శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 308-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 308-1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 308-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 308-1🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 71. రాజరాజార్చితా, రాజ్ఞీ, రమ్యా, రాజీవలోచనా ।
రంజనీ, రమణీ, రస్యా, రణత్కింకిణి మేఖలా ॥ 71 ॥ 🍀

🌻 308-1. 'రాజీవలోచనా' 🌻


పద్మముల వంటి విచ్చుకున్న నేత్రములు కలది శ్రీమాత అని అర్థము. రాజీవ మనగ పద్మము. పద్మము వంటి కన్నులు కలిగి యుండుట అనగా విచ్చుకొన్న పెద్ద కన్నులు అని అర్థము. కన్ను దేహమున అత్యంత ప్రధానమగు ఇంద్రియము. కన్నుల కాంతి కున్న సౌందర్యము దేహధారి యొక్క చైతన్య స్థితిని సూచించును. వికసించిన చైతన్యము కలవారికి కన్నులు కాంతివంతముగను, అత్యంత ఆకర్షణీయ ముగను, రమణీయముగను వుండును.

దివ్య పురుషులు కన్నుల నుండియే ప్రపంచములోనికి చైతన్య కాంతులను ప్రసరింప చేయుదురు. చూపులతోనే జీవులకు స్ఫూర్తి నిత్తురు. వారి కన్నులు వాత్సల్యపూరితములై జీవుల నలరించును. కన్నుల కాంతితో సమస్తమును నిర్వహించ గల శక్తి దివ్యపురుషు లందరికిని యుండును. శ్రీరాముని కన్నులు చూచిన ఋషీంద్రులు అతని యందలి దివ్య చైతన్యమున కాకర్షితులై మోహము చెందిరి.

మహా తపస్సంపన్ను లైనను రాముని చూపులతో చూపులు కలిపినపుడు ప్రియురాండ్రవలె తన్మయము చెందుదురు. శ్రీకృష్ణుని కన్నుల విషయము చెప్పనక్కరలేదు. అతడు శత్రువులను సహితము తన కన్నులతో ఆకర్షించి వివశులను గావించెను. కేవలము మానవులేకాక జంతువులు, పశుపక్ష్యాదులు కూడ అతని కన్నులలోనికి చూచి తన్మయత్వము చెందుచూ చేష్టలుడిగిన వారైరి.

అమ్మ కన్నులు సర్వశక్తి సంపన్నము. కన్నులతోనే ఆమె సమస్త సృష్టిని గావించి పోషించుచున్నది. ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులు ఆమె కనుసన్నలలో మెలగు భృత్యులు. ఆమె కన్నుల నుండి ప్రేమ, వాత్సల్యము, జ్ఞానము ప్రసరించు చుండును. అట్లే దుష్టుల నరికట్టుటకు రౌద్రము, అంత్య కాలమున కాలాగ్ని కూడ ప్రసరించును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 308-1 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🍀 71. rājarājārcitā rājñī ramyā rājīvalocanā |
rañjanī ramaṇī rasyā raṇatkiṅkiṇi-mekhalā || 71 || 🍀

🌻 308. Rājivalocanā राजिवलोचना (308) 🌻


The choice of words by Vāc Devi-s is amazing. Rājiva means deer, fish or lotus, depending upon the context and locanā means eyes. Eyes of Mā look like the eyes of deer or appear like a fish or look like a lotus flower. They could have addressed Her as Mīnākṣī (refer nāma 18) (eyes look like fish) or could have used kamala-nayanā (eyes look like lotus) (refer nāma 62). They have used only Mṛgākṣī (nāma 561) meaning eyes look like the eyes of deer and this nāma to describe Her eyes.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


08 Sep 2021

No comments:

Post a Comment