మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 137
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 137 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. సదవగాహన - 1 🌻
ఆధునిక మానవుడు ఎంతో అభివృద్ధిని విజ్ఞాన శాస్త్రపరము గాను, నాగరికత పరము గాను సాధించు చున్నాడు. ప్రాచీనులకన్న మిక్కిలి తెలివిగల వాడనని కూడ విర్రవీగుచున్నాడు. ధనము, అధికారము, విజ్ఞానము, ప్రసిద్ధి ఇట్టి విషయములు సాధించుటలో శ్రమించుచు, ఈ శ్రమకు ప్రయోజనమయిన ఆనందమును మాత్రము పొందలేకున్నాడు.
తన స్వరూపమయిన ఆనందమునందు నిలుచుటకు అవరోధములుగా మానవ మనస్సునందు, వికారములు రేకెత్తి, అతని బ్రతుకు అను నావను తుఫానుతోడి సముద్రపు కెరటముల వలె ఊపుచున్నవి.
నిజమునకు సమస్యలు తనకు వెలుపల లేవు తనలోనే నెలకొనియున్నవి. ఉదాహరణకు, ఒరుల యందు జుగుప్స. ఇతరుల లోపముల యందే చూపు నిలిపి, వారి సద్గుణములను మరచుట వలన ఇట్టి జుగుప్స పెరుగును.
....✍️ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
20 Jan 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment