శ్రీ శివ మహా పురాణము - 733 / Sri Siva Maha Purana - 733


🌹 . శ్రీ శివ మహా పురాణము - 733 / Sri Siva Maha Purana - 733 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 11 🌴

🌻. దేవస్తుతి - 1 🌻


వ్యాసుడిట్లు పలికెను-

హే బ్రహ్మపుత్రా! శివ భక్తాగ్ర గణ్యుడవగు నీవు మహాప్రాజ్ఞుడవు, ధన్యుడవు. త్రిపురమునందలి అందరు దహింపబడిన తరువాత దేవతలు ఏమి చేసిరి? (1) మముడు ఎచటకు వెళ్లెను? ఆ త్రిపురాధిపతులు ఎట్టి గతిని పొందినారు? శంభుని గాథ ఆశ్రయముగా గల ఆ వృత్తాంతమునంతనూ నాకు చెప్పుము (2).

సూతుడిట్లు పలికెను -

బ్రహ్మ పుత్రుడగు సనత్కుమార భగవానుడు వ్యాసుని ఈ మాటను విని , శివుని పాదయుగళమును స్మరించి ఇట్లు బదులిడెను (3).

సనత్కుమారుడిట్లు పలికెను -

ఓ వ్యాసా! మహాబుద్ధీ! పరాశరా పుత్రా! లోకలీలలను అనుసరించే మహేశ్వరుని చరితమును వినుము. ఈ చరితము సర్వపాపములను నిర్మూలించును (4). రాక్షసులతో నిండియున్న త్రిపురములు సంపూర్ణముగా మహేశ్వరునిచే దహింపబడగా, అచట ఆ దేవతలు పరమాశ్చర్య భరితులైరి (5). ఇంద్రుడు, విష్ణువు మొదలగు దేవతలందరు అపుడు మహాతేజశ్శాలియగు రుద్రుని గాంచి తొట్రుపాటును చెందినవారై ఏమియూ పలుకకుండగా మిన్నకుండిరి (6). మహాభయంకరమగు ఉగ్రరూపము గలవాడు. పది దిక్కులను తన తేజస్సుచే మండునట్లు చేయువాడు, కోటి సూర్యుల తేజస్సు గలవాడు, ప్రళయ కాలాగ్నిని బోలియున్నవాడు (7). అగు శివుని, మరియు హిమవత్పుత్రియగు ఉమాదేవిని గాంచిన దేవోత్తములు అందరు భయపడి తలలు వంచి నిలబడి యుండిరి (8). ఇట్లు భయపడియున్న దేవసై#్యన్యమును గాంచిన మహర్షులు నిశ్శబ్బముగా అన్ని దిక్కులయందు నమస్కరించి మిన్నకుండిరి (9). అపుడు సంతుష్టి చెందిన హృదయము గల బ్రహ్మ శంకరుని ఆ రూపమును గాంచి మిక్కిలి భీతిల్లి దేవతలతో కూడిన వాడై సమాహిత చిత్తముతో స్తుతించెను (10). బ్రహ్మ భయపడివున్న విష్ణువుతో గూడి, దేవదేవుడు, పాపహారి, త్రిపురాంతకుడు, పార్వతీపతి, భక్తులకు వశమగు వాడు అగు మహేశ్వరుని స్తుతించెను (11).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 733🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 11 🌴

🌻 The Gods’ prayer - 1 🌻


Vyāsa said:—

1. O son of Brahmā, of great intellect, O most excellent among the devotees of Śiva, you are blessed. When the three cities were burnt what did the gods do?

2. Where did Maya who was spared go? Where did the ascetics go? Please narrate all, if it relates to Śiva’s story.

Sūta said:—

3. On hearing the words of Vyāsa, Sanatkumāra the holy son of the creator remembered the feet of Śiva and spoke.

Sanatkumāra said:—

4. Listen O Vyāsa, son of Parāśara, and of great intellect, to the sin-destroying story of the great lord, who follows worldly conventions.

5. When the three cities of Asuras were utterly burnt, the Gods became surprised.

6. The gods including Indra, Viṣṇu and others became silent and bewildered on seeing the excessively brilliant Siva.

7-8. On merely seeing the terrible form of Śiva, dazzling the ten quarters, resembling countless suns in refulgence and on a par with the fire at the hour of dissolution, and also the goddess Pārvatī, the daughter of Himavat, the illustrious gods stood humbly in their fright.

9. On seeing the army of the gods terrified, the excellent sages did not say anything. They stood all round and bowed.

10-11. Then Brahmā too who was excessively afraid on seeing Śiva’s terrible form, was delighted at heart and fervently prayed along with the gods. Viṣṇu who was also afraid prayed to Śiva the lord of the Gods, the slayer of the Tripuras, who was accompanied by his consort Pārvatī, the lord who is subservient to his devotees.


Continues....

🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment