నిర్మల ధ్యానాలు - ఓషో - 153 -1


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 153 -1🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. దేవుడి ఆలయంలోకి అడుగు పెట్టడానికి ఎన్నో ద్వారాలున్నాయి. కానీ అన్నిటికీ తాళాలున్నాయి. వాటిని తెరవడానికి నీకు తాళం చెవి అవసరం. అదే ధ్యానం, అదే మెలుకువ. 🍀

ఏ తలుపు గుండా నయినా వెళ్ళు. నువ్వు శాంతి ద్వారంగా వెళ్ళడానికి ప్రయత్నించు. ఆనందం ఎదురవుతుంది. ప్రేమ ఎదురవుతుంది. అనురాగం ఎదురవుతుంది. యితర వ్యక్తులకు సంబంధించి అద్భుతమయిన అవగాహన ఏర్పడుతుంది. క్షమాగుణం కలుగుతుంది. గొప్ప వినయం, నమ్రత, నిరహంకారం, సత్యసంధన, నిజాయితీ, సాధికారం ఏర్పడుతాయి.

అవన్నీ పూలలా వికసిస్తాయి. ఏ ద్వారం గుండా నయినా వెళ్ళు. ప్రేమ మార్గం గుండా వెళ్ళడానికి ప్రయత్నించు. అనురాగం గుండా వెళ్ళడానికి ప్రయత్నించు. ఏదయినా ఫరవాలేదు. దేవుడి ఆలయంలోకి అడుగుపెట్టడానికి ఎన్నో ద్వారాలున్నాయి. కానీ అన్నిటికీ తాళాలున్నాయి. వాటిని తెరవడానికి నీకు తాళం చెవి అవసరం. అదే ధ్యానం, అదే మెలుకువ.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


20 Mar 2022

No comments:

Post a Comment