వివేక చూడామణి - 150 / Viveka Chudamani - 150


🌹. వివేక చూడామణి - 150 / Viveka Chudamani - 150🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 31. ఆత్మ దర్శనం -5 🍀


493. నేను బ్రహ్మములో చెరించే బ్రాహ్మణుడను. రెండవది ఏదీ కాని వాడను. నాకు ఏదీ పోటీకాదు. నేను సత్యాన్ని, నాకు మొదలు లేదు, ఎలాంటి ఊహలకు అందని, ‘నీవు’ ‘నేను’; ‘ఇది’ ‘అది’ అనే భేదములేని శాశ్వతానంద సారమైన సత్యాన్ని నేను.

494. నేను నరకాసురుని వధించిన నారాయణుడను. త్రిపురాలను నాశనం చేసిన ఉన్నతమైన ఆత్మను, శివుడను నేను. నేను పాలకుడను, అత్యున్నత విజ్ఞాన సారమును. అన్నింటిని దర్శించేవాడిని. నేను అత్యున్నత విజ్ఞానమును పొంది, అన్నింటిని దర్శించేవాడను. నాకు వేరే పాలకుడు లేడు, నాకు నేనే పాలకుడను. ‘నేను’ ‘నాది’ అనే భావాలను వదలివేసిన వాడిని.

495. నేనే అన్ని జీవులలోని విజ్ఞానాన్ని. జీవులన్నింటికి ఆంతరంగికమైన మరియు బహిర్గతమైన ఆధారాన్ని. నేను అన్నింటిని అనుభవించేవాడిని మరియు అనుభవించ బడేవాడిని. నేను విముక్తుడను. నేను విముక్తుడను కాక ముందు అన్నింటిని అనాత్మగా దర్శించిన వాడను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 VIVEKA CHUDAMANI - 150 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 31. Soul Realisation - 5 🌻


493. I am indeed Brahman, the One without a second, matchless, the Reality that has no beginning, beyond such imagination as thou or I, or this or that, the Essence of Eternal Bliss, the Truth.

494. I am Narayana, the slayer of Naraka; I am the destroyer of Tripura, the Supreme Being, the Ruler; I am knowledge Absolute, the Witness of everything; I have no other Ruler but myself, I am devoid of the ideas of "I’ and "mine".

495. I alone reside as knowledge in all beings, being their internal and external support. I myself am the experiencer and all that is experienced – whatever I looked upon as "this" or the not-Self previously.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


11 Nov 2021

No comments:

Post a Comment