కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 157


🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 157 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మను తెలుసుకొను విధము - 87 🌻


పుట్టినప్పుడు ఏ ఒక్కడు కూడా వస్త్రం కప్పుకుని రాలేదు. మొట్టమొదటిది వస్త్రం కప్పడంతోనే మొదలౌతుంది. వస్తూపలబ్ది. జన్మించడానికి ఆధారమైనటువంటి, ఆశ్రయించినటువంటి... బొడ్డుతాడు కోయడానికి బ్లేడు కావాలి. వస్తూపలబ్ది దానితోనే ముడిపడి ఉంది.

మరి అలా ఇవన్నీ నీకు అవసరాలే అయివున్నప్పటికి, ఇవేవీ నీవు కాదు. నీ యొక్క వాస్తవికమైనటువంటి ఉనికి, నీదదికాదు. నీవు అఖండమైనటువంటి ఆత్మస్వరూపుడవు.

నీవు ప్రత్యగాత్మ, విశ్వ తైజస ప్రాజ్ఞ రూపముగా ఉన్నట్లుగా తోచుచున్నప్పటికి లేదా సమిష్టిగా ఉన్నటువంటి స్థూల సూక్ష్మ కారణ దేహములైనటువంటి విరాట్‌, హిరణ్య గర్భ, అవ్యాకృత, పరమాత్మలు అనేటటువంటి దేహములు కానీ, సాక్షులు కానీ, ఇవేవియూ నీవు కాదు.

వీటి అన్నిటికి అతీతమైనటువంటి, అఖండముగా ఉన్నటువంటి పరమాత్మవు, పరబ్రహ్మవు. ఆ పరబ్రహ్మము కూడా బట్టబయలందు లేనిది అనేటటువంటి చిట్టచివరి నిర్ణయమును పొందటానికి, జన్మరాహిత్యమును పొందడానికి, అమృతత్వాన్ని పొందడానికి మాత్రమే నేను ఈ మానవోపాధిలోనికి వచ్చాను అనేటటువంటి, స్పష్టమైనటువంటి లక్ష్యాన్ని, లక్షణాన్ని, ఆశ్రయించి, మనం ప్రయాణం చేయాలి.

అందుకని ఏమన్నాడు? జహర్లక్షణం, అజహర్లక్షణం, జహదజహర్లక్షణం అనే లక్షణత్రయాన్ని, సాధకులకు నిర్దేశించారు. ఎవరైతే ‘సూణోధావతి’ అనేది సూత్రం అన్నమాట జహర్లక్షణానికి. అంటే ఏమిటి? అంటే ఎర్రరంగు ప్రవహిస్తుంది అన్నామండి. ఎర్రరంగు ప్రవహించడం ఏమిటి అయ్యా అంటే?

ఎర్రరంగు జెండాలు పట్టుకున్నటువంటి వారందరూ కూడా నదిలో ప్రయాణము చేస్తూఉంటే, నదంతా ఎర్రగా కనబడి, ఎర్రరంగు ప్రవహిస్తోందిగాతోచింది. తోచినటువంటి ఎర్ర రంగు ప్రధానమా? అది ప్రవాహం ప్రధానమా? అలా ప్రవహించే అవకాశం ఉందా?

ప్రత్యక్ష పరోక్ష అనుమాన విహిత అవిహిత... ఇలా ప్రమాణ సహితాలన్నింటినీ విచారణ చేయగా, షట్ప్రమాణ సహితమైనటువంటి విచారణ చేయగా, యథార్థం బోధ పడింది. కాబట్టి యథార్థం ఏమిటి? అనంటే, నది ప్రవహిస్తోంది, నదిలో కొంతమంది ప్రయాణీకులు ప్రయాణిస్తున్నారు.

వారు ఎర్రరంగు జండాలు పట్టుకున్నారు. దూరం నుంచీ చూడగా, ఒక భ్రాంతి కలిగింది. ఎర్రని నది ప్రవహిస్తోంది. నది ఎర్రగా ఉండడం ఏమిటి? అనే ప్రశ్న వేసుకుంటే తప్ప, ప్రయోజనము లేదు.

ఈ రకంగా జహర్లక్షణం, అజహర్లక్షణం, జహదజహర్లక్షణం... ఈ రకంగా లక్షణత్రయాన్ని చక్కగా గురుసమక్షంలో విచారణ చేయాలి. అంటే అర్థం ఏమిటి? ఏది ప్రధానం? ఏది అప్రధానం? ఏది మనం పట్టుకోవాలి? ఏది మనం త్యజించాలి?

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


09 Jan 2020

No comments:

Post a Comment