✍️. మల్లికార్జున శర్మ
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయము 1
🌻. మధు కైటభుల వధ వర్ణనము - 3 🌻
రాజు పలికెను : భగవాన్! మిమ్మల్ని నొకటి అడగాలని అనుకుంటున్నాను. దయచేసి దానికి బదులివ్వండి. (39–40)
నా మనస్సు నా చిత్రానికి అధీనంకాక దుఃఖవశమై ఉంది. నేను రాజ్యాన్ని కోల్పోయి, అజుని వలె - నాకది తెలిసుండి - రాజ్యాంగాల అన్నింటిపై నాకు మమత్వం నిలిచి ఉంది, మునిసత్తమా! ఇది ఎలా? ఇతడు కూడా భార్యాపుత్ర భృత్యజనంచేత, స్వజనంచేత తిరస్కృతుడై విడనాడబడి, వారిపై అత్యంత ప్రేమ కలిగి ఉన్నాడు.
ఇలా ఇతడూ, నేనూ, విషయంలో దోషాలను చూస్తూనే, మమత్వం చేత వాటివైపుకు ఆకర్షించబడి అత్యంత దుఃఖితులమై ఉన్నాము. ఓ నిర్మలచిత్తుడా ! తెలిసినవారమైన నాకు, ఇతనికి ఈ మోహం కలిగిందే! మా వివేకాన్ని పోగొట్టి మూఢులను చేసిందే! ఇది ఎలా? (39–45)
ఋషి పలికెను : ఇంద్రియగోచరమైన విషయజ్ఞానం సమస్త జంతువులకు ఉంది. ఇంద్రియ విషయాలు వేర్వేరు విధాలుగా వాటికి తెలియవచ్చు. కొన్ని ప్రాణులు పగటిపూట చూడలేవు, మరి కొన్ని ప్రాణులు రాత్రిపూట చూడలేవు. మరి కొన్ని రేయుంబగళ్లు సమంగా చూడగలపు.
మనుషులు జ్ఞాసం కలిగి ఉండడం నిజమేగాని అది కేవలం వారికి మాత్రమే ఉండేది కాదు. పశుపక్షి మృగాదులకు కూడా (ఇంద్రియవిషయ) జ్ఞానం ఉంది. మనుష్యులకు గల జ్ఞానం మృగపక్షులకు కూడా ఉంది, వానికి గల జ్ఞానం మనుష్యులకు కూడా ఉంది.
తక్కినది (నిద్రాభోజనాదికము) రెండుజాతులకూ సమమై ఉన్నది. ఆ పక్షులవంక చూడు. వాటికి జ్ఞానం ఉండి కూడా, తాము ఆకలిచే పీడింపబడుతూ, మోహవశులై, తమ పిల్లల ముక్కులలో (నోళ్లలో) ధాన్యకణాలను (గింజలను) వేస్తున్నాయి. (46–51)
ఓ మనుజవ్యాఘ్ర (శ్రేష్ఠ)! ప్రత్యుపకారం కలుగగలదనే ఆశతో మానవులు తమ బిడ్డలయెడ అభిలాష కలిగివుంటారు. నీకు ఇది కనిపించడం లేదా? అయినప్పటికీ సంసార స్థితికారిణి అయిన మహామాయ యొక్క ప్రభావంచేత వారు (మానవులు) మమత అనే సుడిగుండంలోకి, మోహం అనే గుంటలోకి కూలద్రోయబడుతున్నారు.
దీనికి ఆశ్చర్యపోవద్దు, ఈ మహామాయ జగత్పతియైన విష్ణుదేవుని యోగనిద్ర . ఆమె చేతనే జగత్తు సమ్మోహితమవుతున్నది. ఆ దేవి, ఆ భగవతి, ఆ మహామాయ జ్ఞానుల మనస్సులను కూడా ప్రబలంగా ఆకర్షించి మోహగ్రస్తులుగా చేస్తుంది సుమా! (52-55)
ఈ చరాచరరూప జగత్తునంతా ఆమెయే సృజిస్తోంది. ఆమె అనుగ్రహిస్తే నరులకు ముక్తినొసగే వరదాయిని. ఆమె పరావిద్య, ముక్తి హేతువు, సనాతనీ, సంసారబంధానికి కూడా ఆమెయే హేతువు. ఈశ్వరులనందరినీ పరిపాలించు పరమేశ్వరి ఆమెయే. (56–58)
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 3 🌹
✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj
Chapter 1
🌻 Description of Killing of Madhu and Kaidabha - 3 🌻
39-45. 'Sir, I wish to ask you one thing. Be pleased to reply to it. Without the control of my intellect, my mind is afflicted with sorrow. Though I have lost the kingdom, like an ignorant man- though I know it- I have an attachment to all the paraphernalia of my kingdom.
How is this, O best of sages? And this merchant has been disowned by this children, wife and servants, and forsaken by his own people; still he is inordinately affectionate towards them.
Thus both he and I, drawn by attachment towards objects whose defects we do know, are exceedingly unhappy. How this happens, then, sir, that though we are aware of it, this delusion comes? This delusion besets me as well as him, blinded as we are in respect of discrimination.' The Rishi said:
46-49. Sir, every being has the knowledge of objects perceivable by the senses. And object of sense reaches it in various ways. Some beings are blind by day, and others are blind by night; some beings have equal sight both by day and night.
Human beings are certainly endowed with knowledge, but they are not the only beings ( to be so endowed), for cattle, birds, animals and other creatures also cognize (objects of senses).
50-58. The knowledge that men have, birds and beasts too have; and what they have men also possess; and the rest (like eating and sleeping) is common to both of them.
Look at these birds, which though they possess knowledge, and are themselves distressed by hunger are yet, because of the delusion, engaged in dropping grains into the beaks of their young ones. Human beings are, O tiger among men, attached to their children because of greed for return help.
Do you not see this? Even so men are hurled into the whirlpool of attachment, the pit of delusion, through the power of Mahamaya ( the Great Illusion), who makes the existence of the world possible. Marvel not at this. this Mahamaya is the Yoganidra, of Vishnu, the Lord of the world. It is by her the world is deluded. Verily she, the Bhagavati, the Mahamaya forcibly drawing the minds of even the wise, throws them into delusion.
She creates this entire universe, both moving and unmoving. It is she who, when propitious, becomes a boon-giver to human beings for their final liberation. She is the supreme knowledge, the cause of final liberation, and eternal; she is the cause of the bondage of transmigration and the sovereign over all lords. The king said:
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #దేవీమహత్యము #DeviMahatyam
11 Oct 2020
No comments:
Post a Comment