మైత్రేయ మహర్షి బోధనలు - 91
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 91 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 76. భావములు - పంచభూతములు - 1 🌻
మీ భావలోకములను కంచుకోటవలె పటిష్ఠము గావించు కొనవలెను. మీ యందలి పంచభూతములు, మీ భావముల నాణ్యతను బట్టి వెలుగొందు చుండును. నాణ్యతలేని భావములు మనసున చేరినచో కోటకు బీట్లు వారినట్లే. అపుడు శత్రువులు ప్రవేశింతురు. శరీరమందలి పంచ భూతములు అపుడు కకావికలమై పోవును. ఆరోగ్యము చెడును. నిరాశ, నిస్పృహ చోటు చేసుకొనును. మన పతనమునకు గాని, వృద్ధికి గాని భావములే ప్రధానము.
ఎట్టి క్లిష్ట పరిస్థితిలోను కూడ దీనతను ఆశ్రయింపకూడదు. నిరాశ, నిస్పృహ లను పెంపొందింప జేయకుడు. పంచభూతములకు ఇంద్రుడే అధి దేవత. ఇంద్రప్రజ్ఞ మీ మనోభావములను పనిచేయించును. ఇంద్రుడు పంచభూతాత్మక సృష్టికి రాజు. అనగా రక్షకుడు. అతడు బలహీన పడినప్పుడెల్ల అసురులు ప్రవేశించి సమస్తమును ధ్వంసము చేయుదురు. అట్లే మీ జీవన రాజ్యములకు మీ మనోభావ నాణ్యత రక్షణ.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
20 Mar 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment