20 - MARCH - 2022 ఆదివారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 20, మార్చి 2022 ఆదివారం, బృహస్పతి వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 174 / Bhagavad-Gita - 174 - 4-12 జ్ఞానయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 573 / Vishnu Sahasranama Contemplation - 573🌹
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 22 / Agni Maha Purana 22 🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 252 / DAILY WISDOM - 252 🌹 
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 153 🌹
7) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 91 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ ఆదివారం మిత్రులందరికీ 🌹*
*భాను వాసరే, 20, మార్చి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : చాతుర్మాస్య ద్వితీయ, 
Bhratri Dwitiya, Vernal Equinox.🌻*

*🍀. ద్వాదశ ఆదిత్య ధ్యాన శ్లోకాలు - 11 🍀*

*🌟 11. పూష –*
*పూషా ధనంజయో వాతః సుషేణః సురుచిస్తథా |*
*ఘృతాచీ గౌతమశ్చేతి తపోమాసం నయంత్యమీ |*
*పూషా తోషాయ మే భూయాత్ సర్వపాపాఽపనోదనాత్ |*
*సహస్రకరసంవీతః సమస్తాశాంతరాంతరః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : దేవాలయ ప్రాంగణాన్ని పరిశుభ్రం చేయడం వలన అవరోధాలు తక్షణమే తొలగిపోయి, సానుకూలత కలుగుతుంది. - మాస్టర్‌ ఆర్‌.కె. 🍀*
🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం 
తిథి: కృష్ణ విదియ 10:07:46 వరకు
తదుపరి కృష్ణ తదియ
నక్షత్రం: చిత్ర 22:41:40 వరకు
తదుపరి స్వాతి
యోగం: ధృవ 18:33:49 వరకు
తదుపరి వ్యాఘత
కరణం: గార 10:05:46 వరకు
వర్జ్యం: 07:19:40 - 08:51:48
మరియు 28:00:40 - 29:32:00
దుర్ముహూర్తం: 16:50:05 - 17:38:31
రాహు కాలం: 16:56:08 - 18:26:58
గుళిక కాలం: 15:25:19 - 16:56:08
యమ గండం: 12:23:41 - 13:54:30
అభిజిత్ ముహూర్తం: 11:59 - 12:47
అమృత కాలం: 16:32:28 - 18:04:36
సూర్యోదయం: 06:20:24
సూర్యాస్తమయం: 18:26:58
చంద్రోదయం: 20:28:54
చంద్రాస్తమయం: 07:43:21
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: కన్య
పద్మ యోగం - ఐశ్వర్య ప్రాప్తి 22:41:40
వరకు తదుపరి లంబ యోగం
- చికాకులు, అపశకునం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 174 / Bhagavad-Gita - 174 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 12 🌴*

*12. కాంక్షన్త: కర్మాణాం సిద్ధిం యజన్త ఇహ దేవతా: |*
*క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా ||*

🌷. తాత్పర్యం :
*లోకమున జనులు కామ్యకర్మల యందు జయమును గోరు కారణముగా దేవతలను పూజింతురు. ఈ జగము నందు వారు కామ్యకర్మలకు శీఘ్రముగా ఫలమును పొందుచున్నారు.*

🌻. భాష్యము :
ఈ జగమున దైవమును గూర్చి లేదా దేవతలను గూర్చియు గొప్ప తప్పు భావన కలదు. అల్పజ్ఞులైనవారు (విద్వాంసులుగా చలామణి అగుచున్నను) దేవతలను భగవానుని వివిధరూపములుగా భావింతురు. కాని వాస్తవమునకు దేవతలు భగవానుని వివిధరూపములు కారు. వారు కేవలము అతని అంశాలు మాత్రమే. భగవానుడొక్కడే కాని అతని అంశలు మాత్రము అనతములు. “నిత్యోనిత్యానాం” – భగవానుడొక్కడే యని వేదములు తెలుపుచున్నవి. 

“ఈశ్వర: పరమ: కృష్ణ:” – దేవదేవుడు అద్వితీయుడు. ఆతడే శ్రీకృష్ణుడు. భౌతికజగమును పాలించుటకు పాలనాధికారము ఒసగబడెడివారే దేవతలు. వారందరును వివిధశక్తులు కలిగిన జీవులు(నిత్యనాం) మాత్రమే. వారెన్నడను దేవదేవుడైన శ్రీకృష్ణునితో లేదా నారాయణునితో లేదా విష్ణువుతో సమానులు కాజాలరు. అట్టి దేవతలు మరియు శ్రీకృష్ణభగవానుడు సమానమే యని భావించువాడు పాషండుడు లేదా నాస్తికుడని పిలువబడును. బ్రహ్మ మరియు శివుని వంటి మహా దేవతలే ఆ భగవానునకు సాటిరారు. 

వాస్తవమునకు భగవానుడు బ్రహ్మరుద్రాదుల వంటి దేవతలచే పూజలనందుచుండును(శివవిరించితమ్). అయినను ఆశ్చర్యవిషయమేమన మూఢజనులు కొందరు భగవానునికి మనుష్యరూపమును ఆపాదించుట లేదా భగవానునికి జంతురూపము నపాదించుట వంటి అపోహలో పలువురు మానవులన పూజించుచుందురు. ఈ శ్లోకమున “ఇహదేవతా:” అణు పదము ఈ లోకమునకు చెందిన శక్తిమంతుడైన మనుజుని గాని, దేవతను గాని సూచించును. కాని దేవదేవుడైన శ్రీకృష్ణుడు (నారాయణుడు లేదా విష్ణువు) ఈ లోకమునకు చెందినవాడుకాడు. అతడు ఈ భౌతికజగమునకు పరమైనట్టివాడు.  

మూఢజనులు (హృతజ్ఞానులు) శీఘ్రఫలములను గోరినందున వివిధదేవతలను పూజింతురు. వారు తాము కోరిన ఫలములను శీఘ్రమే పొందగలిగినను, అవి అశాశ్వతములనియు మరియు బుద్ధిహీనులకు మాత్రమే నిర్దేశింపబడినవనియు ఎరుగజాలరు. కాని బుద్ధిమంతుడైనవాడు కృష్ణభక్తిభావన యందు నిలిచిన కారణముగా ఏదియో తాత్కాలిక లాభము కొరకై వివిధ దేవతలను అర్చింప నవసరము లేదు. వాస్తవమునకు దేవతలు మరియు వారిని పూజించెడి వారందరును విశ్వప్రళయమున నశించిపోవుదురు. 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 174 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 4 - Jnana Yoga - 12 🌴*

*12. kāṅkṣantaḥ karmaṇāṁ siddhiṁ yajanta iha devatāḥ*
*kṣipraṁ hi mānuṣe loke siddhir bhavati karma-jā*

🌷 Translation : 
*Men in this world desire success in fruitive activities, and therefore they worship the demigods. Quickly, of course, men get results from fruitive work in this world.*

🌹 Purport :
There is a great misconception about the gods or demigods of this material world, and men of less intelligence, although passing as great scholars, take these demigods to be various forms of the Supreme Lord.

Actually, the demigods are not different forms of God, but they are God’s different parts and parcels. God is one, and the parts and parcels are many. The Vedas say, nityo nityānām: God is one. Īśvaraḥ paramaḥ kṛṣṇaḥ. The Supreme God is one – Kṛṣṇa – and the demigods are delegated with powers to manage this material world. These demigods are all living entities (nityānām) with different grades of material power. They cannot be equal to the Supreme God – Nārāyaṇa, Viṣṇu, or Kṛṣṇa. 

Anyone who thinks that God and the demigods are on the same level is called an atheist, or pāṣaṇḍī. Even the great demigods like Brahmā and Śiva cannot be compared to the Supreme Lord. In fact, the Lord is worshiped by demigods such as Brahmā and Śiva (śiva-viriñci-nutam). Yet curiously enough there are many human leaders who are worshiped by foolish men under the misunderstanding of anthropomorphism or zoomorphism. Iha devatāḥ denotes a powerful man or demigod of this material world. But Nārāyaṇa, Viṣṇu, or Kṛṣṇa, the Supreme Personality of Godhead, does not belong to this world. He is above, or transcendental to, material creation. 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 573 / Vishnu Sahasranama Contemplation - 573🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 573. వాచస్పతిరయోనిజః, वाचस्पतिरयोनिजः, Vācaspatirayonijaḥ 🌻*

*ఓం వాచస్పతయే అయోనిజాయ నమః | ॐ वाचस्पतये अयोनिजाय नमः | OM Vācaspataye ayonijāya namaḥ*

*విద్యాయా ఈశ్వరో వాచస్పతిర్యోనౌ న జాయతే ।*
*అమాతృగర్భోఽజో విష్ణుర్వాచస్పతిరయోనిజః ॥*
*ఇతి సహవిశేషణం నామ విష్ణోర్మహాత్మనః ॥*

*వాక్కునకు అనగా విద్యకు పతి లేదా ప్రభువు లేదా రక్షకుడు - వాచస్పతి. యోని ద్వారమున జనియించనివాడు అనగా తల్లి యందుండి పుట్టనివాడు అయోనిజుడు. ఆ పరమాత్మునియందు ఈ రెండు లక్షణములూ కలవు కనుక వాచస్పతిరయోనిజః. ఆ విష్ణు పరమాత్మునికి విశేషణముతో కూడిన ఒకే నామము ఇది.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 573🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻 573. Vācaspatirayonijaḥ 🌻*

*OM Vācaspataye ayonijāya namaḥ*

विद्याया ईश्वरो वाचस्पतिर्योनौ न जायते ।
अमातृगर्भोऽजो विष्णुर्वाचस्पतिरयोनिजः ॥
इति सहविशेषणं नाम विष्णोर्महात्मनः ॥

*Vidyāyā īśvaro vācaspatiryonau na jāyate,*
*Amātr‌garbho’jo viṣṇurvācaspatirayonijaḥ.*
*Iti sahaviśeṣaṇaṃ nāma viṣṇormahātmanaḥ.*

*Vāk means eloquence or vidya i.e. knowledge; the One who is the Lord of such knowledge is Vācaspati. He who is self manifest not needing to take birth journeying through the womb of a woman is Ayonijaḥ. Since He has both the qualities, Vācaspatirayonijaḥ is one name but to be treated as with an adjective.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सुधन्वा खण्डपरशुर्दारुणो द्रविणप्रदः ।दिविस्पृक् सर्वदृग् व्यासो वाचस्पतिरयोनिजः ॥ ६१ ॥

సుధన్వా ఖణ్డపరశుర్దారుణో ద్రవిణప్రదః ।దివిస్పృక్ సర్వదృగ్ వ్యాసో వాచస్పతిరయోనిజః ॥ 61 ॥

Sudhanvā khaṇḍaparaśurdāruṇo draviṇapradaḥ,Divispr‌k sarvadr‌g vyāso vācaspatirayonijaḥ ॥ 61 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 22 / Agni Maha Purana - 22 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 9*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. సుందరకాండ వర్ణనము - 1 🌻*

నారదుడు పలికెను : హనుమంతుడును, అంగదాదులను నంపాతి మాటలు విని, సముద్రమును చూచి "ఈ సముద్రమును దాటి ఎవరు మనలనందరిని జీవింపచేయగలరు?" అని అనుకొనిరి. 
హనుమంతుడు కపులు జీవీంచుటకును, రామకార్యము సిద్ధించుటకును నూరు యోజనముల విస్తారము గల సముద్రమును లంఘించెను.

పైకి(సముద్రమునుండి) లేచిన మైనాకపర్వతమును చూచి, సింహికను చంపి, లంకను చూచి, రాక్షసుల గృహములను కూడ చూచెను. అచట రావణుని ఇంటి అంతఃపురము నందును, కుంభ - కుంభకర్ణ-విభీషణ-ఇంద్ర జిత్తలు గృహమునందును, ఇతర రాక్షసుల గృహములందును, పానభూమి మొదలగు ప్రదేశములందును కూడ సీతను చూడజాలకపోయెను. అపుడు ఆ హనుమంతుడు చింతాక్రాంతుడై అశోకవనమునకు వెళ్ళి శింశపావృక్షము నెక్కి దాని క్రింద రాక్షస స్త్రీలచే రక్షింపబడుచున్న సీతను, "నా భార్యవు కమ్ము" అని పలుకుచున్న రావణుని, అందులకు నిరాకరించుచునన సీతను, ''రావణునికి భార్యవగుము" అని చెప్పుచున్న రాక్షసస్త్రీలను చూచెను.

రావణుడు వెళ్ళిపోయిన పిమ్మట హనుమంతు డిట్లు పలికెను. దశరథుడనెడు రాజు ఉండెను. అతని శ్రేష్ఠు లైన పుత్రులు, రామలక్ష్మణులు, అరణ్యమునకు వెళ్ళిరి. రామ భార్య లైన సీత యగు నిన్ను రావణుడు బలాత్కార మున అపహరించెను. నుగ్రీవుని మిత్రుడైన రాముడు నిన్ను అన్వేషించుచు, నన్ను పంపెను. అనవాలుతో కూడిన, రాము డిచ్చిన ఉంగరమును గ్రహింపుము.

సీత వృక్షముమీద ఉనన వానరుని చూచెను. ఆ ఉంగరమును తీసికొనెను. ఇంకను ఎదుట కూర్చొని ఉన్న అతనితో ఇట్లనెను- "రాముడు జీవించి ఉన్నచో నన్నేల తీసికొని వెళ్ళుటలేదు?" ఈ విధముగ శంకించుచున్న ఆమెతో హనుమంతు డిట్లు పలికెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana -22 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

Chapter 9
*🌻 Sundar Kand - 1 🌻*

Nārada said:

1. Having heard the words of Sampāti, Hanūmat, Aṅgada, (son of Vālin) and others having seen the ocean said, “Who may cross the ocean and make us live?”

2. For the survival of monkeys and accomplishing the task of Rāma, that Māruti (Hanūmat) crossed the ocean extending to hundred yojanas.

3-5. Having seen the rise of Maināka (mountain), having killed (the demon) Siṃhikā and having seen Laṅkā and searching the houses of the demons and those of the women and the houses of the tenheaded (Rāvaṇa), Kumbha, Kumbhakarṇa, Vibhīṣaṇa, Indrajit, and other demons, he did not find (Sītā) (also) in the place for drinking wine. Becoming anxious and having gone to the Aśoka grove he found Sītā at the foot of the Śiṃśapā tree.

6. Remaining on the Śiṃśapā tree he saw Sītā being guarded by the demonesses, (and) Rāvaṇa asking her to become his wife and Sītā replying him that she could not.

7-9. The monkey (also saw) the demonesses asking Sītā to become the wife of Rāvaṇa, After Rāvaṇa had gone he said, "Daśaratha was a king. His sons Rāma and Lakṣmaṇa, the two excellent brothers came to the forest. You, Jānakī, the wife of Rāma were forcibly taken away by Rāvaṇa. Rāma became a friend of Sugrīva, sent me to search for you, (and) (you) take this signet ring of identification given by Rāma.”

10. Sītā received the ring. Having seen Māruti seated on the tree and again in front of her, (she) asked him, “If (he) lives, how Rāma does not take me away?” 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 252 / DAILY WISDOM - 252 🌹*
*🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 8. నిజంగా చాలా మంది దేవుళ్ళు ఉన్నారా? 🌻*

*నిజంగా చాలా మంది దేవతలు ఉన్నారా? సమాధానం అవును, మరియు లేదు. కానీ విశ్వం యొక్క అభివ్యక్తి యొక్క వరుస క్రమంలో విషయం-వస్తువు సంబంధం యొక్క అనేక కోణాలు కనుక అనేక మంది దేవతలు ఉన్నారని చెప్పవచ్చు. విషయం మరియు వస్తువుకు మించిన అతీంద్రియ శక్తులు అవి. దేవతలు తెలివైన వారు, మెరిసేవారు. వీరి ఉనికి గురించిన అవగాహన లేదా జ్ఞానం చేతన్య సంబంధం లేకుండా అసాధ్యం. నిజానికి, దేవతలు చాలా మంది కాదు. దేవతల అనేకత్వం అనేది కేవలం చైతన్య స్పృహ లేదా చైతన్య స్థాయిలను సూచించే నామకరణం మాత్రమే. సృష్టి కథలో విశ్వ చైతన్యం, పదార్థముగా దిగి వచ్చే సందర్బంలో ఈ విషయ-వస్తువుల సంబంధాల పరంగా అవి అనేకంగా ఏర్పడ్డాయి.*

*భారతీయ మత దృక్పథంలో చాలా మంది దేవతలని మనం చూస్తాం. అంటే వంశ దేవతలు, కుటుంబ దేవతలు, ఇష్ట దేవతలు ఇలా అనేకం ఉండడాన్ని మనం గమనించవచ్చు. ప్రకృతి ప్రపంచంలో జరిగే బహుళ రకాల సంఘటనలు మరియు ఆ సంఘటనల వెనుక భౌతికంగా సాధారణ మేధస్సుకు అర్ధం కాని అనేక అతీంద్రీయ కారణాలు ఉన్నాయనే భావన నుండి, ఇలాంటి అనేక విభజనల యొక్క భావనలు ఈ దేవతల ఆవిర్భావానికి స్వయంచాలకం అవుతాయి. ఒక కుటుంబాన్ని, గ్రామాన్ని లేదా సమాజాన్ని రక్షించేందుకు ఒక దేవుడు, పట్టణానికి ఒక దేవుడిని ఇలా అనేకం దృశ్యమానం చేయబడతాయి. దేశం యొక్క దేవుడు లేదా దేవత, యుద్ధ దేవుడు మరియు శాంతి దేవుడు ఇలా అనేక రూపాలతో వ్యక్తిగత, సమాజ స్థాయిలో అరాధనలు జరుగుతాయి.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 252 🌹*
*🍀 📖 from Essays in Life and Eternity 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 8. Are there Really Many Gods? 🌻*

*Are there really many gods? The answer is yes, and no. There are many gods, because there are many degrees of the subject-object relation obtaining successively in a sequential order of the manifestation of the universe, and these being transcendentally operative powers beyond the subject and the object, they are verily gods, the shining ones, the conscious relation without which perception or knowledge would be impossible. But, in fact, the gods are not many, since their manifoldness is just a nomenclature designating the levels of consciousness through which the Absolute descends in terms of several subject-object relations in the story of creation.*

*The Indian religious perspective visualises, adores and worships many a god, the god of the house or the family, the god of the village or the community, the god of the town, the god of the nation, the god of war, and the god of peace, and so on, because these concepts of many divinities follow automatically from the concept of there being many superphysical causes behind the multitudinous variety of events and occurrences in the world of nature.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 153 -1🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. దేవుడి ఆలయంలోకి అడుగు పెట్టడానికి ఎన్నో ద్వారాలున్నాయి. కానీ అన్నిటికీ తాళాలున్నాయి. వాటిని తెరవడానికి నీకు తాళం చెవి అవసరం. అదే ధ్యానం, అదే మెలుకువ. 🍀*

*ఏ తలుపు గుండా నయినా వెళ్ళు. నువ్వు శాంతి ద్వారంగా వెళ్ళడానికి ప్రయత్నించు. ఆనందం ఎదురవుతుంది. ప్రేమ ఎదురవుతుంది. అనురాగం ఎదురవుతుంది. యితర వ్యక్తులకు సంబంధించి అద్భుతమయిన అవగాహన ఏర్పడుతుంది. క్షమాగుణం కలుగుతుంది. గొప్ప వినయం, నమ్రత, నిరహంకారం, సత్యసంధన, నిజాయితీ, సాధికారం ఏర్పడుతాయి.*

*అవన్నీ పూలలా వికసిస్తాయి. ఏ ద్వారం గుండా నయినా వెళ్ళు. ప్రేమ మార్గం గుండా వెళ్ళడానికి ప్రయత్నించు. అనురాగం గుండా వెళ్ళడానికి ప్రయత్నించు. ఏదయినా ఫరవాలేదు. దేవుడి ఆలయంలోకి అడుగుపెట్టడానికి ఎన్నో ద్వారాలున్నాయి. కానీ అన్నిటికీ తాళాలున్నాయి. వాటిని తెరవడానికి నీకు తాళం చెవి అవసరం. అదే ధ్యానం, అదే మెలుకువ.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 91 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 76. భావములు - పంచభూతములు - 1 🌻*

*మీ భావలోకములను కంచుకోటవలె పటిష్ఠము గావించు కొనవలెను. మీ యందలి పంచభూతములు, మీ భావముల నాణ్యతను బట్టి వెలుగొందు చుండును. నాణ్యతలేని భావములు మనసున చేరినచో కోటకు బీట్లు వారినట్లే. అపుడు శత్రువులు ప్రవేశింతురు. శరీరమందలి పంచ భూతములు అపుడు కకావికలమై పోవును. ఆరోగ్యము చెడును. నిరాశ, నిస్పృహ చోటు చేసుకొనును. మన పతనమునకు గాని, వృద్ధికి గాని భావములే ప్రధానము.*

*ఎట్టి క్లిష్ట పరిస్థితిలోను కూడ దీనతను ఆశ్రయింపకూడదు. నిరాశ, నిస్పృహ లను పెంపొందింప జేయకుడు. పంచభూతములకు ఇంద్రుడే అధి దేవత. ఇంద్రప్రజ్ఞ మీ మనోభావములను పనిచేయించును. ఇంద్రుడు పంచభూతాత్మక సృష్టికి రాజు. అనగా రక్షకుడు. అతడు బలహీన పడినప్పుడెల్ల అసురులు ప్రవేశించి సమస్తమును ధ్వంసము చేయుదురు. అట్లే మీ జీవన రాజ్యములకు మీ మనోభావ నాణ్యత రక్షణ.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

No comments:

Post a Comment