మైత్రేయ మహర్షి బోధనలు - 72
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 72 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 58. అపౌరుషేయము 🌻
అజ్ఞానమును, అంధ విశ్వాసములను, భీతిని పారద్రోలుట, జ్ఞానమును, సంకల్ప బలమును, ధీరతను పెంపొందించుట మా ప్రణాళికలోని అంశములు. ప్రజ్ఞా వికాసములకు తోడ్పడు ప్రతి ప్రయత్నమునకు మేము తోడ్పడుదుము. తత్సంబంధమైన సంకల్పములను అదృశ్యముగ ప్రోత్సహింతుము. ఊహలను అపోహలను నిర్మూలించి, జీవులకు కర్తవ్యోన్ముఖులను చేయుట కూడ మా ప్రణాళికలో భాగము. శ్రమకోర్చి పనిచేయువారికి సహకారమునందించి సంఘ జీవనమున వారికొక చక్కని ప్రణాళిక నేర్పరచి తీర్చిదిద్దుట తెర వెనుక నుండి నిర్వర్తించు చుందుము.
మాచే ఎన్నుకొనబడిన వారికి స్ఫూర్తిని కలిగించి వారి నుండి సనాతనమగు ధర్మమార్గమును జనజీవనమునకు అందించుట గూడ మా కర్తవ్యములలో ఒకటి. అసామాన్యునివలె శక్తి సామర్థ్యములను గఱపి సామాన్య జీవనమున మా శిక్షితులు లోకహిత కార్యములను నిర్వర్తించు చుందురు. ఉత్తమోత్తమమైన సత్యము, ధర్మము అతి నిర్మలముగను, సామాన్యముగను, రహస్యముగను నిర్వర్తింపబడుట సృష్టి యందలి ధర్మము. ఈ ధర్మమును పాటించుచు వేలాది సంవత్సరములు ప్రత్యేక గుర్తింపు కొఱకు కాక, లోకహితము కొఱకు నిర్వర్తించుట మా విధానము. మే మొనర్చునదంతయు అపౌరుషేయమే.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
12 Feb 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment