1) 🌹 20, MAY 2023 SATURDAY శనివారం, స్థిర వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 373 / Bhagavad-Gita - 373 🌹 🌴10వ అధ్యాయము - విభూతి యోగం - 01 / Chapter 10 - Vibhuti Yoga - 01 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 220 / Agni Maha Purana - 220 🌹
🌻. కూపవాపీతటాకాది ప్రతిష్ఠా కథనము. - 4 / Mode of consecration of tanks and ponds (kūpa-pratiṣṭhā) - 4 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 085 / DAILY WISDOM - 085 🌹
🌻 25. విశ్వ చైతన్యం ఆలోచించబడింది / 25. The Cosmic Consciousness Contemplated 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 349 🌹
6) 🌹. శివ సూత్రములు - 87 / Siva Sutras - 87 🌹
🌻 2-04. గర్భే చిత్త వికాసో' విశిష్ట విద్యా స్వప్నః - 3 / 2-04. garbhe cittavikāso'viśistavidyāsvapnah - 3 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 20, మే, May 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : చంద్ర దర్శనము, Chandra Darshan🌻*
*🍀. శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం - 20 🍀*
*37. మ్రియంతే శత్రవోఽవశ్యమ లక్ష్మీనాశ మాప్నుయాత్ |*
*అక్షయం లభతే సౌఖ్యం సర్వదా మానవోత్తమః*
*38. అష్టపంచాశతాణఢ్యో మంత్రరాజః ప్రకీర్తితః |*
*దారిద్ర్యదుఃఖ శమనం స్వర్ణాకర్షణకారకః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : మనస్సు నందలి ఏకత్వానుభూతి - మనస్సు నందు ఏకత్వానుభూతి మనస్సున కొక విధమైన విమోచన కల్పించే మాట వాస్తవమే. కాని, అంతమాత్రాన అన్న, ప్రాణకోశముల యందు మార్పురాదు. అందలి ప్రవృత్తులు యథాపూర్వంగానే సాగిపోతూ వుండవచ్చును. ఏలనంటే, వాటి నడక కొంతవరకు మాత్రమే మనస్సుపై ఆధారపడి వుంటుంది. అంతేకాదు, మనస్సుకు యిష్టం లేక పోయినా దానినవి తమతోపాటు లాగుకొని పోగలవు. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
జ్యేష్ఠ మాసం
తిథి: శుక్ల పాడ్యమి 21:32:41
వరకు తదుపరి శుక్ల విదియ
నక్షత్రం: కృత్తిక 08:03:49 వరకు
తదుపరి రోహిణి
యోగం: అతిగంధ్ 17:17:47 వరకు
తదుపరి సుకర్మ
కరణం: కింస్తుఘ్న 09:25:29 వరకు
వర్జ్యం: 24:44:20 - 26:24:28
దుర్ముహూర్తం: 07:26:44 - 08:18:43
రాహు కాలం: 08:57:43 - 10:35:11
గుళిక కాలం: 05:42:47 - 07:20:15
యమ గండం: 13:50:07 - 15:27:34
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:37
అమృత కాలం: 05:35:42 - 07:13:54
మరియు 29:44:44 - 31:24:52
సూర్యోదయం: 05:42:47
సూర్యాస్తమయం: 18:42:30
చంద్రోదయం: 05:57:52
చంద్రాస్తమయం: 19:30:10
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: వృషభం
యోగాలు: ధ్వజ యోగం - కార్యసిధ్ధి
08:03:49 వరకు తదుపరి శ్రీవత్సయోగం
- ధన లాభం , సర్వ సౌఖ్యం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 373 / Bhagavad-Gita - 373 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 01 🌴
*01. శ్రీ భగవానువాచ*
*భూయ ఏవ మహాబాహో శ్రుణు మే పరమం వచ: |*
*యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యాయా ||*
🌷. తాత్పర్యం :
*శ్రీకృష్ణభగవానుడు పలికెను: మహాబాహువులుగల ఓ అర్జునా! మరల ఆలకింపుము. నీవు నాకు ప్రియమిత్రుడవగుటచే ఇంతవరకు వివరించిన జ్ఞానము కన్నను ఉత్తమమైన జ్ఞానమును నీ హితము కొరకై నేను వచించెదను.*
🌷. భాష్యము :
*“భగవానుడు” అను పదమునకు శక్తి, యశస్సు, ఐశ్వర్యము, జ్ఞానము, సౌందర్యము, వైరాగ్యము అనెడి ఆరు విభూతులను సమగ్రమముగా కలిగియున్నవాడని భావమైనట్లుగా పరాశరముని వివరించియున్నారు. ధరత్రిపై అవతరించినపుడు శ్రీకృష్ణుడు అట్టి ఆరువిభూతులను సమగ్రమముగా ప్రదర్శించియున్నందున పరాశరుడు వంటి మహా మునులు అతనిని దేవదేవునిగా ఆంగీకరించియున్నారు. ఇప్పుడు ఆ భగవానుడే స్వయముగా తన విభూతులు మరియు తన కర్మలను గూర్చిన రహస్యజ్ఞానమును అర్జునునకు ఉపదేశించనున్నాడు. సప్తమాధ్యాయపు ఆరంభము నుండియే తన వివిధశక్తులు గుర్చియు మరియు అవి వర్తించు విధమును గూర్చియు తెలియజేసిన భగవానుడు ఈ అధ్యాయమున తన ప్రత్యేక విభూతులను అర్జునునకు వివరింపనున్నాడు. నిశ్చయముతో కూడిన భక్తిని స్థాపించుట కొరకై తన వివిధశక్తులను విపులముగా గడచిన అధ్యాయమున వర్ణించిన శ్రీకృష్ణభగవానుడు తిరిగి ఈ అధ్యాయమున తన వివిధభూతులను మరియు సృష్టివిస్తారములను అర్జునునకు తెలియజేయుచున్నాడు.*
*శ్రీకృష్ణభగవానుని గూర్చి అధికముగా శ్రవణము చేసిన కొలది భక్తి యందు మనుజుడు అధికముగా స్థిరత్వమును పొందును. ప్రతియొక్కరు ఆ దేవదేవుని గూర్చి భక్తుల సాంగత్యమున శ్రవణము చేయవలెను. అది వారి భక్తిని వృద్ధి చేయగలదు. వాస్తవమునకు కృష్ణపరచర్చలు మరియు ప్రసంగములనునవి కృష్ణభక్తిభావన యందు నిజముగా లగ్నమైనవారి నడుమనే జరుగును. ఇతరులు అట్టివాటి యందు పాల్గొనజాలరు. అర్జునుడు తనకు అత్యంత ప్రియుడైనందునే అతని హితము కొరకు అటువంటి ఉపదేశము చేయబడుచున్నది శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట స్పష్టముగా తెలియజేయుచున్నాడు.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 373 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 10 - Vibhuti Yoga - 01 🌴*
*01. śrī-bhagavān uvāca*
*bhūya eva mahā-bāho śṛṇu me paramaṁ vacaḥ*
*yat te ’haṁ prīyamāṇāya vakṣyāmi hita-kāmyayā*
🌷 Translation :
*The Supreme Personality of Godhead said: Listen again, O mighty-armed Arjuna. Because you are My dear friend, for your benefit I shall speak to you further, giving knowledge that is better than what I have already explained.*
🌹 Purport :
*The word bhagavān is explained thus by Parāśara Muni: one who is full in six opulences, who has full strength, full fame, wealth, knowledge, beauty and renunciation, is Bhagavān, or the Supreme Personality of Godhead. While Kṛṣṇa was present on this earth, He displayed all six opulences. Therefore great sages like Parāśara Muni have all accepted Kṛṣṇa as the Supreme Personality of Godhead. Now Kṛṣṇa is instructing Arjuna in more confidential knowledge of His opulences and His work. Previously, beginning with the Seventh Chapter, the Lord has already explained His different energies and how they are acting. Now in this chapter He explains His specific opulences to Arjuna.*
*In the previous chapter He has clearly explained His different energies to establish devotion in firm conviction. Again in this chapter He tells Arjuna about His manifestations and various opulences. The more one hears about the Supreme God, the more one becomes fixed in devotional service. One should always hear about the Lord in the association of devotees; that will enhance one’s devotional service. Discourses in the society of devotees can take place only among those who are really anxious to be in Kṛṣṇa consciousness. Others cannot take part in such discourses. The Lord clearly tells Arjuna that because Arjuna is very dear to Him, for his benefit such discourses are taking place.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 220 / Agni Maha Purana - 220 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 64*
*🌻. కూపవాపీతటాకాది ప్రతిష్ఠా కథనము. - 4 🌻*
*పిమ్మట వరుణదేవుని లేవదీసి మంగళ ద్రవ్యములతో గజ పృష్ఠాదులపై ఎక్కించి ఊరేగించవలెను. పిమ్మట ఆ వరుణమూర్తిని "ఆపో హి ష్ఠామ యో భువః" ఇత్యాది మంత్రము పఠించుచు మదురత్రయయుక్త మగు కలశములో ఉంచి కలశసహితు డగు వరుణుని జలాశయ మధ్య భాగమునందు సురక్షితరూపము స్థాపింపవలెను.*
*పిమ్మట యజమానుడు స్నానము చేసి వరుణుని ధ్యానించవలెను. అనంతరము బ్రహ్మాండసంజ్ఞక మగు సృష్టిని అగ్నిబీజముచే (రం) దహించి, దాని భస్మరాశిని ఉదకముచే ముంచెత్తి నట్లు భావన చేయవలెను. జగ మంతయు జలమయమైనది" అని భావన చేసి ఆ జలమునందు జలేశ్వరు డైన వరుణుని ధ్యానించవలెను. ఈ విధమున జల మధ్యభాగమున వరుణదేవతా ధ్యానము చేసి అచట యూపమును స్థాపించవలెను. యూపము చతుష్కోణముగ గాని, అష్ణకోణముగ గాని, గోలాకారము గాని ఉండుట మంచిది. పది హస్తముల పొడ వుండవలెను. దానిపై ఉపాస్యదేవతా చిహ్నము లుండవలెను. దానిని యజ్ఞమున కుపయోగించు చెట్టు కఱ్ఱతో నిర్మింపవలెను. కూపమునకు అట్టి యూపమే ఉపయోగించును. దాని మూలభాగమున బంగారు ఫలక ముంచవెలను. దిగుడు బావిలో పదునైదు హస్తముల యూపమును, పుష్కరిణిలో ఇరువది హస్తముల యూపమును, తటాకమున ఇరువదియైదు హస్తముల యూపముస్థాపించవలెను.*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 220 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 64*
*🌻Mode of consecration of tanks and ponds (kūpa-pratiṣṭhā) - 4 🌻*
32. The image should be placed in the midst of the tank unseen. (The priest) should bathe and contemplate on Varuṇa, the creation known as the primordial egg.
33. Having purified it with the principal letter (of the mantra) of the fire, the ashes should be scattered over the earth. The entire world consists of water. Hence, the lord of waters is contemplated.
34. The sacrificial post of a rectangular, octagonal or circular shape should be placed in the middle of the tank.
35. Having worshipped the symbol of the lord, post made of the tree used for the purpose of sacrifice (should be driven) ten cubits into the ground in the case of (consecration of) a well [i.e., kūpa, kūpaka]. At the bottom of the post gold and fruit should be placed.
36. It should be driven into the ground in the middle of water fifteen cubits in the case of a well, twenty (cubits) in the case of a tank (puṣkariṇī) and twenty-five cubits in the case of a pond.
37. In the alternative, (the post) should be driven in the centre of the sacrificial bed and with the mantra yūpavraskā[36] cloth should be put around. The banner should be put at the top of the post.
38. Having worshipped it with perfumes etc., (the rite for)universal peace should be performed. The spiritual preceptor should be given the fees (in the form of) land, cows, gold and water vessel.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 85 / DAILY WISDOM - 85 🌹*
*🍀 📖. బృహదారణ్యక ఉపనిషత్తు నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 25. విశ్వ చైతన్యం ఆలోచించబడింది 🌻*
*విశ్వమనస్సు తన స్వయాన్ని ఒక సృష్టి మీద కేంద్రీకరించడం వల్ల ఆ సృష్టి విశ్వంగా రూపుదిద్దుకుంది. ఆ విధంగా విశ్వం ప్రాణం పోసుకుంది. విశ్వంలోని ప్రతి వస్తువులో కార్యాచరణ, శక్తి, మరియు జీవశక్తి ఉన్నాయి. దీనికి కారణం విశ్వ మనస్సు దేశ కాలాలలో బాహ్యంగా ప్రకటితమైన స్థూల ప్రకృతిలో తనను తాను వ్యక్తపరచుకుంది కాబట్టి. ఉద్వేగంతో కూడిన ప్రతి రకమైన అవగాహనలో ఇది జరుగుతుంది. ఉద్వేగం అనేది ఒక వస్తువు పై కేంద్రీకరించి బడిన చైతన్యం. ఆ చైతన్యకేంద్రం దేని కారణంగా నైనా ప్రభావితం అయితే ఆ స్వయం ఆ వస్తువులోకి కదిలి ఆ వస్తువుకి ఒక నిర్దుష్ట విధానంలో జీవం పోస్తుంది.*
*అప్పుడు, ఆ ప్రాణ ప్రతిష్ట కారణంగా, అది తనలో ఒక భాగం అవుతుంది; ద్వితీయ స్వయం అవుతుంది. ఒక వస్తువు వైపు స్వయం యొక్క ఉద్వేగ పూరిత కదలిక ద్వారా ఆ వస్తువు విషయం యొక్క ద్వితీయ స్వయంగా మారినట్లు, ఆదిలో కూడా జరిగింది. శరీరం చైతన్యంగా మారిన విధంగానే విశ్వ చైతన్యం బాహ్య ప్రకృతి పట్ల దృష్టి సారించడం వల్ల ఆ బాహ్య ప్రకృతి జీవం సంతరించుకుని విశ్వ ప్రక్రితిగా మారింది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 85 🌹*
*🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 25. The Cosmic Consciousness Contemplated 🌻*
*It is, as it were, the Cosmic Mind contemplated its own Self in the object which is created, namely, the universe. So, the universe assumed a life. There is activity, energy, force and vitality in everything in the universe. That is because of the projection of the Cosmic Mind into this matter, which is the externalised form in space and in time. This happens in every form of perception involving emotion. An emotion is a form of concentration of consciousness on a particular object, and when that concentration is affected, the self moves to the object and enlivens the object in a particular manner.*
*Then, because of the enlivenment, it becomes a part of itself; the secondary self does it become. As the individual object becomes a secondary self of an individual subject by way of emotional movement of self towards the object, so did it happen originally, also. The Cosmic Consciousness contemplated on the cosmic externality, which we call Prakriti, and thus the universe assumed life, as if it is consciousness itself, just as the body assumes a form of consciousness.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 350 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. సత్యాన్ని చూడకుండా వుండడానికి నీ కళ్ళ ముందు చిన్న తెర చాలు. జీవితం గొప్ప ఉపాధ్యాయుడు. అది ప్రతి మనిషినీ చీకటి నించీ వెలుగులోకి దూకడానికి సిద్ధం చేస్తుంది. తెరిచిన కళ్ళకి దేవుడు అస్తిత్వ అనుభవంగా ఆవిష్కారమవుతాడు. 🍀*
*నువ్వు కళ్ళు మూసుకుని వున్నపుడు అంతా చీకటిగా వుంటుంది. నువ్వు కళ్ళు తెరుచుకుని వుంటే జీవితం రాగరంజితంగా వుంటుంది. కాంతి నిండి వుంటుంది. తెరిచిన కళ్ళకి దేవుడు అస్తిత్వ అనుభవంగా ఆవిష్కారమవుతాడు. దేవుణ్ణి వ్యతిరేకించే వాళ్ళు వాళ్ళు అంధుల మంటారు. వాళ్ళు గుడ్డి వాళ్లు మాత్రమే కాదు మొండివాళ్ళు. వాళ్ళు తాము అంధులం కామని ఐతే దేవుడు లేడని అంటారు. మనిషి కళ్ళు మూసుకుని వుంటే ఎదురుగా ఆకాశంలో సూర్యుడున్నా కాంతి వున్నా చీకట్లోనే వుంటాడు. సత్యాన్ని చూడకుండా వుండడానికి నీ కళ్ళ ముందు చిన్న తెర చాలు. జీవితం గొప్ప ఉపాధ్యాయుడు. అది ప్రతి మనిషినీ చీకటి నించీ వెలుగులోకి దూకడానికి సిద్ధం చేస్తుంది.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 087 / Siva Sutras - 087 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻 2-04. గర్భే చిత్త వికాసో' విశిష్ట విద్యా స్వప్నః - 3 🌻*
*🌴. మాయతో నిండిన మలినమైన శరీరంలో చిత్తం వికసించినప్పుడు, పరిమిత శక్తులతో కూడిన స్వప్నం లాంటి అస్పష్టమైన జ్ఞానం పుడుతుంది. 🌴*
*దైవాన్ని గ్రహించే అలాంటి ప్రయత్నం స్వప్న స్థితి లాంటిదని ఈ సూత్రం చెబుతుంది. ఒకరి స్పృహ క్రింది స్థాయికి వెళ్ళిన తర్వాత కలను మరచిపోతారు. అదే మేల్కొలుపు దశ. స్వప్న స్థితి తాత్కాలికమైనది. స్వప్న స్థితి నుండి ఏమీ సాధించబడదు. కలలు అంటే మనసులోని ముద్రలు లేదా కల్పనలు. అవి నెరవేరని కోరికలు తప్ప మరేమీ కాదు. కలలకు వాస్తవం లేనట్లే, అజ్ఞాన మనస్సుకు కూడా వాస్తవం ఉండదు. అలాంటి మనసులు అధమమైనవి అని అంటారు. అధమ మనస్సు కలిగినవారు శాశ్వతమైన విముక్తిని వాయిదా వేయడం ద్వారా తమ సమయాన్ని వృధా చేసుకుంటారు. ఋషి పతంజలి ఇలా అంటాడు (3-36) “అన్ని ఆనందాలు లేదా అనుభవాలు విడిగా ఉన్న మనస్సు మరియు ఆత్మ లేదా స్వయం యొక్క తప్పుడు గుర్తింపు కారణంగా ఉన్నాయి. మనస్సు స్వయం కోసమే కానీ స్వతంత్రం కాదు. ఆత్మతో ఏకత్వం జ్ఞానాన్ని ఇస్తుంది.'*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 087 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻 2-04. garbhe cittavikāso'viśistavidyāsvapnah - 3 🌻*
*🌴. From the flowering of the chitta in an impure body which is filled with maya, there arises dreamlike indistinct knowledge with limited powers. 🌴*
*This aphorism says that such attempt to perceive Him is like the state of dream. The dream is forgotten once one’s consciousness moves to lower level viz. awakening stage. The dream state is only temporary and nothing is achieved out of dream state. Dreams are nothing but the unfoldment of impressions in the mind or due unfulfilled desires called fantasies. Just like dreams lack reality, an ignorant mind also lacks in reality. Such minds are said to be inferior. Men with inferior mind simply waste their time by postponing eternal liberation. Sage Patañjali says (3-36) “All enjoyment or experience is due false identification of the mind and the soul or Self, which are completely unmixed. Mind is for the sake of Self and not independent. Oneness with the Self gives knowledge.”*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
No comments:
Post a Comment