తిరుమల ఏడుకొండలు..ఈ ఏడు శక్తి స్థానాలకి.. ప్రతీక



🌹. తిరుమల ఏడుకొండలు..ఈ ఏడు శక్తి స్థానాలకి.. ప్రతీక 🌹

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

🌺. శేషాద్రి 🌺

🌹 1. నిద్రిస్తూ ఉన్న కుండలినీ శక్తిని మేలుకోలపటమే ధ్యానం, ఇది క్రియాయోగం వల్ల సాధ్యపడుతుంది. ధ్యానం చేసేటప్పుడు ఎప్పుడైతే ఈ శక్తి మూలాధార చక్రాన్ని తాకుతుందో అప్పుడు ఈ నిద్రిస్తూ ఉన్న శక్తిని మనం శేషువు తో పోల్చాము, అంటే నిద్రిస్తున్న పాము, అది మేలుకొంటుంది.

#.అందుకే మొదటి కొండకి..🌺 శషాద్రి 🌺అని పేరు.

🌺. వేదాద్రి 🌺


🌹 2. ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని శక్తి స్వాధిస్టాన చక్రాన్ని తాకుతుంది, ఇప్పటికి సాధకుడికి నూటికి 40% సాధించినట్లు. సాధన పట్ల కోరిక, పరమాత్మను కనుక్కోవాలనే ఆరాటం మొదలవుతాయి. ఇక్కడ అంటే స్వాధిస్టాన చక్రం వద్ద వినిపించే శబ్దం వేణుగానం. వేదా అంటే వినటం అని అర్ధం,

#.అందుకే రెండవ కొండకి ..🌺. వేదాద్రి 🌺అని పేరు.


🌺. "గ"రుడాద్రి " 🌺

🌹 3. ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి మణిపుర చక్రాన్ని తాకుతుంది, ఇప్పటికి సాధకుడికి నూటికి 60% సాధించినట్లు, ఇప్పటికి సెల్ఫ్ కంట్రోల్ వచ్చేస్తుంది, జ్ఞాన శక్తి పెరుగుతుంది, గ్రహణశక్తి పెరుగుతుంది. "గ ' కార శబ్దం జ్ఞానానికి ప్రతీక, ఇక్కడికి వచ్చేటప్పటికి సాధకుడు జ్ఞానారూడుడు అవుతున్నాడు.

#.అందుకే మూడవ కొండకి.. 🌺. "గ"రుడాద్రి " 🌺 అనే పేరు. 🌷🌻🌷


🌺. అంజనాద్రి 🌺

🌹 4. ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి అనాహత చక్రాన్ని తాకుతుంది, ఇప్పటికి సాధకుడికి నూటికి 80% సాధించినట్లు. ఇప్పటికి సాధకుడికి స్థూల శరీర స్పృహ తగ్గుతుంది. శరీరం చాల తేలిగ్గా, గాల్లో తేలిపోతున్నట్లు ఉంటుంది, సాధకుడు వాయుపుత్రుడైన ఆంజనేయుడే అవుతాడు.

#.అందుకే నాలుగవ కొండకి.. 🌺.అంజనాద్రి 🌺 అని పేరు. 🌼🌼


🌺. వృషభాద్రి 🌺

🌹 5. #.ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి విశుద్ధ చక్రాన్ని తాకుతుంది, ఇప్పటికి సాధకుడికి నూటికి 100% సాధించినట్లు, భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు. సంసార చక్రాలన్నీ దాటేస్తాడు, అన్ని బంధాలు విడిపోతాయి. ప్రాణ నియంత్రణ శక్తి వస్తుంది . ఇంక పరమాత్మ వైపు పరిగెడుతూ ఉంటాడు. ఎద్దుకి అచ్చు వేసి వదిలేస్తే ఎలా దాని ఇష్టం వచ్చినట్లు పరిగెడుతుందో అలాగ.

#.అందుకే ఐదవ కొండకి.. 🌺. వృషభాద్రి 🌺 అని పేరు.


🌺. వేంకటాద్రి 🌺

🌹 6.#. ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి ఆజ్ఞా చక్రాన్ని తాకుతుంది. ఇప్పుడు దాటి వచ్చిన ఆరు చక్రాలు ఆరు పడగలు విప్పినట్లు అనుకుంటే, ఆ పడగలు కామ, క్రోధ , లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఆరు అరిషడ్వర్గాలని శ్రీకృష్ణుడు #.కాళీయ మర్ధనుడై దర్శనమిస్తూ సాధకుడి నుంచి పోగొట్టినట్లు అనుభూతి పొందుతాడు. మహా వెలుగు, తనే వెలుగైనట్లు అనుభూతి చెందుతాడు. ఇప్పటికి సాధకుడికి, భగవంతుడు ఎదురుగానే ఉంటాడు. తనకి పరమాత్మకి మద్య ఇంకేమి లేదు. పరమశాంతి కలుగుతుంది.

#.అది ఆరవ కొండ.. 🌺. వేంకటాద్రి 🌺 అని పేరు.


🌺. నారాయణాద్రి 🌺

🌹 7. #.తరువాత సాధకుని కుండలిని శక్తి సహస్రార చక్రాన్ని తాకుతుంది, ఇది పరమాత్మ చక్రం. ఇంక అక్కడ సాధకుడు లేడు, నారాయణుడే ఉన్నాడు, సాధకుడు తనే పరమాత్మ అవుతాడు, నారాయణ అంటే వ్యాపించటం అని అర్ధం. అంతటా #తానేయై వ్యాపించేవాడు కాబట్టి నారాయణుడు.

#.అందుకే ఏడవ కొండకి.. 🌺. నారాయణాద్రి 🌺 అనీ పేరు.


#.ఇది యోగ పరంగా తిరుమల ఏడు కొండల అంతరార్ధం. 🍀🍂🍀

#.ఇంతే కాకుండా మనం ఎక్కేటప్పుడు మెట్లని కూడా పరిశీలిన చేస్తే అర్ధం అవుతుంది, అవన్నీ ఇలా 8,16,24,32.... (multiples of eight) లో ఉంటాయి. దీన్ని మనం అష్టాంగయోగం చెయ్యమని చెపుతున్నట్లు అన్వయించుకోవచ్చు.

ఎందుకంటే అష్టాంగయోగం అంటే..

యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన సమాధి. 🌼

🙏. భగవంతుణ్ణి చేరుకొనే ఏడు క్రియలని (కొండల రూపంలో) ఎనిమిది యోగాలని (అష్టాంగయోగం) మెట్ల రూపంలో బాలాజి మనందరికి కళ్ళ ముందు ఉంచారు. కళ్ళు తెరిచి చూస్తే నారాయణులం,

🙏🙏. తెరవకపోతే నరులం. 🌼🌹🌼

🌹 🌹 🌹 🌹 🌹


06 Aug 2021

No comments:

Post a Comment