9-SEPTEMBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము / Daily పంచాంగం  9-సెప్టెంబర్-2021  వరాహ జయంతి శుభాకాంక్షలు 🌹
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 251  🌹  
3) 🌹. శివ మహా పురాణము - 450🌹 
4) 🌹 వివేక చూడామణి - 127 / Viveka Chudamani - 127🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -79🌹  
6) 🌹 Osho Daily Meditations - 68🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 127🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

 
*🌹. వరాహ జయంతి శుభాకాంక్షలు మరియు
శుభ గురువారం మిత్రులందరికీ 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. వరాహ అవతార స్త్రోతం 🍀*

వసతి దశనశిఖరే ధరణీ తవ లగ్నా ,
శశిని కళంకకలేవ నిమగ్నా ,
కేశవ ధృతసూకరరూప జయ జగదీశ హరే||

🌷. కుంగి పోయిన భూమిని తన నాసికపై చంద్రుని నెలవంక వలె నిలిపి కాపాడిన వరాహావతారమైన శ్రీహరికి , జగదీశ్వరునకు జయము జయము - జయదేవుడు
🌻 🌻 🌻 🌻 🌻

09 గురువారం, సెప్టంబర్‌ 2021
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ
దక్షిణాయణం, వర్ష ఋతువు
చాంద్రమానం : బాద్రపద మాసం
తిథి: శుక్ల తదియ 24:18:01 వరకు తదుపరి శుక్ల చవితి
పక్షం: శుక్ల-పక్ష
నక్షత్రం: హస్త 14:31:43 వరకు తదుపరి చిత్ర
యోగం: శుక్ల 20:42:33 వరకు తదుపరి బ్రహ్మ
 కరణం: తైతిల 13:26:29 వరకు
వర్జ్యం: 22:00:00 - 23:29:48
దుర్ముహూర్తం: 10:09:55 - 10:59:14 మరియు
15:05:53 - 15:55:13
రాహు కాలం: 13:45:44 - 15:18:13
గుళిక కాలం: 09:08:15 - 10:40:44
యమ గండం: 06:03:15 - 07:35:45
అభిజిత్ ముహూర్తం: 11:49 - 12:37
అమృత కాలం: 08:52:30 - 10:22:46 మరియు
30:58:48 - 32:28:36 
సూర్యోదయం: 06:03:15
సూర్యాస్తమయం: 18:23:13
వైదిక సూర్యోదయం: 06:06:47, 
వైదిక సూర్యాస్తమయం: 18:19:40
చంద్రోదయం: 08:01:44, 
చంద్రాస్తమయం: 20:16:18
సూర్య రాశి: సింహం, చంద్ర రాశి: కన్య
ఆనందాదియోగం: రాక్షస యోగం - మిత్ర కలహం 14:31:43 
వరకు తదుపరి చర యోగం - దుర్వార్త శ్రవణం 
పండుగలు : సామవేద ఉపాకర్మ, వరాహ జయంతి, 

*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -251 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚*
శ్లోకము 28-2
 
*🍀 27-2. నిత్య జీవన యోగము - యజ్ఞము లాచరించునపుడు గాని, తపస్సులు చేయు చున్నపుడు గాని, వేదములు అధ్యయనము చేయుచు అనుష్ఠించుట యందు గాని, పూజాది కార్యక్రమము లందు గాని, అభిషేకము హోమాది కార్యక్రమము లందుగాని, క్రతువుల యందు గాని, వ్రతము లందుగాని- అవి ఆచరించు చున్నపుడే దైవముతో కూడి యుండుట యుండును. ఇతర సమయములలో, అనగా నిత్య నైమిత్తిక కర్మలు నిర్వర్తించు చున్నపుడు దైవచింతన యుండదు. అట్లుకాక సర్వకాల సర్వావస్థల యందు చింతించు వాడు ఎప్పుడునూ దైవముతోనే కూడి యుండును. 🍀*

వేదేషు యథేషు తపస్సు చైన దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్ |
అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగ పరం స్థాన ముపైతి చాద్యమ్ || 28

తాత్పర్యము : యోగి పరమగు స్థానమును పొంది యుండుటచే అతడు వేదములందును, యజ్ఞములందును దానము లందును, తపస్సులందును ఏ పుణ్యఫలము చెప్పబడి యున్నదో, దాని నంతటిని అతిక్రమించి యున్నాడు. 

వివరణము : యజ్ఞము లాచరించునపుడు గాని, తపస్సులు చేయు చున్నపుడు గాని, వేదములు అధ్యయనము చేయుచు అనుష్ఠించుట యందు గాని, పూజాది కార్యక్రమము లందు గాని, అభిషేకము హోమాది కార్యక్రమము లందుగాని, క్రతువుల యందు గాని, వ్రతము లందుగాని- అవి ఆచరించు చున్నపుడే దైవముతో కూడి యుండుట యుండును. ఇతర సమయములలో, అనగా నిత్య నైమిత్తిక కర్మలు నిర్వర్తించు చున్నపుడు దైవచింతన యుండదు. అట్లుకాక సర్వకాల సర్వావస్థల యందు చింతించు వాడు ఎప్పుడునూ దైవముతోనే కూడి యుండును. 

పై తెలిపిన కార్యములు నిర్వర్తించుకొను వారు కొంత తడవు కూడి యుండుట, కొంత తడవు కూడక యుండుట యుండును. అట్లుకాక నిత్యజీవన యోగమున ఎప్పుడును కూడి యుండుటే యుండును. అనగా దంతధావనము సమయమున, స్నానాదిక సమయమున, పానీయములు త్రాగు సమయమున, అన్నము తిను సమయమున, భాషించు సమయమున, ప్రయాణ సమయమున, పనుల సమయమున, విశ్రాంతి సమయమున- ఇట్లన్ని సమయము లందు కూడియుండుట యుండును. జీవితము నిత్య పూజగ సాగును. నిత్యయోగమై సిద్ధించును. నిత్య నిరంతర సాన్నిధ్యముండును. 

ఇట్టి స్థానమును ఇతర ఉపాయములచే పొందలేరని పరమాత్మ తేల్చి చెప్పినాడు. ఈ సాధనకు వేదములు చదువలేక పోవుట, మంత్రము లుచ్చరింప లేకపోవుట, క్రతువులు నిర్వర్తింప లేకపోవుట, తపస్సులు వర్తించ లేకపోవుట అను అవరోధములు లేవు. మనసున్న ప్రతి మనిషి జాతి-మత-కుల సంబంధము లేక దీనిని నిర్వర్తించుకొన వచ్చును. విశ్వమందు ఇంతకన్న శ్రేయోమార్గము లేదు. ఇది సత్యము.

శ్రీ మద్భగవద్గీత యందలి 8వ అధ్యాయము 'అక్షర పరబ్రహ్మ యోగ' వివరణము సంపూర్ణము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 450🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 30

*🌻. పార్వతి గృహమునకు మరలి వచ్చుట - 4 🌻*

శివుడు ఆమెకు హృదయములో దర్శనమిచ్చి ప్రీతితో మంగళకరమగు అట్టి వరమొసంగి అంతర్ధానమై మరల అచట భిక్షుకుడై నాట్యమును చేసెను (36). అపుడు మేన బంగరు పాత్రలో మంచి రత్నములను పోసి ఆతనికి ఇచ్చుటకై తీసుకొని వెళ్లెను (37).

ఆ సంపదకు సంతసించిన మనస్సుగల శివుడు ఆ రత్నములను నిరాకరించి పార్వతిని భిక్షగా నిమ్మని గోరెను. మరియు, ఆయన మరల పాటలు పాడుతూ ఉత్సాహముతో నటనము చేయ మొదలిడెను (38). ఆ మాటను వినిన మేన మిక్కలి ఆశ్చర్యమును, కోపమును పొంది ఆ భిక్షుకుని నిందించెను. ఆమె ఆతనిని బయటకు నెట్టింపగోరెను (39). 

ఇంతలో గంగానది నుండి హిమవంతుడచటకు వచ్చెను. ఆయనకు నరరూపములో నున్న ఆది భిక్షువు వాకిట గానవచ్చెను (40). మేనాదేవి చెప్పగా జరిగిన వృత్తాంతమునంతనూ విని ఆయన చాలా కోపించి ఆనటుని బయటకు గెంటుడని సేవకులనాజ్ఞాపించెను (41). 

ఓ మునిశ్రేష్ఠా! గొప్ప అగ్నివలె స్పృశింప శక్యముగాని విధముగా మహాతేజస్సుతో ప్రజ్వరిల్లుచున్న ఆ శివుని బయటకు నెట్టు సామర్థ్యము ఎవ్వరికీ లేకపోయెను (42). ఓ కుమారా! అనేక లీలా పండితుడగు ఆ భిక్షుకుడు అపుడు తన అనంత మహిమను హిమవంతునకు చూపించెను (43)

అపుడచట హిమవంతునకు వెనువెంటనే కిరీటమును, కుండలములను, పచ్చని వస్త్రమును ధరించియున్న నాల్గు భుజములు గల విష్ణురూపము దర్శనమిచ్చెను (44). పూజాసమయములో గదాధారియగు విష్ణువునకు ఏయే పుష్పాదులు సమర్పించడినవో, అవి అన్నియూ ఆ భిక్షుకుని శరీరమునందు, శిరస్సునందు గానవచ్చెను (45). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. వివేక చూడామణి - 127 / Viveka Chudamani - 127🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 26. ఆత్మ మార్పులేనిది - 14 🍀*

419. ఓర్పు యొక్క ఫలితమే అనుభవము. అనుభవ ఫలితముగా భౌతిక వస్తు ప్రభావము నుండి భయటపడి, తత్ ఫలితముగా బ్రహ్మానంద స్థితిని, ఆత్మావగాహన ద్వారా అనుభవించి శాంతిని పొందును. 

420. తరువాత ఒక్కొక్క మెట్టు ఎదిగినచో, గత అభివృద్ది దశలన్నియూ నిష్ఫలమవుతాయి. అభివృద్ది నిరంతరాయముగా జరుగుచున్నా, ప్రాపంచిక వస్తు విశేషముల కర్మలన్నియూ తొలగి అత్యున్నతమైన తృప్తి మరియు తిరుగులేని బ్రహ్మానంద స్థితి సహజముగా లభించును. 

421. భౌతిక జీవనములోని బాధలకు కారణము జ్ఞానమును అనుమానించుటయే. ఏవిధముగా వ్యక్తి ఎవడైతే అసహ్యకరమైన పనులు; మాయలో అజ్ఞానములో చేసి ఉన్నారో అట్టి వారు ఆ తరువాత జన్మలలో అదే విధములైన చెడు ఫలితములను అనుభవించవలసి వచ్చును.

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 127 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 26. Self is Unchangeable - 14 🌻*

419. The result of dispassion is knowledge, that of Knowledge is withdrawal from sense-pleasures, which leads to the experience of the Bliss of the Self, whence follows Peace.

420. If there is an absence of the succeeding stages, the preceding ones are futile. (When the series is perfect) the cessation of the objective world, extreme satisfaction, and matchless bliss follow as a matter of course.

421. Being unruffled by earthly troubles is the result in question of knowledge. How can a man who did various loathsome deeds during the state of delusion, commit the same afterwards, possessed of discrimination ?

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 79 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. ప్రత్యేక స్వభావమునకు కట్టుబడ కుండుటయే యోగుల స్వభావము. 🌻*

తమకొక ప్రత్యేక స్వభావమును అభ్యాసము చేసికొన కుండుట, దాని యందు కట్టుబడ కుండుటయే యోగుల స్వభావము.  

కలియుగమున సాధకుని సమర్పణ బుద్ధిని బట్టి కలిధర్మము సోకని వాడుండును. 

దైవ ధర్మమే తన జీవితముగా మలచుకొన్న వానికి కలిధర్మము తనలో ఇమిడి ఒక మూల నిలిచి యుండునే కాని అంతరింపదు. అది ఇతరుల ప్రవర్తనపై తన అభిప్రాయముల రూపమున ఉండును. 

మోక్షమన్నది మానవులలో ఎవని స్థితిని బట్టి వారు ఏర్పరచుకొను పరిమితమైన భావము అది అపరిమితత్వమును గూర్చి ఏర్పడిన పరిమిత భావము......

✍️ *మాస్టర్ ఇ.కె.* 🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Osho Daily Meditations - 68 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 68. OPENNESS 🍀*

*🕉 Let winds come, let the sun come-everything is welcome. Once you become attuned to living with an open heart, you will never close. But a little time has to be given to it. And you have to maintain that opening, otherwise it will close again. 🕉*

Openness is vulnerability. When you are open, you feel at the same time that something wrong can enter you. That is not just a feeling; it is a possibility. That's why people are closed. If you open the door for the friend to come in, the enemy can also enter. Clever people have closed their doors. To avoid the enemy, they don't even open the door for the friend. But then their whole life becomes dead. 

But there is nothing that could happen, because basically we have nothing to lose-and that which we have cannot be lost. That which can be lost is not worth keeping. When this understanding becomes tacit, one remains open. I can see that even lovers are defending themselves. Then they cry and weep because nothing is happening. They have closed all the windows and are suffocating. No new light has come in and it is almost impossible to live, but still they drag on somehow. But they don't open, because fresh air seems to be dangerous. 

So when you feel open, try to enjoy it. These are rare moments. In these moments move out so that you can have an experience of openness. Once the experience is there, solid in your hands, then you can drop the fear. You will see that being open is a treasure that YOU were losing unnecessarily. And the treasure is such that nobody can take it away. The more you share it, the more it grows. The more open you are, the more you are.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 127 / Sri Lalita Sahasranamavali - Meaning - 127 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 127. విశ్వగర్భా, స్వర్ణగర్భా,ఽవరదా వాగధీశ్వరీ |*
*ధ్యానగమ్యా,ఽపరిచ్ఛేద్యా, జ్ఞానదా, జ్ఞానవిగ్రహా ‖ 127 ‖ 🍀*

🍀 637. విశ్వగర్భా - 
విశ్వమును గర్భమునందు ధరించునది.

🍀 638. స్వర్ణగర్భా - 
బంగారు గర్భము గలది.

🍀 639. అవరదా - 
తనకు మించిన వరదాతలు లేనిది.

🍀 640. వాగధీశ్వరీ - 
వాక్కునకు అధిదేవత.

🍀 641. ధ్యానగమ్యా - 
ధ్యానము చేత పొందబడునది.

🍀 642. అపరిచ్ఛేద్యా -
 విభజింప వీలులేనిది.

🍀 643. జ్ఞానదా - 
జ్ఞానమును ఇచ్చునది.

🍀 644. జ్ఞానవిగ్రహా - 
జ్ఞానమును మూర్తిగా దాల్చింది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 127 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 127. viśvagarbhā svarṇagarbhā'varadā vāgadhīśvarī |*
*dhyānagamyā'paricchedyā jñānadā jñānavigrahā || 127 || 🌻*

🌻 637 ) Viswa Grabha -   
She who carries the universe in her belly

🌻 638 ) Swarna Garbha -   
She who is personification of gold

🌻 639 ) Avaradha -   
She who punishes bad people

🌻 640 ) Vagadeeswaree -   
She who is the goddess of words

🌻 641 ) Dhyanagamya -   
She who can be attained by meditation

🌻 642 ) Aparichedya -   
She who cannot be predicted to be in a certain place

🌻 643 ) Gnadha -   
She who gives out knowledge

🌻 644 ) Gnana Vigraha -   
She who is personification of knowledge.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment