రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
78. అధ్యాయము - 33
🌻. వీరభద్రుని యాత్ర - 2 🌻
గుణనిధియగు జ్వాలకేశుడు పన్నెండు, శోభాయుక్తుడగు సమదుడు ఏడు, దుద్రభుడు ఎనిమిది (19), కపాలీశుడు అయిదు, సందారకుడు ఆరు, కోటి కుండుడు ఒకటి (20), గణములలో శ్రేష్ఠుడగు విష్టంభుడు ఎనిమిది కోట్ల , వీరులైన గణములతో బయలుదేరిరి.
ఓ వత్సా! సంనాదుడు వేయి, పిప్పలుడు వేయి (21), ఆవేశనుడు ఎనిమిది, చంద్రతాపనుడు ఎనిమిది, మహావేశుడనే గణాధ్యక్షుడు వేయి కోట్ల గణులచే చుట్టువారబడి ముందునకు సాగిరి (22). ఓ మహర్షీ! కుండి పన్నెండు కోట్ల గణములతో, గణశ్రేష్ఠుడగు పర్వతకుడు పన్నెండు కోట్ల గణములతో దక్షుని యజ్ఞమును ధ్వంసము చేయుటకై బయల్వెడలిరి (23).
కాలుడు, కాలకుడు మరియు మహాకాలుడు వందకోట్ల గణములతో దక్షయజ్ఞమునకు వెళ్లిరి (24). అగ్నికృత్ వంద, అగ్ని ముఖుడు ఒకటి, ఆదిత్యమూర్ధుడు ఒకటి, ఘనావహుడు ఒకటి (25), సన్నాహుడు వంద, కుముదుడు ఒకటి, అమోఘుడు ఒకటి, కోకిలుడను గణాధ్యక్షుడు ఒకటి (26),
కాష్ఠాగూఢుడు అరవై నాలుగు కోట్ల గణములతో బలయుదేరిరి. ఓ కుమారా! సుకేసి, వృషభుడు, సుమంత్రకుడు అను గణాధ్యక్షులు కూడ తరలివెళ్లిరి (27). గణశ్రేష్ఠుడగు కాకపాదోదరుడు అరవై, మరియు గణపుంగవుడగు సంతానకుడు అరవై కోట్ల గణములతో ముందునకు నడచిరి (28).
మహ బలుడగు పుంగవుడు తొమ్మిది కోట్ల గణములతో నడచెను . ఓవత్సా! మధుపింగుడను గణాధ్యక్షుడు కూడ విచ్చేసెను (29). నీలుడు తొంభై, పూర్ణ భద్రుడు వంద కోట్ల గణములతో బలయుదేరిరి. చతుర్వక్త్రుడు అనే గణాధ్యక్షుడు కూడ వెళ్లెను (30). విరూపాక్షుడను గణనాథుడు అరవై నాల్గు కోట్ల గణములతో నడచెను. తాలకేతువు, షడాస్యుడు, పంచాస్యుడను గణాధిపుడు (31),
సంవర్తకుడు, కులీశుడు, స్వయంప్రభుడు, లోకాంతకుడు అను గణనాథుడు వెళ్లెను. ఓ మహర్షీ! వారిలో దైత్యాంతకుడు మిక్కిలి ప్రకాశించెను (32). శోభాయుక్తుడు, దేవదేవుడగు శివునకు ప్రియుడునగు భృంగీ, రిటి మరియు అశని, భాలకుడు, మరియు సహస్రకుడు అరువది నాల్గుకోట్ల గణములతో తరలివెళ్లిరి (33).
వీరభద్రుని, శివుని ఆజ్ఞను పొంది వీరుడగు వీరేశుడు వేయి న్నూట ఇరవై కోట్ల గణములతో కూడుకుని ముందుకు నడచెను (34).
వీరుడు వేయి కోట్ల భూతములతో, రోమముల నుండి పుట్టిన మూడు కోట్ల కుక్కలతో కూడి వేగముగా నడచెను (35). అపుడు భేరీలు, శంఖములు, కొమ్ము వాద్యములు, శివుని ముఖాకారము గల వాద్యములు మొదలగు వాటి నుండి గొప్పనాదము వెలువడెను (36).
ఆ మహోత్సవమునందు వివిద వాద్యములను వాయించుటచే ఉత్పన్నమైన శబ్దములు చెవులకు ఇంపుగనున్నవై సర్వత్రా వ్యాపించెను (37). ఓ మహర్షీ! సైన్యముతో గూడి వీరభద్రుడు పయనించుచుండగా, అచట మనస్సునకు ఆనందమునిచ్చే విభిన్న శకునములు కలిగినవి (38).
శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు రెండవది యగు సతీఖండలో వీరభద్రయాత్రా వర్ణనమనే ముప్పది మూడవ అధ్యాయము ముగిసినది (33).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
05 Jan 2021
No comments:
Post a Comment