నిత్య ప్రజ్ఞా సందేశములు - 252 - 8. నిజంగా చాలా మంది దేవుళ్ళు ఉన్నారా? / DAILY WISDOM - 252 - 8. Are there Really Many Gods?

🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 252 / DAILY WISDOM - 252 🌹

🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 8. నిజంగా చాలా మంది దేవుళ్ళు ఉన్నారా? 🌻


నిజంగా చాలా మంది దేవతలు ఉన్నారా? సమాధానం అవును, మరియు లేదు. కానీ విశ్వం యొక్క అభివ్యక్తి యొక్క వరుస క్రమంలో విషయం-వస్తువు సంబంధం యొక్క అనేక కోణాలు కనుక అనేక మంది దేవతలు ఉన్నారని చెప్పవచ్చు. విషయం మరియు వస్తువుకు మించిన అతీంద్రియ శక్తులు అవి. దేవతలు తెలివైన వారు, మెరిసేవారు. వీరి ఉనికి గురించిన అవగాహన లేదా జ్ఞానం చేతన్య సంబంధం లేకుండా అసాధ్యం. నిజానికి, దేవతలు చాలా మంది కాదు. దేవతల అనేకత్వం అనేది కేవలం చైతన్య స్పృహ లేదా చైతన్య స్థాయిలను సూచించే నామకరణం మాత్రమే. సృష్టి కథలో విశ్వ చైతన్యం, పదార్థముగా దిగి వచ్చే సందర్బంలో ఈ విషయ-వస్తువుల సంబంధాల పరంగా అవి అనేకంగా ఏర్పడ్డాయి.

భారతీయ మత దృక్పథంలో చాలా మంది దేవతలని మనం చూస్తాం. అంటే వంశ దేవతలు, కుటుంబ దేవతలు, ఇష్ట దేవతలు ఇలా అనేకం ఉండడాన్ని మనం గమనించవచ్చు. ప్రకృతి ప్రపంచంలో జరిగే బహుళ రకాల సంఘటనలు మరియు ఆ సంఘటనల వెనుక భౌతికంగా సాధారణ మేధస్సుకు అర్ధం కాని అనేక అతీంద్రీయ కారణాలు ఉన్నాయనే భావన నుండి, ఇలాంటి అనేక విభజనల యొక్క భావనలు ఈ దేవతల ఆవిర్భావానికి స్వయంచాలకం అవుతాయి. ఒక కుటుంబాన్ని, గ్రామాన్ని లేదా సమాజాన్ని రక్షించేందుకు ఒక దేవుడు, పట్టణానికి ఒక దేవుడిని ఇలా అనేకం దృశ్యమానం చేయబడతాయి. దేశం యొక్క దేవుడు లేదా దేవత, యుద్ధ దేవుడు మరియు శాంతి దేవుడు ఇలా అనేక రూపాలతో వ్యక్తిగత, సమాజ స్థాయిలో అరాధనలు జరుగుతాయి.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 DAILY WISDOM - 252 🌹

🍀 📖 from Essays in Life and Eternity 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 8. Are there Really Many Gods? 🌻


Are there really many gods? The answer is yes, and no. There are many gods, because there are many degrees of the subject-object relation obtaining successively in a sequential order of the manifestation of the universe, and these being transcendentally operative powers beyond the subject and the object, they are verily gods, the shining ones, the conscious relation without which perception or knowledge would be impossible. But, in fact, the gods are not many, since their manifoldness is just a nomenclature designating the levels of consciousness through which the Absolute descends in terms of several subject-object relations in the story of creation.

The Indian religious perspective visualises, adores and worships many a god, the god of the house or the family, the god of the village or the community, the god of the town, the god of the nation, the god of war, and the god of peace, and so on, because these concepts of many divinities follow automatically from the concept of there being many superphysical causes behind the multitudinous variety of events and occurrences in the world of nature.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

20 Mar 2022

No comments:

Post a Comment