గురువు నివృత్తినాధులు కృపతో ఇచ్చిన జ్ఞానము వలన నాకు సంజీవని సమాధి కలిగినదని జ్ఞానదేవులు ప్రమాణ పూర్వకంగా తెలిపినారు.
🌻. నామ సుధ -27 🌻
సర్వ సుఖాలలో అతి మధురము
సకల శాస్త్రాలు ఎన్నిన నామము
వృధాగడపకు అర నిమిషము
హరినామము గానము చేయుము
స్వప్నంలాంటిది వ్యవహారము
సంసారమంత అదే విధము
వ్యర్థమవును జనన మరణము
లేని యెడల హరి సంబంధము
నామ మంత్రము జపము చేయుము
కోట్ల కొలది పాపాలు మాయము
సంకల్పము చేసి కృష్ణనామము
దృఢతరమున పట్టు నిలుపుము
నిజవృత్తులను బయటకు తీయుము
మాయలన్నియు తుడిచి వేయుము
“ఇంద్రియాలబడి తిరుగబోకుము”
వివేకముతో అణిచి వేయుము
తీర్థ వ్రతము భావ బలము
కరుణా హృదయము కల్గి ఉండుము
శాంతి దయా ప్రేమ యుక్తము
ధృఢమై తీరును హరి సంబంధము
జ్ఞానదేవుని ప్రమాణము వినుము
నివృత్తినాథులు ఇచ్చిన జ్ఞానము
సమాధి సంజీవని హరి పాఠము
భక్త జనులకు తరుణోపాయము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
05 Jan 2021
No comments:
Post a Comment