మైత్రేయ మహర్షి బోధనలు - 2


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 2 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 1. గురుపరంపర-2 🌻


గురుపరంపర జీవునకు దైవమునకు మధ్య సంధానకర్తలుగా మాత్రమే పనిచేయుదురు కాని అడ్డుగోడలవలె నిలబడరు. అవసరమై నప్పుడెల్ల జీవునకు మార్గమున తగు సలహాల నిచ్చి సహాయ సహకారముల నందింతురు. మా గురుపరంపర ఏమతమునకు చెందినది కాదు. కేవలము సత్యమునకు చెందినది. సృష్టి ధర్మములకు కట్టుబడి వుండునది.

మాకై మేము ఎవరిని శాసింపము. కోరినవారికి మాత్రమే సత్యమునకు దారి చూపెదము. లోక శ్రేయస్సే మా లక్ష్యము. మృణమయమైన శరీరము నుండి దివ్యశరీరమును జీవుడు పొంది, దివ్యానుభూతి యందు శాశ్వతముగ నిలుచుట కొరకు దైవసంకల్పముగ మా కర్తవ్యమును నిర్వర్తించుచున్నాము. జీవనమున యీ జీవులను హంసలవలె తీర్చిదిద్ది పరమహంస తత్వమును దారిచూపుట మా నిరంతర కృషి.

మానవుని పరిణామము కొరకై నిర్వాణమును నిరాకరించిన త్యాగశీలురైన సిద్ధులు మా పరంపరయందలి సభ్యులు. మా మార్గమున ఎంత దివ్యానుభూతి కలదో అంత త్యాగము కలదు, కర్మక్షాళనమునకు తగిన శ్రమము కలదు. ప్రపంచము నలుమూలల యందు సత్యము నన్వేషించుచున్న జీవులయందు శ్రద్ధ కలిగి యుండి వారి యందలి సత్యమును మేలుకొల్పు చుందుము. ఉపనిషత్తులు, భగవద్గీత, యోగసూత్రములు మా ప్రమాణ గ్రంధములు.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


08 Sep 2021

No comments:

Post a Comment