మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 102
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 102 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. మహాశివరాత్రి పర్వదిన సందేశము - 2 🌻
రెండవ మంత్రం ఏమనగా "జీవో దేవః సనాతనః" ఈ జీవుడూ సనాతనుడైన దేవుడే గాని జీవుడు కాడు. జీవుడు సనాతనుడైన దేవుడు కనుక "త్యజేదజ్ఞాన నిర్మాల్యం" అజ్ఞాన నిర్మాల్యము తొలగించుకొనుట. అజ్ఞానము అనే మాసిన వస్ర్తమును అట్టే పెట్టుకోవాలి.
అజ్ఞానము అంటే ఏమిటి? ఈ విషయం ప్రతి వెధవకి తెలుసు జేబుకొట్టేస్తున్న వాడికి కొట్టేయకూడదని తెలియదా అందుకని ఎవరు చూడకుండా చేయిపెడతాడు. కొట్టేయకూడదని తెలియకపోతే అందరూ చూస్తుండగానే పెట్టేస్తాడు కదా.
కనుక తెలియక ఏమాయ రోగం లేదు. ఎవరిని గురించి అయినా చెడ్డ విషయాలు చెప్పుకునేటప్పుడు చాటుగా వెళ్ళి ఎవరూ వినకుండా ఎందుకు చెప్పుకుంటాం.
మనం చేస్తున్నది వెధవపని అని మనకు తెలుసు. లేకపోతే చాటుకు వెళ్ళి చెప్పుకోం కదా. దీని నుండి తొలగించటానికి చదువులు లాభం లేదు. మనం చేసే తప్పులన్నీ చదువుకునే చేస్తున్నాం కదా.
ఇలా ఎందుకు చేస్తున్నాం అంటే చేస్తున్నది తప్పు అని తెలియక కాదు. దీనికి పరిష్కారం ఏమనగా మనం మారడమనే శాస్ర్తీయ పద్ధతి ఉన్నది.
మంచి మంచి పుస్తకాలన్ని పెట్టెలో పెట్టుకుని, అది నెత్తిన పెట్టుకుని అది మోసే Licence కూలీ కంటే మనం బాగా చదువుకున్న వాళ్ళము గొప్పవాళ్ళము ఏమీ కాదు. తలకాయ, మెడ ఆ పుస్తకాల వల్ల కుంగిపోతుంది తప్ప మరేమి ఉపయోగం లేదు.
అందుకే వీరిని గురించి ప్రాచీనులైన పెద్దలు చక్కెర బస్తాలు, కలకండ బస్తాలు మోసే గాడిద లాంటి వారు అన్నారు. అంటే గాడిదకి బరువు తప్ప దాని తీపి తెలియదు కదా...
....✍️ మాస్టర్ ఇ.కె. 🌻
🌹 🌹 🌹 🌹 🌹
11 Nov 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment