శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 174 / Sri Lalitha Chaitanya Vijnanam - 174
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 174 / Sri Lalitha Chaitanya Vijnanam - 174 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
48. నిష్క్రోధా, క్రోధశమనీ, నిర్లోభా, లోభనాశినీ |
నిఃసంశయా, సంశయఘీ, నిర్భవా, భవనాశినీ ‖ 48 ‖
🌻 174. 'నిర్భవా' 🌻
పుట్టుక లేనిది శ్రీమాత అని అర్థము. పుట్టుక, మరణము లేనివారు శాశ్వతులు. అట్టివారు పుట్టిననూ అది పుట్టుక కాదు. పుట్టినట్లుగను, మరణించినట్లుగను పామరులు భావింతురు.
వారు కేవలము శరీరములు ధరించుట, విసర్జించుట చేయుచుందురు. వారు పుట్టుట, మరణించుట, వస్త్రములు విసర్జించుట వంటిది. శ్రీకృష్ణుడెప్పుడు పుట్టినాడని ప్రశ్నించిన ఒక వ్యక్తికి, శ్రీకృష్ణుడు పుట్టనే లేదని ఒక మహర్షి సందేశ మిచ్చిరి.
ప్రశ్నించిన వ్యక్తి అయోమయమున పడెను. మహర్షి నవ్వుచూ “కృష్ణుడు శాశ్వతుడు. అతడు పుట్టుట, మరణించుట యుండవు. కనిపించుట, కనిపించక పోవుట మానవుల కుండును” అని వివరించెను. శ్రీమాత కూడ అట్లే అప్పటికప్పుడు అవతరించుట, అదృశ్య మగుట యుండునే గాని ఆమెకు చావు పుట్టుకలు లేవు.
పామర దృష్టికి పుట్టుకలు, మరణములు యున్నవి. జ్ఞానదృష్టికవి లేవు. దైవమెట్లు చావుపుట్టుకలు లేని తత్త్వమో, నిజమునకు జీవుడు కూడ అట్టివాడే. అతనికినీ చావు పుట్టుకలు లేవు. ఉన్నవనుకొనుట వలన అవి యున్నవి. జీవుడు కూడ దైవమువలె శాశ్వతుడే, సనాతనుడే.
కానీ అపరిపూర్ణుడగుటచే, కారణ, సూక్ష్మ, భౌతిక శరీరములను ధరించి నపుడు పుట్టినాడని అనుకొందుము. అట్లే భౌతిక శరీరమును విడచినపుడు మరణించినాడని అనుకొందుము. అది భౌతికమునకు మరణించుటే కాని, సూక్ష్మమున జీవించి యుండును. అట్లే సూక్ష్మమున మరణించిననూ, కారణ శరీరమున జీవించి యుండును.
కారణ శరీరమును కూడ విసర్జించినపుడు, శుద్ధ చైతన్య ప్రజ్ఞగా యుండును. ప్రతిజీవియూ ఉండుట అనునది శాశ్వతమై యున్నది. అజ్ఞానులూ శాశ్వతులే. జ్ఞానులూ శాశ్వతులే. అజ్ఞానులకు పుట్టుట, చచ్చుట అనునవి గోచరించును. జ్ఞానులకు వ్యక్త, అవ్యక్త స్థితులు తెలిసి యుండుటచే, స్థితి మార్పును మరణమని భావింపరు.
శ్రీమాత తననుండి ఎనిమిది స్థితి మార్పులను కలిగించి, అందామె ప్రవేశించి యుండును. అవియే అష్ట ప్రకృతులు. అందు ఉన్నప్పటికీ వాని ప్రభావము ఆమెపై యుండదు. వస్త్రముపై వస్త్రము చొప్పున ఎనిమిది వస్త్రములు ధరించిననూ మనిషి తానెవరో తెలిసియే యుండును కదా! అట్లే అష్ట ప్రకృతులలో ప్రవేశించిన శ్రీమాత వాటిని ధరించునే కాని వానిచే ప్రభావితము కాదు. ఆమె నిర్భవ.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 174 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Nirbhavā निर्भवा (174) 🌻
She is without origin. She is ādhi (first) and ‘anādhi’ (without parentage, having no beginning). It is generally said that Śiva is without origin, as nobody has created Him. Here, Lalitāmbikā is said to be without origin because, there is no difference between Her and Śiva. Their unified form is called as the Brahman.
Kṛṣṇa says (Bhagavad Gīta XIII.12), “That supreme neither Brahma, who is the lord of beginningless entities, is said to be neither Sat (being, existing) nor Asat (unreal, non-existing). This saying of Kṛṣṇa has conceptualised the crux of all the Upaniṣads.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
09 Jan 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment