శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 297 / Sri Lalitha Chaitanya Vijnanam - 297
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 297 / Sri Lalitha Chaitanya Vijnanam - 297 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 69. పురుషార్థప్రదా, పూర్ణా, భోగినీ, భువనేశ్వరీ ।
అంబికా,ఽనాది నిధనా, హరిబ్రహ్మేంద్ర సేవితా ॥ 69 ॥ 🍀
🌻 297. 'హరిబ్రహ్మేంద్రసేవితా' 🌻
విష్ణువు, బ్రహ్మ, ఇంద్రులచే సేవింపబడునది శ్రీదేవి అని అర్థము. చతుర్ముఖ బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు కూడ శ్రీమాత నుండి దిగివచ్చిన వారే. కనక వారునూ వారి వారి కర్తవ్యములను- శ్రీమాతను సేవించుచునే నిర్వర్తింతురు. వారా స్థితులయందుండుటకు కూడ వారి ఆరాధనమే కారణము.
మహాచైతన్యము నుండి త్రిమూర్తులు (3), ద్వాదశాదిత్యులు (12), ఏకాదశ రుద్రులు (11), అష్ట వసువులు (8), అశ్వినీదేవతలు (2) వెలువడిరి. అట్లే కుమారులు (4), ప్రజా పతులు (10), ఋషులు (7), మనువులు (14) ఏర్పడిరి. కాలము కూడ ఏర్పడినది. ఇట్లు 72 అంశములు శ్రీమాత చైతన్యము నుండి ఉద్భవించినవి. ఈ అంశా రూపములన్నియూ శ్రీదేవివే. కావున ఆమెకే ఉన్ముఖమై యుండును.
శ్రీదేవి నారాధించినచో సకల దేవతామూర్తులను కూడ ఆరాధించినట్లే. ఇక ప్రత్యేకముగ ఇతర దేవతల నారాధింప పనిలేదు. శ్రీదేవి రూపమునుగాని, శ్రీమహా విష్ణువు రూపమును గాని ఆరాధింప వచ్చును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 297 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🍀 69. puruṣārthapradā pūrṇā bhoginī bhuvaneśvarī |
ambikā'nādi-nidhanā haribrahmendra-sevitā || 69 || 🍀
🌻 297. Haribrahamendra-sevitā हरिब्रहमेन्द्र-सेविता (297) 🌻
Hari (Viṣṇu), Brahma and Indra worship Her. In Śrī cakra pūja, Hari, Brahma and Indra are all worshipped. The importance of Śaktī worship is underlined in this nāma. The Gods mentioned here are no demigods, but the creator and upholder and the lord of all gods and goddesses.
They too, on their own merits are powerful. Śiva is not mentioned here possibly due to two reasons. He being Her consort, is not worshipped by Her or there is no difference between Śiva and Śaktī. The second interpretation seems to be appropriate. It has been discussed earlier that Brahman is the combination of static and kinetic energy. Though kinetic energy originates from the static energy, the latter cannot function without the aid of the former.
This concept is explained here. Hari (Viṣṇu), Brahma and Indra should not be taken in literal sense. In fact, Veda-s talk about them more frequently than Śaktī. It is also to be understood that mastery of Veda-s alone do not help to realize the Brahman. One has to go beyond Veda-s to understand the Creation and the Creator. Both Creation and the Creator refer to the Supreme Mother or “Ma” as She is fondly called.
The same interpretation is conveyed in Śivānanda Laharī (verse 4) for Śiva. “Thousands of Gods abound, offering trifling gifts to them who pray and never even in my dreams would I pray or request gifts from them. Śiva who is close to Viṣṇu, Brahma and other Gods, but is difficult for them to near Him, I would beseech and beg always for His lotus feet.”
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
06 Aug 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment